Fighting Injustice in Polepally SEZ

…more than courage it takes WILL to stand up against injustice !

కోస్టల్ కారిడార్, సెజ్ వ్యతిరేక మహాయాత్ర

leave a comment »

రెండు శతాబ్దాల పాటు చావో రేవో అన్నట్టుగా సాగిన స్వాతంత్ర్య పోరాట సారం ఈ నేలాలో పూర్తిగా ఇంకక ముందే, త్యాగాల చాళ్లల్లో ప్రగతి అందరికీ చెందే వ్యవస్థ సాకారం కాక ముందే ఘనత వహించిన ప్రజాస్వామిక ప్రభువులు మన భూమిని, మన గాలిని, మన వనరులను ఆఖరికి మన స్వేచ్చను కూడా మళ్ళ్లీ తెల్ల దొరతనానికి తాకట్టు పెట్టేందుకు తొందరపడుతున్నారు. రైతాంగం, శ్రామికులు పోరాడి సాధించుకున్న హక్కులు, అధికారాలను తుంగలో తొక్కి, నయా జమీందారీ విధానానికి పునాది వేస్తున్నది మన ప్రభుత్వం.

కోస్టల్ కారిడార్ పేరిట అటు చివర ఉన్న శ్రీకాకుళం జిల్లా నుండి ఇటుచివర ఉన్న నెల్లూరు జిల్లా వరకు లక్షల ఎకరాల పంట భుములను బడా పారిశ్రామికవేత్తలకు అప్పజెప్పే దుర్మార్గమైన ప్రణాళిక వేసింది ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం.

కొన్ని లక్షల మంది ప్రజల ఉపాధిని దెబ్బతీసి వారి జీవితాలను అస్థవ్యస్థం చేయగల ఈ ప్రణాళికను తక్షణమే ఉపసమ్హరించుకోవాలనే పిలుపుతో ఒక మహా యాత్ర తలపెట్టాయి కొన్ని ప్రజా సంఘాలు.

కోస్తాలోని 9 జిల్లాల సెజ్ వ్యతిరేక పోరాటాలను కలుపుతూ సాగే ఈ యాత్ర శ్రీకాకుళం జిల్లా నుండి మొదలై 25-04-2008 సాయంత్రం తుని వద్ద తూర్పు గోదావరి జిల్లాలోనికి ప్రవేశిస్తుంది. అటుపిమ్మట సెజ్ వ్యతిరేక పోరాట ప్రాంతమైన యు.కొత్తపల్లి, తొండంగి మండలాల్లోనూ, సముద్రకోత బాధిత గ్రామైన ఉప్పాడలోను, మత్స్యకార పోరాట ప్రాంతమైన ఫిషింగ్ హార్బర్ పేట, దుమ్ములపేట, పోర్టు ప్రాంతాలలోను, చివరగా రిలయన్స్ గ్యాస్ ప్రాజెక్టుకు వ్యతిరేకంగా పోరాడుతున్న గాడిమొగలో పర్యటించి 27-04-08 మధ్యాహ్నం 2 గంటలకు కాకినాడ చేరుకుంటుంది.

బహిరంగ సభ

ఏప్రిల్ 27, 2008
సాయంత్రం 5 గంటలకు
అంబేడ్కర్ భవనం,
పాత బస్టాండ్
కాకినాడ. 

ఈ పోరాటం గురించి మరిన్ని వివరాల కొరకు:

1) కె. రాజేంద్ర, కన్వీనర్, సెజ్ వ్యతిరేక పోరాట సంఘీభావ కమిటీ, ఫోన్: 9848557107

2) ఎన్.హేమా వెంకట్రావ్, కన్వీనర్, కోస్టల్ కారిడార్ నిర్మాణ వ్యతిరేక పోరాటకమిటీ, ఫోన్: 9912195330

Advertisements

Written by dilkibaatein

April 25, 2008 at 3:38 am

Posted in Pamphlets, Telugu

Tagged with ,

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

%d bloggers like this: