Fighting Injustice in Polepally SEZ

…more than courage it takes WILL to stand up against injustice !

ఆంధ్రప్రదేశ్‌లో ఏర్పాటు కానున్న ఎస్‌ఇజెడ్‌లు

leave a comment »

ఔషధాలు, బయోటెక్నాలజీ ఇతర పరిశ్రమలు

క్ర.సం. సంస్థ పేరు స్థలం ఉత్పత్తి విస్తీర్ణం (హె||)

  1. దివీస్‌ లాబరేటరీస్‌ లిమిటెడ్‌ చిప్పాడ, విశాఖపట్నం ఔషధాలు 101
  2. రాంకీ ఫార్మాసిటీ లిమిటెడ్‌ లేమర్తి, విశాఖపట్నం ఔషధాలు 243
  3. హెటెరో డ్రగ్సు లిమిటెడ్‌ నక్కపల్లి, విశాఖపట్నం ఔషధాలు 100
  4. ఎపిఐఐసి కరకపట్ల, మెదక్‌ బయోటెక్‌ 40.47
  5. సిల్వర్‌ టేక్‌ టెక్నాలజీస్‌ కొమరగిరి, తూ.గో. ఔషధాలు 100
  6. డా. రెడ్డీస్‌ లాబరేటరీస్‌ లిమిటెడ్‌ మెదక్‌ ఔషధాలు 105
  7. డా. రెడ్డీస్‌ లాబరేటరీస్‌ లిమిటెడ్‌ శ్రీకాకుళం ఔషధాలు 110
  8. ఎపిఐఐసి రాజాపుర్‌, పోలేపల్లి, మహ||నగర్‌ ఫార్ములేషన్‌ పరిశ్రమ 101.17
  9. ధన్వంతరి లైఫ్‌సైన్సెస్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ మహబూబ్‌నగర్‌ బయోటెక్నాలజీ 170
  10. ఎపిఐఐసి తడ, నెల్లూరు తోలు పరిశ్రమ 283.28
  11. అపాచీ ఇన్వెస్ట్‌ హోల్డింగ్సు ప్రైవేట్‌ లిమిటెడ్‌ హైదరాబాద్‌ పాదరక్షలు 101

బహుళ ఉత్పత్తి / ఇతరాలు

క్ర.సం. సంస్థ పేరు స్థలం ఉత్పత్తి విస్తీర్ణం (హె||)

  1. హైదరాబాద్‌ జెమ్స్‌ ఎస్‌ఇజెడ్‌ లిమిటెడ్‌ హైదరాబాద్‌ ఆభరణాలు 80.93
  2. కాకినాడ ఎస్‌ఇజెడ్‌ లిమిటెడ్‌ కాకినాడ, తూ.గో బహుళ ఉత్పత్తి 4134
  3. ఎపిఐఐసి విశాఖపట్నం బహుళ ఉత్పత్తి 2309
  4. వైట్‌ఫీల్డ్‌ పేపర్‌ మిల్స్‌ లిమిటెడ్‌ పోలవరం, ప.గో. పేపర్‌మిల్‌ 121.4
  5. బ్రాండిక్స్‌ ఇండియా ఆప్పారెల్‌ సిటీ ప్రైవేట్‌ లిమిటెడ్‌ విశాఖపట్నం దుస్తులు 404.7
  6. నియోజెన్‌ ప్రాపర్టీస్‌ ప్రైవేట్‌ హిందూపూర్‌, అనంతపురం అప్పారెల్‌ పార్క్‌ 141.64
  7. యూనిటెక్‌ బిల్డర్స్‌ అండ్‌ డెవలపర్స్‌ లిమిటెడ్‌ మల్కాజ్‌గిరి, సికింద్రాబాద్‌ ఆటో మోబైల్‌ విడిభాగాలు 10
  8. గ్రెమాటెక్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌, ఎక్విప్‌మెంట్స్‌ అండ్‌ ప్రాజెక్ట్‌ లిమిటెడ్‌ బొబ్బిలి బహుళ ఉత్పత్తి 1000
  9. ఆంబియంట్‌ ఇన్‌ఫ్రాటెక్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ మంచాల, రంగారెడ్డి జిల్లా బహుళ ఉత్పత్తి 1000
  10. రస్సాయ్‌ ప్రాపర్టీస్‌ అండ్‌ ఇండస్ట్రీస్‌ లిమిటెడ్‌ హిందూపూర్‌ బహుళ ఉత్పత్తి 1000
  11. డిఎల్‌ఎఫ్‌ యూనివర్సల్‌ లిమిటెడ్‌ హిందూపుర్‌ బహుళ ఉత్పత్తి 1012
  12. లహరి ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ లిమిటెడ్‌ శంకర్‌పల్లి, రంగారెడ్డి జిల్లా సేవారంగం 100
  13. ఎపిఐఐసి మహేశ్వరం (మం), రంగారెడ్డి జిల్లా భవన నిర్మాణ ఉత్పత్తులు 110

చైనా రూటు వేరు!

ఇవాళ ఆసియా ఖండంలో ప్రబల శక్తులుగా ఉన్న చైనా, భారత్‌లను అన్ని విషయాల్లో పోల్చి చూడటం పరిపాటి. ప్రత్యేక ఆర్థిక మండళ్ల విధానాన్ని చైనా పాతికేళ్ల కిందటే రూపొందించింది. గమనించాల్సిన విషయం ఏమిటంటే చైనా ఎస్‌ఇజెడ్‌ విధానం అక్కడి ఎగుమతులపై అధిక ప్రభావాన్నే వేసింది. మరి ఇంకేం, మనమూ అదే పని చేస్తున్నాం గదా ఇక సమస్యేమిటి అంటారా? అక్కడే ఉంది తిరకాసంతా! చైనా ఎస్‌ఇజెడ్‌లకు మన ఎస్‌ఇజెడ్‌లకు హస్తమశకాంతరం తేడా ఉంది. చైనాలో గత పాతికేళ్లలో నెలకొల్పినవి కేవలం అయిదు ఎస్‌ఇజెడ్‌లు. మరి మన దగ్గరో? ఇప్పటికే నాలుగు వందల ఎస్‌ఇజెడ్‌లకు ఎడాపెడా అనుమతిలిచ్చేశాయి మన ప్రభుత్వాలు. చైనాలో ఎస్‌ఇజెడ్‌లు నెలకొల్పడం ప్రభుత్వం ఆధీనంలో జరిగింది. ఇక మన దగ్గర వస్తోన్న ఎస్‌ఇజెడ్‌లలో సింహభాగం ప్రైవేట్‌ కంపెనీలదే. చైనాలో ఎస్‌ఇజెడ్‌లను పక్కా ప్రణాళికతో నిర్మించారు. అప్పటికే ఉన్న నగరాల్లో మౌలిక వసతులపై భారంపడకుండా ఉండేందుకు కొత్త పారిశ్రామిక పట్టణాల వలె ఎస్‌ఇజెడ్‌లను తీర్చిదిద్దారు. అంతే కాదు, ఎగుమతులకు అనువుగా ఉండటం కోసం ఎస్‌ఇజెడ్‌లను నౌకాశ్రయాలకు దగ్గరగా, తీరప్రాంతాల్లోనే నిర్మించారు. మన దగ్గర ఏర్పాటవుతున్న ఎస్‌ఇజెడ్‌లు అన్నీ పెద్ద నగరాలు, టౌన్ల సరిహద్దుల్లోనే ఉన్నాయి. ఇప్పటికే అస్తవ్యస్తంగా ఉన్న నగరాలను ఇవి ఇంకా ఇబ్బందుల్లోకి నెట్టే అవకాశం ఉంది. చైనాలో ప్రముఖ ఎస్‌ఇజెడ్‌ అయిన షెన్‌జెన్‌ విస్తీర్ణం 49,300 హెక్టార్లు అయితే హైదరాబాదులో విప్రో సంస్థ ఏర్పాటు చేస్తున్న ఎస్‌ఇజెడ్‌ విస్తీర్ణం ఆరు హెక్టార్లు మాత్రమే! అయినా చైనా ఎస్‌ఇజెడ్‌ల మీద కూడా ఎన్నో విమర్శలు ఉన్నాయి.

డెవలపర్స్‌కు ప్రోత్సాహకాలు

  • సెజ్‌లో నిర్మాణ, అభివృద్ధికి కావాల్సినవన్నీ విదేశాలనుంచి సుంకాలు లేకుండా దిగుమతి చేసుకోవచ్చు.
  • వ్యాపార సరళిలో ఫ్లాట్లు కేటాయింపు చేసే స్వతంత్రం
  • నివాస ప్రాంతాన్ని అభివృద్ధి చేయటానికి విదేశీ నిధులు సెజ్‌లో స్థాపించే యూనిట్లకు ప్రోత్సాహకాలు
  • లైసెన్స్‌ లేకుండా దిగుమతులు
  • దిగుమతుల మీద కస్టమ్స్‌ సుంకం రద్దు
  • వ్యాపార లావాదేవీలకు సంబంధించినంత వరకూ విదేశీ భూ భాగంగా పరిగణించబడుతుంది.
  • దేశంలో తయారయ్యే యంత్ర సామగ్రి, ముడిసరుకుల మీద ఎక్సైజ్‌ డ్యూటి ఉండదు.
  • సెజ్‌కు సరఫరా చేసే వాటన్నిటికీ ఎగుమతులకు వర్తించే నియమనిబంధనలన్నీ వర్తిస్తాయి.
  • 10-15 సంవత్సరాలు ఆదాయ పన్ను మినహాయింపు
  • అయిదేళ్లకు నూరు శాతం ఆదాయపు పన్ను రాయితీ, రెండేళ్లయితే యాభై శాతం, మరో మూడేళ్ల పాటు వచ్చిన లాభాలను తిరిగి పెట్టుబడి పెడితే యాభై శాతం వరకూ.
  • ఆఫ్‌షోర్‌ బ్యాంకింగు యూనిట్లకు మూడేళ్ల వరకూ ఆదాయపు పన్ను మినహాయింపు, మరొ రెండేళ్లకు యాభై శాతం వరకు.
  • సెజ్‌ ఏర్పాటులో విదేశాలకు సబ్‌ కాంట్రాక్టు ఇవ్వవచ్చు.
  • కొన్ని సెక్టార్లను మినహాయించి మిగతా తయారీ కాగా అన్నింటిలో నూరు శాతం విదేశీ పెట్టుబడులకు ఆటోమెటిక్‌ అనుమతి.
  • చిన్న పరిశ్రమలకు కేటాయించిన ఉత్పత్తుల తయారికి నూరు శాతం విదేశీ పెట్టుబడులకు అనుమతి.
  • చిన్న పరిశ్రమలకు లైసెన్స్‌లు అవసరం లేదు.

తెలంగాణ భూముల బూమ్‌ ఎస్‌ఇజెడ్‌ల చలవేనా?

దాదాపు రెండేళ్ల కిందటి వరకూ తెలంగాణ లోని అనేక ప్రాంతాల్లో అయిదు వేల రూపాయలకు ఎకరం బంజరు భూమి దొరికేది. సాగులో ఉన్న చల్కా భూములు పదిహేను వేలు నుంచి ఇరవై వేలకు విరివిగా లభించేవి. అయితే గడచిన రెండు సంవత్సరాలుగా త్వరగతిన సంభవించిన అనేక పరిణామాలు ఇక్కడి భూముల విలువను అనూహ్యంగా పెంచేశాయి. మొదట హైదరాబాద్‌కు దగ్గరా ఉన్న రంగారెడ్డి జిల్లా, మెదక్‌ జిల్లాలోని కొన్ని మండలాల్లో భూముల రేట్లు పెరగడం ప్రారంభం అయ్యింది. ఇది క్రమంగా అటు మహబూబ్‌నగర్‌కు ఇటు నల్లగొండకు పాకింది. గడచిన సంవత్సర కాలంగా తెలంగాణలో అయిదు ఆరు జిల్లాల్లో గ్రామ గ్రామాన భూముల అమ్మకం, కొనుగోళ్లు ఉపందుకొన్నాయి. వేలల్లోంచి భూముల విలువ అమాంతంగా లక్షల్లోకి పెరిగింది. ప్రతి గ్రామంలో రోజూ హైదరాబాద్‌ నుండి వచ్చే బ్రోకర్ల హడావిడి పెరిగింది. పనికిరాని కొండలు, గుట్టలు, కంచెలను లక్షలకు పెట్టి కొంటున్న వారెవరో, వాళ్లు ఎందుకిలా కొంటున్నారోనని ఊళ్లోని రైతుల నుండి పట్నంలోని మేధావుల వరకూ అందరూ ఆశ్చర్యపోయారు. ప్రపంచ బ్యాంకు డబ్బులు, సాఫ్ట్‌వేర్‌ డబ్బులు, అమెరికా నుండి మనవాళ్లు వెనక్కి పంపుతున్న డబ్బులు, జలయజ్ఞం డబ్బులు, ఇలా రకరకాల మార్గాల్లో పచ్చి పడుతున్న డబ్బు ఇలా పెట్టుబడిగా మారుతొందన్న విశ్లేషణలు కొంత వినవచ్చాయి. ఇప్పుడు బైటికి వస్తోన్న ఎస్‌ఇజెడ్‌లు కథలు వింటాంటే అసలు తెలంగాణ భూముల కొనుగోళ్ల వెనుక ఉన్నది ఈ ఎస్‌ఇజెడ్‌ పథకమేనని అర్థం అవుతుంది. ఎస్‌ఇజెడ్‌లు ఏర్పాటు చేయడానికి వందలు, వేల ఎకరాల్లో భూమి కావాలి కొంతమంది తెలివైన వ్యక్తులు మొదట ఇలా భూమి సేకరించి ఆనక దాన్ని ఏ పారిశ్రామికవేత్తకు అమ్ముకుంటారన్న మాట. సాధారణంగా మన రాష్ట్రంలో భూకమతాల విస్తీర్ణం చాలా తక్కువ. అందుకే ఎస్‌ఇజెడ్‌ ఏర్పాటు చేయాలనుకునే కంపెనీ నేరుగా రైతులనుండి భూము కొనుగోలు చేయడం చాలా వ్యయప్రయాసలతో కూడుకున్న పని. అందుకే వారు ఎస్‌ఇజెడ్‌ కోసం భూమి సేకరించడానికి బ్రోకర్లను వినియోగించుకోవడం మొదలు పెట్టారు. తత్ఫలితమే ఈ భూముల బూమ్‌!

సాఫ్ట్‌వేర్‌, హార్డ్‌వేర్‌, ఐటి ఆధారిత సేవలు

క్ర.సం. సంస్థ పేరు స్థలం విస్తీర్ణం (హె||)

  1. విప్రొ లిమిటెడ్‌ హైదరాబాద్‌ 6
  2. రహేజా ఐటీ పార్క్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ మాదాపూర్‌, రంగారెడ్డి జిల్లా 36.62
  3. ఐటీ అండ్‌ కమ్యూనికేషన్‌ డిపార్ట్‌మెంట్‌ ఎపిఐఐసి, మధురవాడ, విశాఖపట్నం 16
  4. సత్యం కంప్యూటర్‌ సర్వీసెస్‌ లిమిటెడ్‌ తట్లకొండ, విశాఖపట్నం 20.23
  5. సత్యం కంప్యూటర్‌ సర్వీసెస్‌ లిమిటెడ్‌ బహదూర్‌పల్లి, హైదరాబాద్‌ 10.52
  6. సత్యం కంప్యూటర్‌ సర్వీసెస్‌ లిమిటెడ్‌ హైదరాబాద్‌ 12.14
  7. ఎపి టెక్నో ప్రాజెక్ట్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ మాదాపూర్‌, హైదరాబాద్‌ 10
  8. సిఏ కంప్యూటర్‌ అసోసియేట్స్‌ ఇండియా నానకరాంగూడ, రంగారెడ్డి జిల్లా 12.14
  9. ఐటీ అండ్‌ కమ్యూనికేషన్‌ శాఖ, ఎపిఐఐసి మధురవాడ, విశాఖపట్నం 36
  10. ఐటీ అండ్‌ కమ్యూనికేషన్‌ శాఖ, ఎపిఐఐసి కేసరపల్లి, కృష్ణా జిల్లా 12
  11. ఎపిఐఐసి నానక్‌రాంగూడా, రంగారెడ్డి జిల్లా 20.53
  12. సిఎంసి లిమిటెడ్‌ గచ్చిబౌలి, హైదరాబాద్‌ 20.59
  13. సంఘీ ఇండస్ట్రీస్‌ లిమిటెడ్‌ రంగారెడ్డి జిల్లా 202.4
  14. ఫ్యాబ్‌ సిటీ ఎస్‌పిసి (ఇండియా) ప్రైవేట్‌ లిమిటెడ్‌ హైదరాబాద్‌ 486
  15. భావనసాయి అసోసియేట్స్‌ మంథన, కేసరపల్లి 25
  16. ఎపిఐఐసి మహేశ్వరం, రంగారెడ్డి జిల్లా 111
  17. దివ్యశ్రీ ఎన్‌ఎస్‌ఎల్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ లిమిటెడ్‌ రాయదుర్గం, రంగారెడ్డి జిల్లా 15.175
  18. ల్యాంకో మంత్రి టెక్‌ పార్క్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ రంగారెడ్డి జిల్లా 11.77
  19. ఇత్తిన ప్రాజెక్ట్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ శేరిలింగంపల్లి, రంగారెడ్డి జిల్లా 20
  20. బ్రాహ్మణి ఇన్‌ఫ్రాటెక్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ మామిడిపల్లి 60.721
  21. ఇందూ టెక్నొజొన్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ కంచ ఇమారత్‌, మహేశ్వరం, రంగారెడ్డి జిల్లా 60.7
  22. టాప్‌ వాచ్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ లిమిటెడ్‌ ఉప్పల్‌ ఐడిఎ, హైదరాబాద్‌ 11.735
  23. ఎమార్‌ హిల్స్‌ టౌన్‌షిప్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ రంగారెడ్డి జిల్లా 10.33
  24. నవయుగ ఇంజనీరింగు కంపెనీ లిమిటెడ్‌ శేరిలింగంపల్లి, రంగారెడ్డి జిల్లా 10.218
  25. జెన్‌ఫ్యాక్ట్‌ ఇండియా రంగారెడ్డి జిల్లా 20.23
  26. జెటి. హోల్డింగ్సు ప్రైవేట్‌ లిమిటెడ్‌ కంచఇమారత్‌, రావిర్యాల, రంగారెడ్డి జిల్లా 28.33
  27. రుద్రదేవ్‌ ఇన్‌ఫో పార్క్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ కిస్టాపూర్‌, చేవెళ్ల, రంగారెడ్డి జిల్లా 12.42
  28. మార్గ్‌ బిజినెస్‌ పార్క్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ కొట్రమంగళం, తిరుపతి 10.12
  29. మహావీర్‌ స్కైక్రేపర్స్‌ లిమిటెడ్‌ చేవెళ్ల, రంగారెడ్డి జిల్లా 40.47
  30. స్టార్‌గేజ్‌ ప్రాపర్టీస్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ కంచఇమారత్‌, మహేశ్వరం, రంగారెడ్డి జిల్లా 68.96
  31. మేతాస్‌ ప్రాపర్టీస్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ బాచుపల్లి, కుత్బుల్లాపూర్‌ (మం), రంగారెడ్డి జిల్లా 29.85
  32. మేతాస్‌ ప్రాపర్టీస్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ గుండ్లపొచంపల్లి, మేడ్చల్‌ (మం), రంగారెడ్డి జిల్లా 14.16
  33. మేతాస్‌ ప్రాపర్టీస్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ గోపన్‌పల్లి, శేరిలింగంపల్లి, రంగారెడ్డి జిల్లా 15.92
Advertisements

Written by Polepally InSolidarity

December 1, 2006 at 2:32 am

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

%d bloggers like this: