Fighting Injustice in Polepally SEZ

…more than courage it takes WILL to stand up against injustice !

కాకినాడ సెజ్ సెగలు

leave a comment »

కాకినాడ దగ్గర సహజవాయువు నిక్షేపాలు బాగా ఉన్నాయి కాబట్టి ఒ.ఎన్.జి.సి వారికి చమురు శుద్ధి కర్మాగారం (రిఫైనరీ) నెలకొల్పడానికి భూమి కావాలని ప్రభుత్వం తొలుత ప్రకటించింది. మొత్తం 12500 ఎకరాల్లో సెజ్ ను నెలకొల్పుతామని ప్రతిపాదించారు. తొలుత కాకినాడ రూరల్, సామర్లకోట, పిఠాపురం, యు.కొత్తపల్లి మండలాల్లో సెజ్ ను ప్రతిపాదించగా ఆ భూమిలో వరి పండించే నేలలు ఉన్నాయని రైతులు, సంవత్సరంలో సగం రోజులకు పైగా పని దొరుకుతుందని వ్యవసాయకూలి సంఘాలు ప్రతిఘటించారు. వాళ్ల ఆందోళన కన్నా అది రియల్ ఎస్టేట్ కళ్లకు బంగారు భూమి కావడం వలన బిల్డర్లు ఒత్తిడి పెట్టారని, ఆ కారణంగా ప్రభుత్వం తన ప్రణాళికను మార్చుకుందంటారు. కారణం ఏదైతేనేం, సదరు సెజ్ యు.కొత్తపల్లి మండలం, తొండంగి మండలంలోని తీరప్రాంత గ్రామాలకు మారింది. మరొక విశేషమేమంటే ఒ.ఎన్.జి.సి ఈ దశలోనే తమకు కాకినాడ దగ్గర రిఫైనరి నెలకొల్పే ఉద్దేశ్యం లేదని ప్రకటించింది. తొలి ప్రతిపాదనలో సారవంతమైన భూములు ఉన్నాయి కాబట్టి దాని స్థానంలో తీరప్రాంతంలోని చవిటి నేలను ఎంపిక చేశామని వివరణ ఇచ్చుకున్నా, భూసేకరణ కోసం ప్రతిపాదించినవి సారహీనమైన నేలలు కావు.

వందల ఎకరాలు జీడి మామిడి, కొబ్బరి, సపోటా, మామిడి, సరుగుడుతో పాటు వరి పండే భూమి కూడా ఉంది. సరుగుడు నారు ఇక్కడినుండే రాష్ట్రంలోని ఇతర ప్రాంతాలకు ఎగుమతి అవుతుంది. అర ఎకరంలో సర్వేనారు పోస్తే లక్షన్నర ఆదాయం వస్తుంది. సరుగుడు తోట నాలుగేళ్లు పెంచి కలప అమ్మితే ఎకరానికి లక్షన్నర ఆదాయం తెస్తుంది.

గమనించవలసిన ముఖ్య విషయం ఏమిటంటే సెజ్ కొరకు జరుగుతున్న భూసేకరణ సెజ్ పేరిట కాకుండా కె.వి.రావు అనే వ్యక్తి పేరిట జరుగుతోంది. ఇతను ఈ భూములను అధిక ధరలకు మారు అమ్ముకోవడానికి ప్లాన్ వేస్తున్నాడని అనుమానం ఉన్నది. ఇక  కౌలు రైతులు, రైతులకు వివిధ సేవలు అందించే చాకలి, మంగలి, కుమ్మరి, గీత కార్మికులు తదితర కులాల వాళ్ళు, పశువులని మేపుకుని బ్రతికే యాదవులు, ఉప్పుటేర్లలో చేపలు, పీతలు పట్టుకుని జీవించే మత్స్యకారులు తదితరులంతా ఈ సెజ్ వల్ల ఉపాధిని కోల్పోతున్నారు. కానీ ప్రభుత్వం దృష్టిలో వీరు నిర్వాసితులు కారు, వీరికి ఎటువంటి నష్ట పరిహారం దక్కదు.   

ఇక సెజ్ లో పోతున్న ఊర్లలో డాక్రా వంటి ప్రభుత్వ కార్యక్రమాలు అప్పుడే నిలిచిపోయాయి.  ఈ సెజ్ ప్రాంతంలో ఎటువంటి పునరావాస కార్యక్రమాలు ప్రభుత్వం ఇంతవరకు చేపట్టలేదు.

ఈ భూదోపిడీని ఎదుర్కోవడానికి స్థానిక ప్రజలు కాకినాడ సెజ్ వ్యతిరేక పోరాట కమిటీగా ఏర్పడి పెద్ద ఎత్తున ఉద్యమిస్తున్నారు. ఈ పాటికే మానవ హక్కుల నేత కే. బాల గోపాల్, సామాజిక ఉద్యమ కార్యకర్త మేధా పాట్కర్, సామాజిక ఉద్యమ కార్యకర్త బొజ్జా తారకం, బీజేపీ నేతలు బండారు దత్తాత్రేయ, కిషన్ రెడ్డి గారలు ఈ ప్రాంతాన్ని సందర్శించి ఇక్కడి ప్రజలకు సంఘీభావం తెలిపారు.

ఈ సెజ్ కు వ్యతిరేకంగా కోర్టులో న్యాయపోరాటం కూడా చేస్తున్నారు స్థానిక ప్రజలు. కాకినాడ సెజ్ వ్యతిరేక పోరాటానికి మనం కూడా సంఘీభావం తెలుపుదాం.

Advertisements

Written by dilkibaatein

April 25, 2008 at 3:34 am

Posted in Pamphlets, Telugu

Tagged with

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

%d bloggers like this: