Fighting Injustice in Polepally SEZ

…more than courage it takes WILL to stand up against injustice !

సెజ్‌ల కొలిమిలో సామాన్యుల జీవితాలను బలిపెడుతున్న ప్రభుత్వాలు

leave a comment »

-నిజ నిర్ధారణ కమిటీ ప్రకటన తేది: 26-03-2007

వ్యవసాయం, రైతులు, పల్లెలను నిర్లక్ష్యం చేసి నగరాల అభివృద్దే స్వర్ణాంధ్రప్రదేశ్‌ సాధనగా నమ్మిన మాజీముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు 2003లో మహబూబ్‌నగర్‌ జిల్లా జడ్చర్ల, బాలానగర్‌ మండలాల పరిధిలోని గ్రామాలైన ముదిరెడ్డిపల్లి, పోలేపల్లి, పోపల్లి తాండ, గుండ్ల గడ్డ తాండలలోని 1000 ఎకరాల భూములు ప్రభుత్వం పేరిట సేకరించిన ఈ భూమిని రైతు బాంధవుడిగా ప్రకటించుకున్న ముఖ్యమంత్రి రాజశేఖరరెడ్డి సెజ్‌ల కోసం దారాదత్తం చేస్తున్నాడు. ఫలితం రైతు కూలీలు అనాధలుగా మిగులుతున్నారు. గ్రీన్‌పార్క్‌ల పేరుతో పరిశ్రమలలో ఉద్యోగాలు కల్పిస్తామని నమ్మించి అరవిందో ఫార్మాస్యూటికల్‌, బయోఫార్మా లాంటి కంపెనీలకు భూమిని అమ్మేసి ప్రభుత్వమే దళారీగా మారింది.

2003 నుండి పై గ్రామాల్లోకి ఎమ్మార్వో, ఆర్‌.డి.ఓ. లాంటి రెవెన్యూ అధికారులు, నిత్య సంబంధాలు కొనసాగించే పైరవీ కారులు ఈ భూములు ప్రభుత్వానివి, ప్రభుత్వం ఎంతయిస్తే అంత దీస్కోని గమ్మునుండండి అంటూ భయాలు కల్పించి వారిలో భూములను వదులుకొనే సంసిద్దతను సృష్టించినారు. భూమికి సరైన నష్టపరిహారం భూమే. నష్టపరిహారం అందక, జీవనాధారమైన భూమిని బలవంతంగా గుంజుకొన్నందువల్ల పోషించే దిక్కులేక పోతపల్లి గ్రామస్థులైన పానుగంటి రామయ్య, బైండ్ల రామయ్య 2003 తర్వాతనే దిగులు చెంది అనారోగ్యానికి గురై చనిపోయారు.

టెనెన్సీ చట్టం ప్రకారం 1970కి పూర్వమే ఈ భూమిపై హక్కు కలిగి, పట్టా పుస్తకాలు కలిగిన ఎస్‌.సి, ఎస్‌.టి, బి.సి ల రైతుల పొలాలను అసైన్డు భూములుగా తప్పుడు ప్రచారం సృష్టించి, భూమిలేని బికారులు చేసింది చాలక పరిహారం పేరుతో ఇచ్చిన 18 వేలల్లో అధికారులు, దళారులే 10 వేల దాక దిగమింగినారు. ఇన్నాళ్ళుగా భూమిని కాపాడుతూ పంటపొలంగా అభివృద్ధి చేసినందుకు మాత్రమే డెవలప్‌మెంట్‌ చార్జీలు లెక్కలుకట్టి యిచ్చినారు. కానీ నిజంగా భూమికి పరిహారం యివ్వలేదు.

అధికారుల చుట్టూ, అసెంబ్లీ చుట్టూ తిరిగినా అన్యాయమే జరిగింది. ఇందిరమ్మ ప్రభుత్వం పొలాలు పంచితే రాజశేఖరరెడ్డి ప్రభుత్వం సెజ్‌ల పేరుమీద భూములను గుంజుకుంటున్నది. ప్రభుత్వం నామమాత్రం రేట్లకు భూములు సేకరించి సెజ్‌లకు వందల రెట్ల ఎక్కువ ధరకు అమ్మి ప్రజలను నిలువునా మోసం చేసింది. ఇది దారుణ అన్యాయం అంటూ ప్రజలు మా కమిటీ ముందు తమగోడును వెల్లబోసుకున్నారు. ఇదేనా రాజశేఖర్‌ రెడ్డి చెబుతున్న ఇందిరమ్మ రాజ్యం అని వారు ప్రశ్నిస్తున్నారు. ప్రభుత్వం ఇప్పుడైనా కళ్లు తెరిచి, కల్లబొల్లి మాటలు కట్టిపెట్టి, భూమికి భూమిని పరిహారంగా యివ్వాలని మా కమిటీ డిమాండ్‌ చేస్తున్నది.

ప్రొ|| జి. హరగోపాల్‌ (ఏ.పి.సి.ఎల్‌.సి.)
ప్రొ|| వనమాల
శ్రీధర్‌ దేశ్‌పాండే (తెలంగాణ విద్యావంతుల వేదిక, తెలంగాణ జర్నలిస్టుల ఫోరం)
కప్పర ప్రసాద్‌
పల్లె రవి కుమార్‌ (తెలంగాణ జర్నలిస్టుల ఫోరం)
మద్దిలేటి, మధు కాగుల, యాదగిరి (తెలంగాణ విద్యావంతుల వేదిక, మహబూబ్‌ నగర్‌ జిల్లా శాఖ.)

Courtesy: Telangana Times

URL: http://www.times.discover-telangana.org/2007/05/nandigram_report/

Advertisements

Written by dilkibaatein

April 20, 2008 at 9:59 am

Posted in Reports, Telugu

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

%d bloggers like this: