Fighting Injustice in Polepally SEZ

…more than courage it takes WILL to stand up against injustice !

కేంద్రాన్ని మోసం చేశారు… రాష్ట్ర ప్రభుత్వం పునరాలోచించాలి

leave a comment »

* పారిశ్రామికీకరణకు విరుద్ధంగా సెజ్‌లకు అప్పగించారు
* తెలంగాణ విద్యావంతుల వేదిక రాష్ట్ర అధ్యక్షులు కోదండరాం
జడ్చర్ల గ్రామీణం, న్యూస్‌టుడే: కేంద్రం ద్వారా వచ్చిన నిధులతో గ్రోత్ కారిడార్ కోసం పోలేపల్లిలో వెయ్యి ఎకరాల్లో పారిశ్రామిక అభివృద్ధి చేయాల్సి ఉండగా అందుకు విరుద్ధంగా వ్యవహరించిన రాష్ట్ర ప్రభుత్వం కేంద్రాన్ని మోసం చేసిందని తెలంగాణ విద్యావంతుల వేదిక రాష్ట్ర అధ్యక్షులు కోదండరాం ఆరోపించారు. మంగళవారం జడ్చర్ల మండలంలోని పోలేపల్లి ఫార్మా కంపెనీల వద్దకు చేరిన మట్టి మనుషుల పాదయాత్ర, తెలంగాణ కోసం అంతి’మా’యాత్రలో పాల్గొన్న ఆయన అనంతరం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. పారిశ్రామికీకరణ కోసం భూములను అభివృద్ధి చేయాల్సి ఉండగా సెజ్‌లుగా మార్చి పెద్ద కంపెనీలకు అప్పగించిందన్నారు. ఈ విషయంపై కాగ్ నివేదిక ఆక్షేపించిందని గుర్తు చేశారు. ఇందుకు రాష్ట్ర ప్రభుత్వం పునరాలోచించాలని డిమాండ్ చేశారు. ఏ లక్ష్యం కోసం తీసుకున్నారో ఆ లక్ష్యం నెరవేర్చాలని, రైతులకు భూమికి భూమి ఇవ్వాలని, ఉపాధి అవకాశాలు కల్పించాలని, నష్టపరిహారం, చనిపోయిన వారి కుటుంబాలకు ఎక్స్‌గ్రేషియా చెల్లించాలని ప్రభుత్వాన్ని కోరారు.
ఇక్కడి పరిస్థితులు కన్నీరు తెప్పించాయి

పోలేపల్లి బాధితుల గోడు విన్నాక ఇక్కడి పరిస్థితులు కన్నీరు తెప్పించాయని పాలమూరు జిల్లాలో ఇంతకన్న దుర్మార్గం ఇంకొకటి లేదని తెలంగాణ మట్టిమనుషులు యాత్ర నాయకులు వేనేపల్లి పాండురంగారావు, తెలంగాణ విద్యావంతుల వేదిక నాయకులు రాఘవచారీ ఆందోళన వ్యక్తం చేశారు. ఇక్కడి ప్రజల అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకొని నాయకులు ఇలా వ్యవహరిస్తున్నారన్నారు. కల్వకుర్తి ఎత్తిపోతల పథకం పాలమూరుకు ఏ విధంగానైనా ఉపయోగపడదని, రాజోలిబండలో మోసాలతో నీళ్లు తరలిస్తున్నారని అన్నారు. ఫార్మా కంపెనీల వల్ల కాలుష్యంతో అనేక గ్రామాలు నాశనం అయ్యే అవకాశాలున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఇలాంటి కంపెనీలు అవసరంలేదని తాగునీరు, సాగునీరు, భూములు కావాలని డిమాండ్ చేశారు. పోలేపల్లి సెజ్ వ్యతిరేక ఐక్య సంఘటన కన్వీనర్ మధుకాగుల, తెలంగాణ విద్యావంతుల వేదిక జిల్లా కన్వీనర్ మద్దిలేటి, అసిస్టెంట్ ప్రొఫెసర్ డా||రాంకిషన్ తదితరులు పాల్గొన్నారు.

(Courtesy : Eenadu Mahaboobnagar Distric Edition, 28 July 2008)

Advertisements

Written by Polepally InSolidarity

July 28, 2008 at 1:10 pm

Posted in Eenadu, Telugu

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

%d bloggers like this: