Fighting Injustice in Polepally SEZ

…more than courage it takes WILL to stand up against injustice !

మల్లు రవీ! ఏమిటీ పనీ?

with one comment

పోలేపల్లి బాధిత రైతులకు మొన్న మల్లు రవి ఇచ్చిన ఇళ్ల పట్టాలు బోగస్ అని తేలింది. హడావిడిగా తయారు చేసిన సదరు పట్టాల్లో వంద తప్పులు ఉన్నాయి. అసలు ఏపి.ఐ.ఐ.సి. ఆధీనంలో ఉన్న భూముల పట్టాలు రెవెన్యూ శాఖ ఎలా ఇచ్చిందో అర్థం కావట్లేదు. బహుశా రెవెన్యూ వాళ్లకు కాస్త ఆలస్యంగా జ్ఞానోదయం అయ్యింది కాబోలు అందుకే పంపిణీ చేసిన పట్టాల్లో “ఏపి.ఐ.ఐ.సి ద్వారా పంపిణీ చేయబడిన…” అన్న వాక్యంలో “ఏపి.ఐ.ఐ.సి” అన్న పదాన్ని స్కెచ్ పెన్నుతో కొట్టి వేశారు.

ఇక ఇళ్ల స్థలాలు లే ఔట్ పరిశీలిస్తే దిమ్మ తిరిగిపోతుంది మనకు. ఇంత సుందరమైన లే ఔట్ ను మనం జన్మలో చూసి ఉండం.

ఆ పట్టాలు, లే ఔట్ బొమ్మలు ఇక్కడ చూసి తరించండి.

https://polepally.wordpress.com/2008/08/11/farce_land_deeds/polepally_land_deed_1/

https://polepally.wordpress.com/2008/08/11/farce_land_deeds/polepally_land_deed_2/

ఆ “పట్టా” లో రాసినదాని ప్రకారం, లబ్దిదారునికి కేవలం ఆ ఇంటిస్థలం లీజుకు ఇచ్చినట్టే. దానిని లబ్దిదారులు అమ్ముకోవడానికి కానీ, వేరొకరికి బదలాయించడానికి కానీ వీలు లేదు.

మరొక విషయం ఏమిటంటే ప్రభుత్వం రైతులకు ఎకరానికి ఇచ్చింది 18000. కాబట్టి ఇప్పుడు వారి దగ్గర లాక్కుని వారికే ఇచ్చిన ఈ 200 గజాల స్థలం విలువ కేవలం 700 రూపాయలు అవుతుంది.

మల్లు రవి & కంపెనీ చేసింది ఎంత గొప్ప సాయమో తెలుసుకుని పోలేపల్లి బాధిత రైతులు తాము మరొక సారి మోసపోయామని ఆగ్రహంతో ఊగిపోయారు.

ఇవ్వాళ జడ్చర్ల తహసీల్దార్ కార్యాలయం ముందు ఈ బోగస్ పట్టాలను కుప్పపోసి తగులబెడదామని వారు నిర్ణయించుకున్నారు.

Advertisements

Written by dilkibaatein

August 12, 2008 at 11:33 am

One Response

Subscribe to comments with RSS.

  1. […] సెజ్ కొరకు సేకరించిన భూమిలో ఒక మూల కొంత భూమిని ప్లాట్లుగా విభజించి బాధిత రైతులకు ఆ ప్లాట్ల “పట్టాలు” రెణ్నెళ్ల కిందట హడావిడిగా పంపిణి చేశాడు స్థానిక ఎమ్మెల్యే మల్లు రవి. అయితే ఆ పట్టాలు లీజుతో సమానమనీ, బోగస్ … […]


Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

%d bloggers like this: