Fighting Injustice in Polepally SEZ

…more than courage it takes WILL to stand up against injustice !

పోలేపల్లి సెజ్ బాధితులతో కలిసి నడుద్దాం – సభ

leave a comment »

మా భూములు మాకిప్పియండ్రి సారూ అని ఒక రైతు చేతులెత్తి దండం పెడితే. మేము సచ్చుడొ, ఆ భూములు పోవుడో ఏదో ఒకటే జరుగుతుందని ఇంకో రైతు ప్రతిజ్ఞ చేశాడు. మా బతుకులు మీ ఇంటి ముందు కుక్కల కన్నా హీనం అయినాయి సారూ అని గుడ్లనీరు కక్కుకుందో స్త్రీమూర్తి.

ఒక్కొక్క రైతూ వేదిక మీదకొచ్చి జరిగిన దారుణం వివరిస్తుంటే కళ్లుచెమర్చని వారు లేరు ఆ సమావేశ మందిరంలో. అరవై ఏళ్ల స్వతంత్రం మనల్ని ఇక్కడికి తీసుకొచ్చిందా అని ప్రతి హృదయం కలవరపడిన క్షణాలవి. తెల్ల దొరలను మరిపించే రీతిలో దమనకాండను కొనసాగిస్తున్న నల్లదొరల పాలన నగ్నంగా బయటపడ్డ ఘడియలవి.

“పోలేపల్లి సెజ్ బాధితులతో కలిసి నడుద్దాం” అనే నినాదంతో విప్లవ రచయితల సంఘం ఆధ్వర్యంలో ఏప్రిల్ 20 ఆదివారం నాడు సాయంత్రం ఆరు గంటలకు సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఒక సభ జరిగింది.

ఈ సభకు విరసం కార్యవర్గ సభ్యురాలు రత్నమాల అధ్యక్షత వహించగా విరసం సిటీ యూనిట్ తరఫున గీతాంజలి ఉపన్యసించారు. దాదాపు 30 మంది సెజ్ బాధిత రైతులు ఈ సభలో పాల్గొన్నారు. పోలేపల్లికి చెందిన రైతులు కూర్మయ్య, శీనయ్య గౌడ్, చుక్కమ్మ, అంజమ్మ, మొగులమ్మ, రంగమ్మ, లింగయ్య, పెద పెంటయ్య, శ్రీనివాస్ ఈ సెజ్ పేరిట తమ భూములు ప్రభుత్వం ఎలా లాక్కున్నదీ వివరించారు.

ఈ సభలో మహిళా చేతన తరఫున రాధ, పోలేపల్లి సెజ్ వ్యతిరేక ఐక్య సంఘటనకు చెందిన కాగుల మధు, ప్రముఖ కవి పిన్నిక శ్రీనివాస్ ప్రభృతులు పాల్గొన్నారు.

Advertisements

Written by dilkibaatein

April 21, 2008 at 9:07 am

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

%d bloggers like this: