Fighting Injustice in Polepally SEZ

…more than courage it takes WILL to stand up against injustice !

APIIC ఆఫీసు ముందు పోలేపల్లి రైతుల సత్యాగ్రహం

with one comment

ఎనిమిదేళ్ల క్రితం ప్రపంచ బ్యాంకు పాలనకు వ్యతిరేకంగా ఉద్యమించిన ప్రజల గుండెల్లోకి పోలీసుల తుపాకీ గుళ్లు దూసుకెళ్లిన బషీర్ బాగ్ చౌరస్తా అది.

ప్రపంచీకరణ శక్తుల తాజా అస్త్రం అయిన సెజ్ లకు వ్యతిరేకంగా ఉద్యమించిన రైతులకు ఇప్పుడు అదే బషీర్ బాగ్ వేదిక అయ్యింది. అప్పుడున్న ముఖ్యమంత్రి ఇప్పుడు అధికారంలో లేడు. అయితేనేం విదేశీ దొరల పరిపాలన మాత్రం ఇంకా కొనసాగుతోంది. 

మామూలుగానైతే ఈ సమయంలో ఆ రైతులు నాగలి దున్నుతూనో, కలుపు తీస్తోనో క్షణం తీరిక లేకుండా ఉండాలి. కానీ వారిప్పుడు బషీర్ బాగ్ రోడ్డుపై నినాదాలిస్తూ కూర్చున్నారు. అసలైతే ఈ సమయంలో వారి చేతుల్లో విత్తనాలో, ఎరువులో ఉండాలి కానీ వింతగా వారి చేతుల్లో రకరకాల నినాదాలు రాసిన ప్లకార్డులు, బ్యానర్లు ఉన్నాయి.

రాష్ట్రంలో పేదల భూములు పెద్ద గద్దల చేతిలో పెట్టడానికి సాక్షాత్తూ ప్రభుత్వమే రచించిన సెజ్ తంత్రం ఈ పాలమూర్ రైతుల పొట్టగొట్టింది. మూడూళ్లకు చెందిన మూడొందల పైచిలుకు పేద దళిత, గిరిజన రైతుల వద్ద నుండి కారు చౌక రేట్లకు భూమిని లాక్కుంది మన రాష్ట్ర ప్రభుత్వం. నిరక్షరాస్యులైన ఆ రైతులను బెదిరించి, వారిని తప్పుదోవ పట్టించి లాక్కున్న వెయ్యి ఎకరాల్లో మూడు వందల ఎకరాలను ఒక ఫార్మా సెజ్ కొరకు కేటాయించింది రాష్ట్ర ప్రభుత్వం. ఇప్పుడు అదే సెజ్ లో భూములను లక్షల రూపాయలకు అమ్ముతోంది ప్రభుత్వం. సామాజిక బాధ్యతను మరచి నిస్సిగ్గుగా రియల్ ఎస్టేట్ దళారీలా వ్యవహరిస్తోంది.

తమ దగ్గర బలవంతంగా లాక్కున్న భూములను తమకు తిరిగి ఇచ్చేయాలని, ఆ భూముల్లో నెలకొల్పుతున్న సెజ్ ను ఎత్తివేయాలని కోరుతూ పోలెపల్లి గ్రామానికి చెందిన రైతులు నిన్న ఆంధ్ర ప్రదేశ్ పారిశ్రామిక మౌళిక వసతుల సంస్థ (APIIC) కార్యాలయం ముందు సత్యాగ్రహం  జరిపారు.

పోలెపల్లి సెజ్ వ్యతిరేక ఐక్య వేదిక ఆధ్వర్యంలో జరిగిన ఈ సత్యాగ్రహంలో పోలెపల్లి గ్రామం నుండి దాదాపు రెండొందల మంది రైతులు పాల్గొన్నారు. “సెజ్ హటావో, జమీన్ బచావో”, “మా భూములు, మా నీళ్లు మాకు కావాలె” అనే నినాదాలతో బషీర్ బాగ్ లోని APIIC కేంద్ర కార్యాలయం మార్మోగిపోయింది.

ఇటీవలే తెలుగు దేశం పార్టీ నుండి బయటకు వచ్చిన దేవేందర్ గౌడ్ ఈ సత్యాగ్రహం సంగతి తెలుసుకుని వచ్చి తన సంఘీభావం తెలియ జేశారు. ధర్నాలో పాల్గొన్న ప్రజలను ఉద్దేశించి ప్రసంగించిన వారిలో తెలంగాణా జర్నలిస్టు ఫోరం ప్రతినిధి పాశం యాదగిరి, విరసం ప్రతినిధి డాక్టర్ గీతాంజలి, పోలెపల్లి సెజ్ వ్యతిరేక ఐక్య వేదిక నుండి మధు కాగుల, సూరెపల్లి సుజాత పాల్గొన్నారు.

సత్యాగ్రహం వీడియోలు ఇక్కడ చూడొచ్చు:

http://www.musitv.com/Telangana%20Media/Daily%20news/July%20News/7-7-08/SEZ_Devender_Goud_Speech.html

http://www.musitv.com/Telangana%20Media/Daily%20news/July%20News/7-7-08/SEZ_Farmers_speech.html

పత్రికల్లో సత్యాగ్రహం వార్తలు :

ఈనాడు:

https://polepally.wordpress.com/2008/07/08/satyagraham-eenad/

ఆంధ్రజ్యోతి:

 

 

 

 

వార్త దినపత్రిక :

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

The Hindu Newspaper:

Goud squats in protest

Submits plea on behalf of Polepalli evacuees 
HYDERABAD: Former Telugu Desam leader T. Devender Goud squatted on the road opposite Parisrama Bhavan here on Monday afternoon while leading a dharna by land evacuees of the special economic zone (SEZ) at Polepalli in Mahbubnagar district.

On behalf of a group of women demonstrators from Polepalli gathered there, Mr. Goud submitted a memorandum to senior officials of the AP Industrial Infrastructure Corporation (APIIC) inside the bhavan. The women demanded land-for-land in addition to Rs. 10 lakh an acre as compensation.

Mr. Goud demanded that the State government scrap its SEZ policy as it amounted to hoodwinking the poor villagers who surrendered their land. The APIIC and the HUDA have turned into ‘broking arms’ of the government, he said. The HUDA extended its jurisdiction up to Mahabubnagar, Nalgonda and Medak, thanks to the policy, he added.He warned of an intensified agitation to be led by him, in Telangana districts against the SEZs.

Advertisements

Written by dilkibaatein

July 8, 2008 at 8:51 am

One Response

Subscribe to comments with RSS.

  1. రాబోయే కాలంలో ఈ పోరాటాలు మరింత పెరుగుతాయి. రైతులకూ సెజ్ విధానానికీ మధ్య ఒక అంగీకారాత్మక ఒప్పందం విధానపరంగా ప్రభుత్వాలు ఏర్పరిస్తే తప్ప ఇవి పరిష్కారమయ్యే సమస్యలు కావు.

    వాటికి ప్రభుత్వ చిత్తశుద్ధి చాలా అవసరం. ప్రస్తుతానికి ఆ చిత్తశుద్ది మన రాష్ట్రాన్ని పరిపాలిస్తున్న ప్రభుత్వానికి లేదన్నది జగమెరిగిన సత్యం.


Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

%d bloggers like this: