Fighting Injustice in Polepally SEZ

…more than courage it takes WILL to stand up against injustice !

పట్టాల పంపిణీని బహిష్కరించిన సెజ్‌ బాధితులు

with one comment

మా భూములు మాకు కావాలని డిమాండ్‌
కార్యక్రమంలో గందరగోళం, వాగ్వివాదం ; బుజ్జగించిన ఎమ్మెల్యే

జడ్చర్లగ్రామీణం, న్యూస్‌టుడే:సెజ్‌ ఏర్పాటులో భూములు కోల్పోయిన బాధిత రైతులకు పట్టాలు పంపిణీ చేసిన సందర్భంగా శనివారం పోల్కంపల్లి గ్రామంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో గందరగోళం నెలకొంది. స్థానిక ఎమ్మెల్యే మల్లురవి ప్రసంగిస్తుండగా బాధితులు లేచి వాగ్వివాదానికి దిగారు. మా భూములు మాకు కావాలని నినాదాలు చేశారు. దీంతో గంటపాటు సమావేశంలో గందరగోళం నెలకొంది. ఎమ్మెల్యే, అధికారులు, పోలీసులు వారించినా రైతులు పట్టించుకోలేదు. ఎమ్మెల్యే పట్టాలు ఇచ్చేందుకు ప్రయత్నించగా ఎవరూ తీసుకోవడానికి ముందుకు రాలేదు. దీంతో కార్యక్రమాన్ని ముగించి అందరూ బయటకు వెళ్లిపోయారు. పట్టాలు తహశీల్దారు కార్యాలయానికి వెళ్లి తీసుకోవాలని ఎమ్మెల్యే సూచించారు. చర్చలు జరిగిన అనంతరం కొందరు తాము పట్టాలు స్వీకరించమని భీష్మించుకొని కూర్చోగా, మరికొందరిని బుజ్జగించి సాయంత్రం 7 గంటలకు వరకు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ సతీష్‌ చంద్ర, ఎంపీపీ నిత్యానందం, సర్పంచ్‌ బాలస్వామిగౌడ్‌, మార్కెట్‌ ఛైర్మన్‌ రమేష్‌రెడ్డి, డీసీసీ అధికార ప్రతినిధి శివకుమార్‌, తహశీల్దారు జహంగీర్‌ అలీ తదితరులు పాల్గొన్నారు.

(Courtesy : 10 Aug 2008, Andhra Jyothy)

Advertisements

Written by Polepally InSolidarity

August 10, 2008 at 4:04 am

One Response

Subscribe to comments with RSS.

  1. “మరికొందరిని బుజ్జగించి సాయంత్రం 7 గంటలకు వరకు పంపిణీ చేశారు” if taking some of the vulnerable farmers & getting them drunk is ‘bujjaginchudu’… then i guess the administration is doing a good job at it.

    JayaPrakash Telangana

    August 10, 2008 at 8:15 pm


Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

%d bloggers like this: