Fighting Injustice in Polepally SEZ

…more than courage it takes WILL to stand up against injustice !

భూసేకరణ కాదు.. ఆక్రమణ

leave a comment »

జడ్చర్ల, జులై 24 (ఆన్‌లైన్‌): సారు.. గ్రీన్‌పార్క్‌ పేరుతో మా భూములు సేకరించలేదు.. ఆక్రమించారు. నష్టపరిహారం డబ్బు మూడు సంవత్సరాలకు చెల్లించారు.. తీసుకున్న నష్టపరిహారంలో సగానికిపైగా లంచాలకే చెల్లించాం… మా భూములు మాకు కావాలని పోరాటం చేస్తే, మమ్మల్ని జైలుకు పంపారు.. భూములు లేకుంటే మాకు బతుకులేదు.. సెజ్‌లో నిర్మిస్తున్న కంపెనీలలో కూలికి పోతే గెటౌట్‌ అంటున్నారు.. అని గురువారం పోలేపల్లి నిర్వాసితులు, నవ తెలంగాణ ప్రజా పార్టీ వ్యవస్థాపకులు దేవేందర్‌గౌడ్‌ నిర్వహించిన సంఘీభావ యాత్రలో తమ ఆవేదన వ్యక్తంచేశారు. పోలేపల్లి సెజ్‌ వ్యతిరేక ఐక్య సంఘటన, నవ తెలంగాణ ప్రజా పార్టీ ఆధ్వర్యంలో పోలేపల్లిలో ఈ కార్యక్రమం జరిగింది.

కడుపు నింపేది చూడండి..చుక్కమ్మ, పోలేపల్లి నిర్వాసితులు

ఉన్న భూములు కోల్పోయాం. ముందుకు అడుగు వేసే శక్తి లేదు. మా కడుపు నిండేది చూడండి, వీపు మీద కొట్టండి కానీ కడుపు మీద కొట్టకండి, దున్నిన పొలంలోనే కూలి పనులకు వెళ్లే దుస్థితిలో ఉన్నాం. మమ్మల్ని దయ ఉంచి ఆదుకోండి.

నష్టపరిహారంలో సగానికిపైగా లంచాలకే ఇచ్చాం : శీనయ్యగౌడ్‌, పోలేపల్లి నిర్వాసితులు

ఉన్న భూమిని సేకరణ పేరుతో ఆక్రమించుకున్నారు. తీసుకున్న భూముల నష్టపరిహారానికి కోర్టుల ద్వారా ఇస్తామని అధికారులు బెదిరించారు. గ్రామ స్థాయి నుండి జిల్లా స్థాయి వరకు లంచాలు ఇచ్చాం. 5 సంవత్సరాల నుండి మా కుటుంబం అంతా కూలీ పని చేసుకుని బతుకుతున్నాం.

సేకరణ పేరుతో ఆక్రమించారు: బాలస్వామి గౌడ్‌ పోలేపల్లి సర్పంచ్‌

గ్రీన్‌ పార్క్‌ పేరుతో పోలేపల్లి పరిసరాలలో భూములను సేకరించలేదు, ఆక్రమించుకున్నారు. 2003 నుండి భూముల కోసం పోరాటాలు చేస్తూ ఉన్నాం. అసైన్డ్‌ భూములకు 18వేలు, పట్టా భూములకు 50వేలు మాత్రమే చెల్లించారు. ఆక్రమించిన మూడు సంవత్సరాల తర్వాత నష్టపరిహారం చెల్లించారు. భూములు అభివృద్ధి చేసుకున్న వాటికి నష్ట పరిహారం ఇవ్వడంలో ప్రభుత్వం మొండి వైఖరి అవలంభించింది. భూములు కోల్పోయిన బాధలో నా భర్త చనిపోయిండు మొగులమ్మ, పోలేపల్లి నిర్వాసితులు ప్రభుత్వం మా భూముల ను లాక్కోవడంతో, భూము లు కోల్పోయిన బాధతో నా భర్త చనిపోయిండు.

నష్టపరిహారం పొందడంలో మెట్టు, మెట్టుకు, పైసలు ఇచ్చినా. నాకు ఏడుగురు పిల్లలు. పెళ్లీడు కొచ్చిన పిల్లలకు పెళ్లి ఎలా చేయా లి. మా బతుకులు ఎలా బతకాలి. మాకు భూము లు ఇప్పించండంటూ కన్నీరు పెట్టుకుంది. కూలికి పోతే గెటౌట్‌ అంటున్నారు సత్యమ్మ, పోలేపల్లి నిర్వాసితురాలు మా భూములు మాకు కావాలి, భూముల కోసం పోరాటాలు చేస్తూనే ఉన్నాం. కంపెనీలలో కూలికి పోతే గెటౌట్‌ అంటున్నారు. మూడు రోజుల నుండి గేటు బయటనే ఉన్నాం. భూములు లేకపోతే బతుకు లేదు.

భూములు ఇమ్మంటే, జైలుకు పంపారు కుర్మయ్య,

పోలేపల్లి నిర్వాసితుడు జిల్లాలో మాకు జరిగినంత అన్యాయం ఎవరికీ జరగలేదు. భూములు గుంజుకోవడం పద్ధతి కాదని పోరాటాలు చేసి, భూములు ఇమ్మంటే మమ్మల్ని జైలుకు పంపారు. మాకు న్యాయం కావాలంటూ ఎమ్మెల్యేగా పోటీ చేశాం. ప్రభుత్వం మమ్మల్ని అన్యాయం చేసింది, దిక్కులేని వారిగా అయ్యాం. మాకు న్యాయం చేయండి.

సెంటు భూమిలేకుండా గుంజుకున్నారు లచ్చిరామ్‌ నాయక్‌, గుండ్లగడ్డ తండా

మా తండాలో సెంటు భూమిలేకుండా మా నుండి భూములు లాక్కున్నారు. మా నష్ట పరిహారం అందించడంలో అధికారులు తమ చు ట్టూ తిప్పుకున్నారు. మూడు సంవత్సరాల వరకు పైసలు ఇవ్వలేదు. ఆర్‌డివో వినడంటూ అధికారులు లంచం తీసుకున్నారు. ఇప్పుడు భూములు కోల్పోయి బజారున పడ్డాము. ఇది తట్టుకోలేక మా తండ్రి చనిపోయాడు.

నష్టపరిహారం చెల్లింపులో అధికారుల జాప్యం సుదర్శన్‌గౌడ్‌, నిర్వాసితుడు

నష్టపరిహారం చెల్లింపులో అధికారులు తీవ్ర జాప్యం చేశారు. నష్టపరిహారం డబ్బులో సగానికి పైగా దళారులు తిన్నారు.

ఇలా ప్రతి ఒక్కరు తమకు జరిగిన అన్యాయం, ప్రస్తుత జీవన పరిస్థితిపై పోలే పల్లి నిర్వాసితులు దేవేందర్‌గౌడ్‌ దృష్టికి తెచ్చారు. కార్యక్రమంలో పోలేపల్లి సెజ్‌ వ్యతిరేక ఐక్య సంఘటన కన్వీనర్‌ మధుకాగుల, సురేపల్లి సుజాత, పాశం యాదగిరి, శివన్న, కృష్ణ, వెంకటేశ్‌, రాజేష్‌ నాయక్‌, రుక్మిణీబాయి, గోపాల్‌ మాదిగ, నవ తెలంగాణ పార్టీ నాయకులు లింగప్ప, అంజిబాబు, నవీన్‌కుమార్‌, ఆంజనేయులు గౌడ్‌ పాల్గొన్నారు.

(Courtesy: July 25, 2008; Andhra Jyothy)

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

%d bloggers like this: