Fighting Injustice in Polepally SEZ

…more than courage it takes WILL to stand up against injustice !

Posts Tagged ‘నాగబాబు

తిలాపాపం తలాపిడికెడు

leave a comment »

సెజ్ పేరిట దేశదేశాల సంపన్నుల ప్రయోజనాలకోసం తమ భూములనూ జీవనోపాధినీ జీవనాన్నీ కోల్పోయిన పోలేపల్లి గ్రామ ప్రజలు తెలిసో తెలియకో మన రాజకీయ పక్షాల, నాయకుల రంగులు బయటపెడుతున్నారు. ఒక అమాయక, బాధిత గ్రామంలో ఒక ముఖ్యమైన రాజకీయ నిర్ధారణ ఈ విధంగా వెల్లువెత్తడం ఆశ్చర్యమేమీ కాదు. ఇదివరకు అనేక గ్రామాలు, అనేక పరిణామాలు ఈ విషయాన్ని రుజువుచేశాయి. కాని ఇది మరొకసారి మనపక్కనే, హైదరాబాదుకు కూతవేటు దూరంలో నిరూపించబడుతున్నది.
Read Completely >>

సెజ్‌ బాధిత రైతుల బతుకు ఘోరం – నాగబాబు

leave a comment »

సెజ్‌ బాధిత రైతుల బతుకు ఘోరం - నాగబాబు

సెజ్‌ బాధిత రైతుల బతుకు ఘోరం - నాగబాబు

బడాబాబులకు పేదల భూములు

పరిహారంతో తిరిగి పొలం కొనగలరా?
సెజ్‌ బాధిత రైతుల బతుకు ఘోరం
చావే దిక్కయ్యే పరిస్థితి
బాధితులకు మనం మద్దతివ్వాలి
నాగబాబు వ్యాఖ్యలు

హైదరాబాద్‌, న్యూస్‌టుడే: ప్రత్యేక ఆర్థిక మండళ్ల(సెజ్‌ల) పేరుతో పేద రైతుల భూములను బడా బాబులకు కట్టబెడుతున్నారని సినీ నటుడు చిరంజీవి సోదరుడు నాగేంద్రబాబు విమర్శించారు. ”వారిచ్చే పరిహారంతో తిరిగి పొలం కొనుక్కొనే పరిస్థితి లేదు. పని దొరక్క, ఆహారంలేక జడ్చర్ల లాంటి చోట్ల బాధితులు మరణించడమే శరణ్యమయ్యేలా ఉంది. సెజ్‌లు ఏర్పాటవుతున్న ప్రతిచోటా దారుణమే. మత్స్యకారుల బతుకు ఘోరం. ఇలాంటి బాధితులందరికీ మనం మద్దతివ్వాలి. చిరంజీవి స్పందించి, బాధ్యత తీసుకొని రాబోతున్నారు. ఆయన్ను అనుసరించే వారందరికీ బంగారు భవిష్యత్తు ఉంటుంది” అని పేర్కొన్నారు. Read the rest of this entry »

Follow

Get every new post delivered to your Inbox.