Fighting Injustice in Polepally SEZ

…more than courage it takes WILL to stand up against injustice !

మళ్లీ భూయజ్ఞం – లక్ష్యం రూ.4100 కోట్లు

leave a comment »

హైదరాబాద్‌, న్యూస్‌టుడే: కొత్త ఆర్థిక సంవత్సరంలో భూముల విక్రయాలకు ప్రభుత్వం మళ్లీ తెరతీసింది. ఇప్పటికే భూముల వేలం ద్వారా ఖజానాను నింపుతున్న రాష్ట్ర పారిశ్రామిక మౌలిక సదుపాయాల సంస్థ (ఏపీఐఐసీ)ను 2008-09లో రూ. 4100 కోట్లను సంపాదించి పెట్టాలని హుకుం జారీ చేసింది. ఈ మొత్తాన్ని ఒక్క రంగారెడ్డి జిల్లా రాయదుర్గంలోని భూముల విక్రయం ద్వారానే ఆర్జించాలని సూచించింది. ఈ సొమ్మును నేరుగా ప్రభుత్వ ఖాతాలో జమ చేయాలని ఆదేశిస్తూ బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. రాయదుర్గం భూముల విషయమై సుప్రీంకోర్టులో కేసు నడుస్తుండగా, దాంతో నిమిత్తం లేకుండానే మరోసారి విక్రయాలకు పచ్చజెండా ఊపిన ప్రభుత్వం మునుపెన్నడూ లేని విధంగా భారీ లక్ష్యాన్ని నిర్దేశించడం గమనార్హం. రాయదుర్గంలో 424.13 ఎకరాల భూమి ఉండగా వాటిలో కొంత భాగాన్ని ఏపీఐఐసీ నాలుగు దఫాలుగా విక్రయించింది. 2006-07లో రూ.వేయి కోట్లు, 2006-07లో రూ.3 వేలకోట్ల ఆదాయాన్ని ఏపీఐఐసీ పొందింది. ఈ నేపథ్యంలో గత నెలలో ఆర్థిక వనరుల సమీకరణ సమావేశం జరిగినప్పుడు ఏపీఐఐసీకి రూ. 4100 కోట్ల లక్ష్యాన్ని నిర్దేశించారు. ఇంత మొత్తాన్ని ఒకే దఫా సమీకరించడం కష్టసాధ్యమని, నెలల వారిగా లక్ష్యాలను విధించాలని కోరుతూ ఇటీవల ఏపీఐఐసీ ఎండీ లేఖ రాశారు. దీనికి ప్రభుత్వం ఆమోదం తెలిపింది. నెలలవారీగా భూములను విక్రయించి ప్రభుత్వ ఖాతాలో జమ చేయాలంటూ ఉత్తర్వులిచ్చింది.

 

(Courtesy: Eenadu, Date: 24th April 2008)

Advertisements

Written by dilkibaatein

April 24, 2008 at 2:06 am

Posted in Eenadu, News Archive, Telugu

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

%d bloggers like this: