Fighting Injustice in Polepally SEZ

…more than courage it takes WILL to stand up against injustice !

దళారీ ప్రభుత్వమిది

with 3 comments

నయా జమీందారీ వ్యవస్థను నెలకొల్పారు
ప్రజలు గుణపాఠం చెప్పాలి
‘పోలేపల్లి’ సత్యాగ్రహంలో దేవేందర్‌ ధ్వజం
సెజ్‌ను రద్దు చేయాలని బాధితుల డిమాండ్‌

హైదరాబాద్‌ – న్యూస్‌టుడే

పేదల భూములను బలవంతంగా లాక్కుని, ఎక్కువ ధరలకు విక్రయిస్తున్న వైఎస్‌ ప్రభుత్వం ‘నయా జమీందారీ’ వ్యవస్థను నెలకొల్పిందని మాజీ హోం మంత్రి టి.దేవేందర్‌ గౌడ్‌ విమర్శించారు. పరిశ్రమల అభివృద్ధికి మౌలిక సదుపాయాలు సమకూర్చాల్సిన ఏపీఐఐసీ వంటి సంస్థలు దళారీ పాత్రను పోషిస్తున్నాయని ధ్వజమెత్తారు. ఈ దళారీ ప్రభుత్వాన్ని నిలదీసి, గుణపాఠం నేర్పాలని పిలుపునిచ్చారు. పోలేపల్లి సెజ్‌ వ్యతిరేక ఐక్య సంఘటన, తెలంగాణ ఐక్య కార్యాచరణ కమిటీ, తెలంగాణ సెజ్‌ వ్యతిరేక ఐక్య సంఘటన తదితర సంఘాల ఆధ్వర్యంలో సోమవారమిక్కడ ఏపీఐఐసీ కార్యాలయం ఎదుట భూ మాఫియాకు వ్యతిరేకంగా సత్యాగ్రహం జరిగింది. సెజ్‌ బాధితులకు మద్దతుగా సత్యాగ్రహంలో పాల్గొన్న దేవేందర్‌గౌడ్‌ మాట్లాడుతూ.. ప్రభుత్వ కుట్ర ఫలితంగా 1.5 లక్షల ఎకరాల భూములను పేదలు కోల్పోయారని అన్నారు. సెజ్‌లలో ఏ ఒక్క బాధితుడికీ పని కల్పించకుండా, వారి జీవనాధారాన్ని కొల్లగొట్టారని విమర్శించారు. ”ఏపీఐఐసీ, గృహ నిర్మాణ సంస్థ, హుడాలు దళారీ పాత్రను పోషిస్తున్నాయి. రాష్ట్రంలో అనుమతించిన 72 సెజ్‌లను వెంటనే నిలిపేసి, చట్టాన్ని రద్దు చేయాలి. లేదంటే ఈ ఉద్యమాన్ని ఉద్ధృతం చేసి ప్రభుత్వం సంగతేంటో తేలుస్తాం” అని హెచ్చరించారు.

 

‘సెజ్‌’ల పేరిట ప్రభుత్వం ప్రజావ్యతిరేక విధానాలకు పాల్పడుతోందని తెలంగాణ ఐక్య కార్యాచరణ కమిటీ అధ్యక్షులు పాశం యాదగిరి అన్నారు. ఏపీఐఐసీ విధానాలు 41 మంది ప్రాణాలను పొట్టనబెట్టుకున్నాయని, ఇకమీదట ఎవరైనా చనిపోతే ఈ కార్యాలయం వద్దే దహన సంస్కారాలు నిర్వహించాలని చెప్పారు. అరబిందో ఫార్మసీ కంపెనీకి భూములను అప్పగించిన ప్రభుత్వం.. 325 కుటుంబాల జీవనాధారాన్ని కొల్లగొట్టిందని పోలేపల్లి సెజ్‌ వ్యతిరేక ఐక్య సంఘటన కన్వీనర్‌ మధు కాగుల అన్నారు. ఈ సందర్భంగా పోలేపల్లి సెజ్‌ బాధితులు కొందరు మాట్లాడారు. ముఖ్యమంత్రి దిగొచ్చేవరకూ తమ పోరాటం ఆగదని ఉద్ఘాటించారు. తమ భూములను తిరిగి అప్పగించకుంటే అసెంబ్లీ ఎదుట పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుంటామని వీరిలో పలువురు హెచ్చరించారు. సత్యాగ్రహంలో పలు ప్రజా సంఘాల నాయకులు పాల్గొన్నారు. అనంతరం తమ వెతలను పోలేపల్లి సెజ్‌ బాధితులు.. ఏపీఐఐసీ కార్యనిర్వాహక సంచాలకులు మురళీధర్‌రెడ్డికి విన్నవించారు. దేవేందర్‌గౌడ్‌ తదితరులతో కలిసి వినతిపత్రం ఇచ్చారు. సెజ్‌ను రద్దు చేసి, ఆరబిందో ఫార్మా సంస్థను ఎత్తివేయాలని డిమాండ్‌ చేశారు. ”భూములివ్వకుంటే చచ్చిపోతాం.. మమ్మల్ని చంపకండి బిడ్డా” అని వేడుకున్నారు. సమస్యలను పరిశీలిస్తామని మురళీధర్‌రెడ్డి తెలిపారు.

Courtesy: Eenadu – July 8th 2008

Advertisements

Written by dilkibaatein

July 8, 2008 at 8:40 am

3 Responses

Subscribe to comments with RSS.

 1. hi boss , i agree with you some extent. proper price has to pay to farmers for lands obtaining for SEZ. But please do not oppose SEZs in state….due to these sezs only, economic activity other than software is going on. let SEZs participate its role ineconomic growth in INDIA , If you are a supporter of communist party ,let me remainder you SEZs were started by china in 1978 only.

  sandeepchilukuri

  July 10, 2008 at 7:12 pm

 2. Dear Sandeep, FYI
  True, SEZs were first implemented in China & rest of the third world, but they have proved to be a worst model. When rest of the world is trying to move away from SEZs, do you think its wise to adopt it for our nation.

  Read more details here…
  https://polepally.wordpress.com/2008/06/14/shenzhen_syndrome

  Polepally InSolidarity

  July 13, 2008 at 6:11 pm

 3. Sandeep Bhai !
  It’s not a prerequisite to subscribe any ‘isms’ to address the violation of an individuals rights.

  Suppose you have 3 acres of agricultural land & thats your only source of income, you dont have any other skills for livelihood. The Govt takes your land & pays you 5000-18,000 per Acre (in some cases nothing) & sells it for >= 40lakhs per acre. WHAT WOULD YOU DO ?

  If the Govt collected 1000 acres of such land then sold 200 acres of it & left the rest unused for more than 4 years while the original farmers / land owners / so called ‘anna daathas’ are struggling for a days meal. WOULDN’T YOU atleast have THE RIGHT TO RAISE YOUR VOICE ?

  JayaPrakash Telangana

  July 14, 2008 at 12:38 am


Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s

%d bloggers like this: