జడ్చర్ల ఉప ఎన్నికల్లో పోటీచేయనున్నపోలేపల్లి బాధితులు
జడ్చర్ల ఉప ఎన్నికల బరిలో దాదాపు 50 మంది పోలేపల్లి సెజ్ బాధిత రైతులు పోటీ చేయబోతున్నారు. తమకు జరిగిన అన్యాయం గురించి బయటి ప్రపంచానికి వెల్లడించడం. అదే సమయంలో అన్ని రాజకీయ పార్టీలు తమను మోసగించాయి కనుక వాటికి ఓటు వేయొద్దని నిరసన తెలపడమే లక్ష్యంగా ఈ పోటీ జరగబోతుంది. నిన్న నామినేషన్ల పర్వం మొదలవగా తొలి నామినేషన్ పత్రాని సెజ్ బాధితుడు కుర్మయ్య కొనుగోలు చేశాడు. హోరాహోరీగా జరగనున్న ఈ ఎన్నికల్లో ఈ సెజ్ బాధితుల ఓట్లు కీలకం కానున్నాయి.
కొన్నేళ్ల కిందట ఇదే తెలంగాణలోని నల్లగొండ పార్లమెంటుకు జరిగిన ఎన్నికల్లో తమకు ఫ్లోరిన్ రహిత తాగునీరు కావాలని కోరుతూ నల్లగొండ జలసాధన సమితి ఆధ్వర్యంలో దాదాపు 500 మంది స్థానికులు పోటీ చేశారు. అప్పట్లో ఈ సంఘటన దేశవ్యాప్తంగా చర్చనీయాంశం అయ్యింది.






