Fighting Injustice in Polepally SEZ

…more than courage it takes WILL to stand up against injustice !

యుద్ధం ముగియలేదు

leave a comment »

ప్రియమైన శాంతి కాముకులారా!
మా పసిమొగ్గల పచ్చినెత్తురుతో
శాంతిని అభిషేకించండి
ఛిద్రమైన మా తల్లుల మర్మాంగాలతో
మీ దేశ చిత్ర పటాన్ని లిఖించండి
నోటితో కాకుండా శాంతి మంత్రం పలకండి
మా అస్తిత్వపు అస్థికలపై మీ నిరంకుశపు జెండాలెగరేయండి
తెగిపడ్డ మా పేగు బంధాల కుప్పలపై
విజయం ప్రకటించండి
తెల్ల తోడేళ్ళు విదిలించిన రంగును పెదాలకు పులుముకొని
భూమిని ముద్దాడి ఎంగిలి చేయండి
మీ దురహంకారపు కోటలు బద్దలు కొట్టడానికి
గడ్డిపరకలే పులులకు పురుడు పోస్తాయి
గుర్తుంచుకోండి…
యుద్ధం ముగిసిందంటే
కొత్త యుద్ధం మొదలయిందనే..!

- మధు కాగుల
పోలేపల్లి సెజ్‌ వ్యతిరేక ఐక్య సంఘటన

Written by మధు కాగుల

May 21, 2009 at 8:14 pm

Posted in AndhraJyothy, Poetry, Telugu

Leave a Reply