Fighting Injustice in Polepally SEZ

…more than courage it takes WILL to stand up against injustice !

Posts Tagged ‘సెజ్‌

పనులను అడ్డుకున్నపోలేపల్లి సెజ్‌ బాధితులు

without comments

జడ్చర్ల, ఫిబ్రవరి 4(ఆన్‌లైన్‌): ఎపిఐఐసిలో నిర్మించే ప్రహరీనిర్మాణం పనుల ను బుధవారం పోలేపల్లి సెజ్‌ బాధితులు అడ్డుకున్నారు. నిర్వాసితులకు కేటాయించిన స్మశానవాటిక స్థలంలో ప్రహరీనిర్మాణం చేపడ్తున్నారని ఆరోపిస్తూ ప నులను అడ్డుకున్నారు. Read the rest of this entry »

ఇంకొ పానం బలై పోయిందా !

with one comment

రాములన్న క్షమించే
నాలుగేండ్లు నలభై మంది సచ్చినా
ఎవరెన్ని చెప్పినా అన్యాయాన్ని ఎదిరించి పోరాడినా
అన్నా ఇంకొక దీపం ఆరిపోకుండ ఆపుకోలేకపోయినమే
Read the rest of this entry »

మనోవేదనతో సెజ్‌ బాధితుడి మృతి

without comments

జడ్చర్ల, బాలానగర్‌, నవంబర్‌20 (ఆన్‌లైన్‌): పోలేపల్లి సెజ్‌లో భూమి కోల్పోయిన ఓ రైతు మనోవేదనతో గురువారం మృతి చెందాడు. బాలానగర్‌ మండలం రాయపల్లి గ్రామానికి చెందిన పాలెం రాములుగౌడ్‌ పోలేపల్లి సెజ్‌కు భూ సేకరణలో సర్వే నంబర్‌ 420లోని ఆరు ఎకరాల 28 గుంటల భూమిని కోల్పోయాడు. Read the rest of this entry »

పోలెపల్లి సెజ్‌ బాధితులకు పాలమూరు ఎన్నారైల పరామర్శ

without comments

tnri2పోలేపల్లి, నవంబర్‌ 21 : పోలేపల్లి సెజ్‌ బాధితులను ఎన్నారై ప్రతినిధులు పరామర్శించి వారి కష్ట సుఖాలను అడిగి తెలుసుకున్నారు. విజయ్‌ చవ్వ మరియు రేణుక వెలిదన ఆధ్వర్యంలోని ఎన్నారైల బృందం పోలేపల్లి సెజ్‌ బాధితులను పరామర్శించింది. పోలేపల్లి సెజ్‌ బాధితుల ఐక్య కార్యాచరణ సమితి కన్వీనర్లు సుజాత సూరేపల్లి, మధుకగుల ఎన్నారై బృందానికి దగ్గరుండి బాధితుల గోడును వినిపించారు.

Read the rest of this entry »

భూములెందుకు ఇచ్చేయాలి?

without comments

-కె.బాలగోపాల్‌

సకల మానవ ప్రాకృతిక వనరులనూ పెట్టుబడికి దాసోహం చేయడమే పాలకుల అభివృద్ధి నమూనా. దీనికి ప్రత్యామ్నాయం లేదా అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ప్రకృతిని ప్రజల జీవన వనరుగా గుర్తించి , వారి జీవన ప్రమాణాలను క్రమంగా మెరుగుపరిచే దిశగా వారి భాగస్వామ్యంతో దేశ ఆర్థిక వ్యవస్థను అభివృద్ధి చేయడం సాధ్యం కాదా?

Read the rest of this entry »

Written by JayaPrakash Telangana

October 8, 2008 at 2:24 am

భూమికి భూమే పరిష్కారం

without comments

Madhu Kagula

Madhu Kagula

వెలుగు ప్రాజెక్టులో ఉద్యోగిగా ఉన్న మధుకాగుల ఇప్పుడు ఉద్యమకారునిగా మారిపోయారు. పోలేపల్లి సెజ్‌ బాధితుల తరపున తెలంగాణ ఐక్య సంఘటన ఏర్పాటు చేసి సాగిస్తున్న పోరాటం రాష్ట్రంలోనే సంచలనంగా మారింది. మొన్న దేవేందర్‌గౌడ్‌, నారాయణ, నిన్న బంగారు లక్ష్మణ్‌, చిరంజీవి సెజ్‌ల పోరాటానికి పోలేపల్లిని వేదికగా ఎన్నుకున్నారు. Read the rest of this entry »

దళారీ ప్రభుత్వం – సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె. నారాయణ

without comments

జడ్చర్ల, అక్టోబర్‌ 2 (ఆన్‌లైన్‌) పేద రైతుల భూములను బలవంతంగా స్వాధీనం చేసుకొని ప్రైవేట్‌ సంస్థలకు అమ్ముకుంటూ ప్రభుత్వం భూ దళారిగా మారిందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణ విమర్శించారు. మహబూబ్‌నగర్‌ జిల్లా పోలేపల్లి సెజ్‌ వ్యతిరేక ఐక్య సంఘటన ఆధ్వర్యంలో సాగుతోన్న భూసత్యాగ్రహ శిబిరంలో గురువారం ఆయన బాధితులనుద్దేశించి ప్రసంగించారు.

Read the rest of this entry »

Written by Konatham Dileep

October 3, 2008 at 4:54 pm

భూమికి భూమి ఇవ్వాల్సిందే: ప్రజారాజ్యం నేత నాగబాబు

without comments

జడ్చర్ల, అక్టోబర్‌ 2 (ఆన్‌లైన్‌): పోలేపల్లి సెజ్‌ బాధితులకు భూమికి భూమి ఇవ్వాల్సిందేనని ప్రజారాజ్యం పార్టీ నేత నాగబాబు డిమాండ్‌ చేశారు.మహబూబ్‌నగర్‌ జిల్లా జడ్చర్ల మండలంలోని పోలేపల్లి సెజ్‌లో బాధితులు నిర్వహిస్తోన్న భూ సత్యాగ్రహం శిబిరంలో గురువారం ఆయన ప్రసంగించారు. Read the rest of this entry »

Written by Konatham Dileep

October 3, 2008 at 4:52 pm

సామ్రాజ్యవాద కుట్ర ‘సెజ్‌’

without comments

రూపకర్త బాబు.. అనుసరణ వైఎస్‌: గద్దర్‌

జడ్చర్ల, సెప్టెంబర్‌ 30 (ఆన్‌లైన్‌): ‘సెజ్‌’ సామ్రాజ్యవాద కుట్ర అని ప్రజా గాయకుడు గద్దర్‌ ధ్వజమెత్తారు. మహబూబ్‌నగర్‌ జిల్లా పోలేపల్లి సెజ్‌ వ్యతిరేక ఐక్య సంఘటన ఆధ్వర్యంలో సాగుతోన్న భూ సత్యాగ్రహ శిబిరాన్ని మంగళవారం సందర్శించిన సందర్భంగా ఆయన విలేఖరులతో మాట్లాడారు.

Read the rest of this entry »

బాంబుల వర్షం కురిసిన భయపడొద్దు

without comments

* ‘సెజ్‌’ బాధితులకు గద్దర్‌ బాసట          * భూములిచ్చే దాక పోరాడండి
* వైఎస్‌, చంద్రబాబు ఒకే గూటి పక్షులు     * బాధితులతో కలిసి ఆటపాట

జడ్చర్ల, న్యూస్‌టుడే: అన్నం పెట్టే రైతు కావాలో… విషాన్ని పంచే కంపెనీలు కావాలో.. రైతు రాజ్యమంటున్న వైఎస్‌ తేల్చుకోవాలని ప్రజా గాయకులు గద్దర్‌ సవాల్‌ విసిరారు. పోలేపల్లి బాధితులకు ఏం న్యాయం చేస్తారో సీఎం స్వయంగా ఇక్కడికి వచ్చి ప్రకటించాలని ఆయన డిమాండ్‌ చేశారు. మంగళవారం సాయంత్రం పోలేపల్లి సెజ్‌ బాధితుల సత్యాగ్రహంలో ఆయన పాల్గొని తన మద్దతును ప్రకటించారు. Read the rest of this entry »

మళ్లీ భూ సేకరణ చేయండి

without comments

మానవ హక్కుల వేదిక కన్వీనర్‌ బాలగోపాల్‌
జడ్చర్ల, అక్టోబర్‌ 1 (ఆన్‌ లైన్‌) : మహబూబ్‌నగర్‌ జిల్లా జడ్చర్ల మండల పరిధిలోని పోలేపల్లి సెజ్‌కు భూసేకరణ నియమ, నిబంధనలకు విరుద్ధంగా జరిగిందని మానవ హక్కుల వేదిక కన్వీనర్‌ బాలగోపాల్‌ ఆరోపించారు. భూ సత్యాగ్రహం శిబిరాన్ని బుధవారం సందర్శించిన ఆయన బాధితులనుద్దేశించి ప్రసంగించారు.

Read the rest of this entry »

Written by JayaPrakash Telangana

October 1, 2008 at 1:06 am

భూమికోసం

without comments

- అల్లం నారాయణ

bhumi kosam

illustration : Akbar

ఈ భూమి కోసమే చరిత్ర నెత్తురోడింది. ఈ భూమి కోసమే మహా యుద్ధాలు జరిగాయి. ఈ భూమి కోసమే భారత రైతాంగం విముక్తి పోరాటాలు నడుపు తున్నది. భూమి చుట్టూ బతుకున్నది. పోరాటమున్నది. చరిత్ర మరిచిపోతే ఇప్పటి ఏలికలనూ ఈ భూమి చుట్టుకునే అవకాశమూ ఉన్నది.

Read the rest of this entry »

పోలేపల్లి పాపం తెలుగుదేశానిదే: వైయెస్

without comments

(Courtesy: Sakshi 30th Sept 2008)

అఖిలపక్ష చర్చ జర్పించాలి :ఎన్‌టీపీపీ నేత పెద్దిరెడ్డి డిమాండ్‌

without comments

జడ్చర్ల, న్యూస్‌టుడే: సెజ్‌ అంశంపై అఖిలపక్ష చర్చ జర్పించాలని నవతెలంగాణ ప్రజాపార్టీ (ఎన్‌టీపీపీ) నేత పెద్దిరెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. సోమవారం పోలేపల్లి బాధితుల భూసత్యాగ్రహంలో పాల్గొని మద్దతు తెలిపారు. సెజ్‌ల పేరుతో పేదల భూములను లాక్కొని వారి బతుకులను రోడ్ల పాలు చేస్తున్నారని మండిపడ్డారు. అనంతరం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. Read the rest of this entry »

వైఎస్‌కు మా ఉసురు ముడ్తది

without comments

జడ్చర్ల, సెప్టెంబర్‌ 28 (ఆన్‌లైన్‌) సారూ… మా భూములు పోయినయి… మా బతుకులు బజారున పడినయి… భూములు పోతే బతుకులు ఎట్లా ఉంటాయో వై.ఎస్‌కు తెలవదా?… మాది మాకు విషం చేస్తున్నాడు… మా ఉసురు వైఎస్‌కు ముడ్తది… ఇక్కడున్న కంపెనీ వాళ్ళకు కలెక్టరమ్మ అమ్ముడు పోయింది…మా ఎమ్మెల్యే దొంగ … అంటూ ప్రొఫెసర్‌ హరగోపాల్‌ ముందు పోలేపల్లి సెజ్‌ భాదితులు తమ గోడు వెళ్లబోసుకున్నారు. పోలేపల్లి సెజ్‌ వ్యతిరేక ఐక్య సంఘటన ఆధ్వర్యంలో నిర్వహిస్తోన్న భూ సత్యాగ్రహ శిబిరాన్ని హరగోపాల్‌ బృందం ఆదివారం సందర్శించారు.

సెజ్‌ బాధితులకు అండగా ఉంటామని హరగోపాల్‌ ఈ సందర్భంగా హమీ ఇచ్చారు.

పత్రికారంగం మీ వెంట ఉంటుంది : ఆంధ్రజ్యోతి సంపాదకులు శ్రీనివాస్‌

సెజ్‌ బాధితుల న్యాయమైన పోరాటానికి పత్రికారంగం అండగా ఉంటుందని ఆంధ్రజ్యోతి దినపత్రిక ఎడిటర్‌ కె శ్రీనివాస్‌ బాధితులకు భరోసా ఇచ్చారు. పోలేపల్లి రైతులకు న్యాయం జరిగేదాకా వార్తలు రాస్తూ అండగా ఉంటామని చెప్పారు.

(Courtesy: AndhraJyothy 29th Sept 2008)