Fighting Injustice in Polepally SEZ

…more than courage it takes WILL to stand up against injustice !

సంగ్రామ దేవత

leave a comment »

- హెచ్. వాగీశ్

Kaki Demudamma

Kaki Demudamma

కష్టాలు తప్పడంలేదు
కన్నీళ్ళు తప్పడంలేదు
పోరాటమూ తప్పడంలేదు
మూడుముక్కల్లో యుద్ద సారాంశం

మట్టినుంచి మనిషిని
వేరుచేస్తున్న పేరాశకు
భూమి బువ్వ బతుకు లంకెను
తెలుపుతున్న జ్ఞానభోధిని

గనులకోసం వనాలనూ
ఖనిజాకోసం నిజాలనూ
వాళ్ళెవరికోసమో ఊళ్ళనూ
తగలబెడుతున్నప్పడు
కడుపు మంటల కన్నకూతురు

భద్రాతాభ్రమల ముసుగులో
ముడుచుకు పడుకున్నట్టున్న
మనల్ని మేల్కోమంటున్న
చీకటిలో చిరుదివ్వ వెల్గుపాట

సమస్యా సమరమూ
నాగరికులకూ తప్పవని తెలిపి
కలుపుకు పోయేందుకు
నగరానికి నడిచొచ్చిన
సంగ్రామ దేవత

జాతి ప్రయోజనం కోసం
నిలబడ్డ నీతిగల తల్లి
సామాన్య ప్రజల అసామాన్య శక్తి
ఆ ఆదివాసి ఆడకూతురు
దేవుళ్ళకూ అమ్మ – కాకి దేవుడమ్మ

27, 28 డిసెంబరు హైదరాబాదులో జరిగిన భూనిర్వాసితుల ఐక్య సంఘటన సదస్సులో, విజయనగరం జిల్లా, శృంగవరపుకోట మండలానికి చెందిన, బాక్సైట్ తవ్వకం పేరిట గెంటివేతను ఎదురుకోబోతున్న “గదబ” ఆదివాసీ ఆడకూతురు నిర్వాసితుల పోరాటానికి ముందువరసలో ఉన్న కాకి దేవుడమ్మ మాటలు విన్న తరువాత… ఈ వాక్యాలు ఆమె స్పూర్తితో ఆమెకోసం… మనందరి కోసం… – హెచ్. వాగీశ్

Leave a Reply