Archive for the ‘Songs’ Category
నీలొల్లి నా లొల్లి సెజ్‌ల నెల్లగొట్టె లొల్లి !
- గొపాల్
నీ లొల్లి నా లొల్లి సెజ్‌ల నెల్లగొట్టే లొల్లి
పొలమాక్రమించి నోన్ని
పొలిమేర దాటెల్లగొట్టు
పల్లె పల్లె లొల్లి బెట్టు || నీ లొల్లి… ||
వాన పాములు నత్త గుల్లలు
అడవి ఎలుక పిల్లలురా
మా గుట్టల మీద కుందేలు
దుంపులు ఏడ పొయెనుర
సింతమాను సిగురు మీద
ఉడుత పిల్ల గూడేది
మద్ది మాను కింద ఊరె
మంచినీటి బుగ్గేది
ఆ పల్లె అంచు జొన్న సేలో
వాలే ఊర పిట్టాలేవి || నీ లొల్లి… || Read the rest of this entry »







