Fighting Injustice in Polepally SEZ

…more than courage it takes WILL to stand up against injustice !

న్యాయం కోసం పోరాటం

leave a comment »

ఎన్టీపీపీ ప్రధాన కార్యదర్శి పెద్దిరెడ్డి

జడ్చర్లగ్రామీణం,జూలై 24 (న్యూస్‌టుడే): మనదేశంలో అమెరికా విధానాల ప్రయోగంతో పేదవాడు పేదవాడిగా…సంపన్నులు మరింత సంపన్నులుగా మారుతున్నారని నవ తెలంగాణ ప్రజాపార్టీ ప్రధాన కార్యదర్శి పెద్దిరెడ్డి అన్నారు. గురువారం జడ్చర్ల మండలం పోలేపల్లి సెజ్‌ వద్ద బాధితులు నిర్వహించిన సంఘీభావ యాత్రలో ఆయన పాల్గొన్నారు. పోలేపల్లిసెజ్‌ వ్యతిరేక ఐక్య సంఘటన కన్వీనర్‌ మధుకాగుల అధ్యక్షతన జరిగిన సమావేశంలో పెద్దిరెడ్డి మాట్లాడారు. సెజ్‌ల కోసం రైతుల వద్ద నుంచి వేల ఎకరాలు భూములు తీసుకొని రైతులను కూలీలుగా మార్చే విధంగా ప్రభుత్వ నిర్ణయాలు ఉన్నాయన్నారు. కార్పొరేట్‌ సంస్థలు భూస్వాములుగా మారాయని ఆందోళన వ్యక్తం చేశారు. తెలంగాణ జిల్లాల్లో సెజ్‌ల వద్ద కడప, పులివెందులకు చెందిన వ్యక్తులు భూములు కొనుగోలు చేసి కోటీశ్వరులవుతున్నారని ఆరోపించారు. బినామీ పేర్లతో భూములు కొనుగోలు చేసిన వివరాలు బయటపెడతామని చెప్పారు. ఉద్యమాలే ఊపిరిగా ప్రజల వెంటే ఉండి న్యాయం జరిగేంత వరకు పోరాడుతామని ప్రకటించారు.

సేకరణ కాదు… ఆక్రమణ

గ్రీన్‌పార్క్‌ పేరుతో పోలేపల్లిలో భూముల సేకరణ చేయలేదని… ఆక్రమణ జరిగిందని పోలేపల్లి సర్పంచ్‌ బాలస్వామిగౌడ్‌ ఆరోపించారు. సెజ్‌ బాధితుల్లో తాము కూడా ఉన్నామని కిష్టారం సర్పంచ్‌ సుదర్శన్‌గౌడ్‌ తెలిపారు. బాధితుల తరఫున పోరాటంలో పాల్గొంటామని వారు ప్రకటించారు. సెజ్‌బాధితుడు కుర్మయ్య మాట్లాడుతూ… తెదేపా హయాంలోనే భూములు పోయాయని… అప్పుడు మీరు ఎందుకు రాలేదని దేవేందర్‌గౌడ్‌ను ప్రశ్నించారు. బాధితులు శీనయ్యగౌడ్‌, సుక్కమ్మ, రంగమ్మ తదితరులు తమకు జరిగిన అన్యాయాన్ని దేవేందర్‌గౌడ్‌ దృష్టికి తీసుకొచ్చారు. తెరాసలో ఎస్సీసెల్‌ విభాగంలో రాష్ట్ర కార్యదర్శిగా పని చేసిన జడ్చర్లకు చెందిన వేపూరి వెంకటేష్‌ నవతెలంగాణ ప్రజాపార్టీలో చేరినట్లు ప్రకటించారు.

(Courtesy: July 25, 2008; Eenadu, Mahaboobnagar District Edition)

Advertisements

Written by Polepally InSolidarity

July 26, 2008 at 1:38 am

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

%d bloggers like this: