పోలేపల్లి ఒక దు:ఖపు వరదగూడు
- శిలాలోలిత
అక్కడో వూరుండేది
అక్కడ మనుషులు౦డేవారు.
చేలూ చెలకాలుండేవి
చెట్టా పట్టాలేసుకుని బతికేవాళ్ళు.
సింగిడి బతుకుల్లో వెలుతురు ముద్దలు౦డేవి
అక్కడో తండా వుండేది.
సేద్యం చేసుకుంటే హాయిగుండే స్ధితుండేది
ఇప్పుడక్కడ ఇవేవీ లేవు
ఈత మొండెం దిగులుగా కన్పిస్తుంది
తల నరికి, పండ్లు నరికి రెక్కలు నరికినట్లుంది
పోలేపల్లి మనుషులంతా ఆ ఈత మొండెం లెక్కనే వున్నారు.
తండా, తండా వరద గూళ్ళ్తె
దు:ఖవర్షాన్ని కురిపిస్తున్నారు.
Read “పోలేపల్లి ఒక దు:ఖపు వరదగూడు’’ Completely







