Fighting Injustice in Polepally SEZ

…more than courage it takes WILL to stand up against injustice !

ఇది ప్రభుత్వ మోసం

leave a comment »

పోలేపల్లి రైతుల నుండి భూములను ప్రభుత్వం లాక్కుని మోసం చేసిందని మహారాష్ట్ర, పూనెకు చెందిన లోక్‌ శాసన్‌ ఆందోళన్‌ వర్కింగ్‌ అధ్యక్షులు విలాస్‌ సోనావానే ఆరోపించారు. సోమవారం పోలేపల్లి నిర్వాసితులను కలిసిన అనంతరం విలేకరులతో మాట్లాడుతూ రైతులతో భూములను తీసుకోకుండా, లీజుకు తీసుకుని భాగస్వామ్యం కల్పిస్తే రెండు రకాలుగా లాభం చేకూరేదని అన్నారు. నిర్వాసితులకు పరిహారం అందించే అంశంలో అవినీతిపై రిటైర్డ్‌ జడ్జితో విచారణ జరిపించాలని డిమాండు చేశారు.

మహారాష్ట్రలో సైతం 144 ఎస్‌ఇజడ్‌లను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించిందని తెలిపారు. గోదావరి పరీవాహక ప్రాంతాలు నీటి కోసం పోరాడాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. తెలంగాణ రాష్ట్ర సమితి వెంట తిరుగుతూ తెలంగాణ అంటున్న గద్దర్‌, సెజ్‌ నిర్వాసితుల కోసం ఎందుకు పోరాడటం లేదని ప్రశ్నించారు. పోలేపల్లి గ్రామంలో పరిస్థితి భయంకరంగా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. సమావేశంలో మహాజన సమితి రాష్ట్ర కార్యదర్శి గౌతమ్‌, సెజ్‌ పోలేపల్లి సెజ్‌ వ్యతిరేక పోరాట కమిటీ సభ్యులు మధు కాగుల లు ఉన్నారు.

Courtesy: Andhra jyothy

Advertisements

Written by dilkibaatein

May 6, 2008 at 8:14 am

Posted in News Archive, Telugu

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

%d bloggers like this: