Fighting Injustice in Polepally SEZ

…more than courage it takes WILL to stand up against injustice !

Archive for the ‘Telugu’ Category

సెజ్‌ బాధిత మహిళల అరెస్టు

with one comment

జడ్చర్ల గ్రామీణం, న్యూస్‌టుడే: కేసు వివరాలేవి తెలుపకుండా సెజ్‌ బాధితులను పోలీసులు అరెస్టు చేయడంతో జడ్చర్ల మండలం పోలేపల్లి గ్రామం ఉలిక్కిపడింది. ఈ విషయంపై టీవీల్లో వార్తలు రావడంతో చర్చనీయాంశమైంది. చివరకు జడ్చర్ల కోర్టు న్యాయమూర్తి ఎదుట హాజరు పర్చగా బెయిల్‌పై విడుదల కావడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. Read the rest of this entry »

Written by JayaPrakash Telangana

June 8, 2009 at 8:20 am

యుద్ధం ముగియలేదు

with one comment

ప్రియమైన శాంతి కాముకులారా!
మా పసిమొగ్గల పచ్చినెత్తురుతో
శాంతిని అభిషేకించండి
Read the rest of this entry »

Written by మధు కాగుల

May 21, 2009 at 8:14 pm

Posted in AndhraJyothy, Poetry, Telugu

సత్తా చాటిన సెజ్‌ బాధితులు

leave a comment »

15 మంది అభ్యర్థులకు 65 వేల ఓట్లు | ప్రధాన పార్టీల గెలుపును శాసించిన ‘పోలేపల్లి’

(మహబూబ్‌నగర్‌ -ఆన్‌లైన్‌ ప్రతినిధి) మహబూబ్‌నగర్‌ పార్లమెంటుకు పోటీచేసిన పోలేపల్లి సెజ్‌ బాధితులు ప్రధాన పార్టీ అభ్యర్థుల గెలుపును ప్రభావితం చేశారు. 15 మంది బాధితులు పోటీచేసి 65 వేల ఓట్లు సంపాదించారు. ఇక్కడ గెలుపొందిన కేసీఆర్‌కు 20,184 ఓట్ల ఆధిక్యత లభించింది. సెజ్‌ బాధితులు పోటీలో లేకుంటే.. ఈ ఓట్లు కాంగ్రెస్‌కు వెళ్లివుంటే కేసీఆర్‌ ఓటమి బాట పట్టేవారే. ఈవిధంగా సెజ్‌ బాధితులు ఎన్నికల్లో పోటీచేసి తమ సమస్యను లోకానికి చాటిచెప్పారు. జడ్చర్ల ఉప ఎన్నికల్లోనూ సెజ్‌ బాధితులు పోటీచేసి టీఆర్‌ఎస్‌కు ఇబ్బంది కలిగించారు.

Read the rest of this entry »

Written by Sujatha Surepally

May 18, 2009 at 4:58 pm

సెజ్‌ బాధితులకు 94 వేల ఓట్లు

leave a comment »

స్టేషన్‌ మహబూబ్‌నగర్‌, మేజర్‌న్యూస్‌: మహబూబ్‌నగర్‌ పార్లమెంట్‌ స్థానానికి పోటీ చేసిన 15 మంది సెజ్‌ బాధితులు 80వేలకు పైగా ఓట్లు సాధించడం గమనార్హం. తాము లక్ష ఓట్లు సాధిస్తామని బాధితులు మొదటినుంచి ప్రకటిస్తున్నారు. వారి అంచనాలకు తగ్గట్టుగానే ఓట్లు రావడం విశేషం. వారిలో రవీందర్‌గౌడ్‌ అనే బాధితుడు 13,396 ఓట్లు సాధించగా, కర్రె జంగయ్య 11,268 బుడిగెజంగం లక్ష్మమ్మ 9,811, వీరితో పాటు బీఎస్పీ అభ్యర్థిగా సెజ్‌ బాధితుడైన పాలెం సుదర్శన్‌గౌడ్‌ సైతం బరిలో ఉన్నారు, ఇతడు 13,593 ఓట్లు సాధించారు. ఇవి కలిపితే సెజ్‌ బాధితులకు పోలైన ఓట్లు 94 వేలు దాటుతున్నాయి. Read the rest of this entry »

Written by Polepally InSolidarity

May 18, 2009 at 4:49 pm

ఎన్నికల ఫలితాన్ని తారుమారు చేయనున్న సెజ్ బాధితులు

leave a comment »

ఏప్రిల్ 16 నాడు జరిగిన ఎన్నికల్లో పోటీ చేసిన పోలేపల్లి సెజ్ బాధితులు మహబూబ్ నగర్ జిల్లాలోని కొన్ని అసెంబ్లీ స్థానాల్లో గెలుపోటముల్ని నిర్దేశించే అవకాశం ఉందని “సూర్య” దినపత్రిక మే 9 నాడు ఒక కథనం రాసింది.

polepally-suryanews

Courtesy: Surya Daily – 9th May 2009

Written by Konatham Dileep

May 11, 2009 at 9:45 am

Posted in News Archive, Telugu

పోటీతో.. పోలేపల్లి నిరసన

with one comment

ఓటుతో ప్రభుత్వ వ్యతిరేకత సమీకరణ | పాలమూరు లోక్‌సభకు 15 మంది పోటీ

మహబూబ్‌నగర్‌,న్యూస్‌టుడే: పోలేపల్లి రైతులకు పొలం..ఇళ్లు తప్ప మరేదీ తెలియదు..ఉదయం లేవగానే పశువులను చెలకలకు తీసుకెళ్లి..పొద్దుపోయిన తర్వాత ఇంటికొచ్చి జొన్న గటకలో పచ్చి మిరపకాయ నంజుకొని హాయిగా కాలం వెళ్లదీసేవారు..కాని సెజ్‌ వాళ్ల జీవితాలపై పిడుగు వేసింది.. ఉన్న 800 ఎకరాలు పోయాయి..రైతుల జీవితాలు బీళ్లుగా మారాయి. చచ్చినా పూడ్చేందుకు స్థలం లేకుండా పోయింది.. ఒకప్పుడు పచ్చని పొలాల్లో బిక్కుబిక్కుమంటూ గట్ల వెంటున్న చింతచెట్లే ఇపుడు ఉద్యమానికి నీడనిస్తున్నాయి… Read the rest of this entry »

Written by Konatham Dileep

April 22, 2009 at 11:41 am

Posted in News Archive, Telugu

పోలేపల్లిలో పుస్తకావిష్కరణ

with 11 comments

జడ్చర్ల గ్రామీణం, న్యూస్‌టుడే: ‘నేను పోలేపల్లి పీనుగను మాట్లాడుతున్నా’ పుస్తకాన్ని విప్లవ రచయితల సంఘం నాయకులు వరవరరావు ఆవిష్కరించారు. సోమవారం జడ్చర్ల మండలం పోలేపల్లిలో సెజ్‌ బాధిత రైతులతో కలిసి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇందులో పోలేపల్లి బాధితుల కథనాలు ఉన్నాయి. కార్యక్రమంలో గీతాంజలి తదితరులు పాల్గొన్నారు. అనంతరం మొదటిసారిగా పోలేపల్లిని సందర్శించిన వరవరరావు గ్రామంలో పర్యటించి బాధితులతో మాట్లాడారు.

ఈనాడు దినపత్రిక (14 ఏప్రిల్ 2009)

Written by Konatham Dileep

April 15, 2009 at 8:55 am

పోలేపల్లి బాధితుల ఎన్నికల కరపత్రం

with one comment

(పూర్తి చిత్రం కొరకు బొమ్మపై నొక్కండి)

Read the rest of this entry »

Written by మధు కాగుల

April 10, 2009 at 8:54 pm

ఒక ఆశ….ఒక నిరాశ

leave a comment »

గుక్కెడు ‘మంచి’ నీళ్ల కోసం దశాబ్దాల తరబడి ఆందోళన చేస్తున్న నల్లగొండ జిల్లాకు చెందిన ఫ్లోరైడ్‌ బాధితులు, పాలకుల పారిశ్రామికీకరణ విధానాల మూలంగా సర్వం కోల్పోయిన మహబూబ్‌నగర్‌ జిల్లా పోలేపల్లి సెజ్‌ నిర్వాసితులు ఈ ఎన్నికల్లో పోటీ చేయడం ద్వారా తమ సమస్యలను ప్రపంచానికి చాటిచెప్పాలనుకున్నారు. ఫ్లోరోసిస్‌ బాధితురాలు తిరుపతమ్మ మునుగోడు శాసనసభ నియోజకవర్గంలో నామినేషన్‌ వేయగా అఫిడవిట్‌లో ఆస్తుల వివరాలు పేర్కొనలేదన్న కారణంగా అధికారులు ఆమె నామినేషన్‌ను తిరస్కరించారు. కాగా, మహబూబ్‌నగర్‌ లోక్‌సభ స్థానానికి 16 మంది సెజ్‌ నిర్వాసితులు నామినేషన్‌ వేసి బరిలో నిలిచారు.

Read the rest of this entry »

Written by Konatham Dileep

April 6, 2009 at 9:21 am

Posted in Articles, Telugu

మరో ఆర్తగీతం

leave a comment »

- అల్లం నారాయణ

ఇప్పుడంతా జాతర. సమ్మక్క సారక్క జాతరల శివ్వాలు తూలినట్టు, ఇప్పుడు ఓ నెలరోజులు అన్ని పార్టీలూ శివ్వాలు తూలుతాయి. అటెంక మళ్లీ అయిదేండ్లదాకా.. రారెవ్వరు? గుద్దు ఇప్పుడే.. కక్షకట్టి అందరి ముఖాల మీదా ముద్దెర. మాయామోహం చూపుతున్న ముఖాల మీద…

‘కడుపున కాయో, పండో కాయకుంటే నే బాగుండు’ పండంటి పాపను కని అంగట్ల అమ్ముకోవడం ఇప్పుడు పాతబడిపోయింది. పాలసేపులు బిడ్డా. ఎవరికి చెప్పుకోను. పాలసేపుల కన్నకడుపు కోత బాధ. ఆరుస్తరా! తీరుస్తరా! పాణం బిగపడ్తది. మనసుల అగ్గిరేగుతది. Read the rest of this entry »

Written by JayaPrakash Telangana

April 4, 2009 at 7:34 pm

Polepally Farmers Need Your Support

leave a comment »

మన సద్దులు మన సుద్దులు
మన వనర్లు మన బతుకులు
మనం తీర్చిదిద్దుకునే
తెలంగాణ తేవాలె

- వరవర రావు
 

Dear Friends,
 
Thanks to all friends who have given the moral support to Polepally team in their fight for justice. Sixteen candidates from Polepally have filed nominations against all odds.
 
It would not have been possible without the support of many friends and more particularly the timely support and encouragement of Bharath Bhushan, Vidya Bhushan Rawat, Radha Reddy, Vanaja and Biju Mathew, who met Polepally team in the recent press meet and also visited the village once and continued to extend the support their struggle in all forms.

Read the rest of this entry »

Written by Sujatha Surepally

April 2, 2009 at 9:23 am

Posted in English, Pamphlets, Telugu

కేసీఆర్, విఠల్ రావులకు పోలేపల్లి సెగ

with one comment

polepally-elections2009మహబూబ్‌నగర్‌ పార్లమెంట్‌కు 16 మంది నిర్వాసితుల నామినేషన్‌
మా భూమి మాకు ఇవ్వాలి ఇదే వారి ప్రధాన డిమాండ్‌

(మహబూబ్‌నగర్‌ – ఆన్‌లైన్‌ ప్రతినిధి) మహబూబ్‌నగర్‌ పార్లమెంట్‌ ఎన్నికల్లో ఈసారి పోలేపల్లి సెజ్‌ నిర్వాసితుల అంశం కూడా ప్రధాన సమస్యగా మారనున్నది. ఈ స్థానం నుంచి 16మంది సెజ్‌ బాధితులు సోమవారం నామినేషన్లు దాఖలు చేయడం సంచలనంగా మారింది. పాలకులు, రాజకీయ పార్టీలు తమకు న్యాయం చేయనందుకు నిరసనగానే తాము ఎన్నికల బరిలో నిలవాలని నిర్ణయించినట్లు బాధితులు వివరించారు.

Read the rest of this entry »

Written by Konatham Dileep

March 31, 2009 at 9:54 am

బ్యాలెట్టే నిరసన బావుటా

with one comment

- సుజాత సూరేపల్లి

అభివృద్ధి పేరిట ప్రభుత్వం అమలు పరుస్తున్న వివిధ ప్రాజెక్టులు చట్ట విరుద్ధమైనవి. పేదల జీవనాధారాలను హరించివేయడమే కాదు పర్యావరణానికి కూడా ఎనలేని నష్టాన్ని కలుగజేస్తున్నాయి. ప్రధాన స్రవంతి రాజకీయ పక్షాలేవీ వీటికి వ్యతిరేకంగా ఉద్యమించడం లేదు. పేదల హక్కులను కాపాడడం లేదు. ఈ పరిస్థితులలో పేదలు తమకుతామే పోరాడక తప్పదు.
Read the rest of this entry »

Written by Sujatha Surepally

March 29, 2009 at 8:42 pm

పార్లమెంట్‌కు పోలేపల్లి సెజ్‌ బాధితుని నామినేషన్‌

leave a comment »

మహబూబ్‌నగర్‌,మార్చి28(ఆన్‌లైన్‌): ముందు ప్రకటించినట్లుగానే పోలేపల్లి సెజ్‌ బాధితులు ఎన్నికల పోరుకు సిద్ధమవుతున్నారు. రెండు రోజుల కింద 20 మంది సెజ్‌ బాధితులు మహబూబ్‌నగర్‌ ఎంపీ స్థానానికి పోటీ చేస్తామని ప్రకటించారు. ఇందులో భాగంగా శనివారం సీనయ్యగౌడ్‌ నామినేషన్‌ దాఖలు చేశారు. డాక్యుమెంట్ల వివరాలను తెలుసుకునేందుకే తాను ముందుగా నామినేషన్‌ వేశానని, మిగతా 19మంది సోమవారం దాఖలు చేస్తారని సీనయ్య తెలిపారు.

Written by JayaPrakash Telangana

March 29, 2009 at 8:39 pm

పోలేపల్లి ‘పోల్‌’ బాట

leave a comment »

పార్టీల మోసంపై మరోసారి తిరుగుబాటు
మహబూబ్‌నగర్‌ లోక్‌సభకు 20 మంది

పోలేపల్లి 'పోల్‌' బాట

పోలేపల్లి 'పోల్‌' బాట

మహబూబ్‌నగర్‌, మార్చి 26 (ఆన్‌లైన్‌): పోలేపల్లి బాధితులు ఎన్నికల్లో పోటీచేస్తామని ప్రకటించడంతో కాంగ్రెస్‌ పార్టీ గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి. మహబూబ్‌నగర్‌ పార్లమెంట్‌ స్థానం నుంచి పోలేపల్లికి చెందిన 20 మంది నిర్వాసితులు పోటీచేసేందుకు సిద్ధమయ్యారు. ఒక స మస్యపై ఇంతమంది బాధితులు ఎన్నికల బరిలోకి దిగడం జిల్లా ఎన్నికల చరిత్రలో ఇదే ప్రథమం.

Read the rest of this entry »

Written by JayaPrakash Telangana

March 27, 2009 at 11:18 pm

Follow

Get every new post delivered to your Inbox.