Fighting Injustice in Polepally SEZ

…more than courage it takes WILL to stand up against injustice !

బోగస్ పట్టాలకు వ్యతిరేకంగా ధర్నాకు దిగిన పోలేపల్లి రైతులు

leave a comment »

తమకు ఇచ్చిన బోగస్ పట్టాలకు వ్యతిరేకంగా జడ్చర్ల ఎమ్మార్వో ఆఫీసు ముందు 12 ఆగస్ట్ 2008 నాడు పోలేపల్లి సెజ్ బాధిత రైతుల ధర్నాకు సంబంధించిన పత్రికా వార్తలు

ఆంధ్రజ్యోతి దిన పత్రిక : పోలేపల్లి సెజ్‌ బాధితుల ధర్నా
 
జడ్చర్ల, ఆగష్టు 12 (ఆన్‌లైన్‌): పోలెపల్లి సెజ్‌ బాధితులకు 200 గజాల స్థలానికి సంబంధించిన ధృవీకరణ పత్రాలు తప్పుగా యిచ్చారంటూ మంగళవారం మండల తహసీల్ధార్‌ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. పోలెపల్లి సెజ్‌ వ్యతిరేక ఐక్య సంఘటన కన్వీనర్‌ మధు కాగుల అధ్వరంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో దాదాపు 100 మంది సెజ్ నిర్వాసితులు పాల్గొన్నారు. మా భూములు మాకే కావలంటు సెజ్ హటావో, జమీన్ బచావో అంటూ నినాదాలు చేశారు ఈ సందర్భంగా మధు కాగుల మాట్లాడుతూ 9వ తేదిన పోలెపల్లి గ్రామంలో సెజ్ నిర్వసితులకు 200 గజాల ప్లాటు పట్టాలను పంపిణీ చేశారని, ఎమ్మెల్యే ప్రకటించిన విధంగా కాకుండా తప్పుపట్టాలు అందచేశారని ఆరోపించారు.

ప్లాట్లను రెవెన్యూ అధికారులతో కాకుండా భూముల సేకరించిన ఎ.పి.ఐ.ఐ.సి సంస్థ నుంచి సర్వాధికారాలు సర్వ హక్కులు కలిగిన రిజిష్ట్రర్‌ డాక్యుమెంట్‌ చేయించిన పట్టాలను ఎంపిక చేయాలని డిమాండ్ చేశారు. పట్టాల పంపిణీలో నివాస హామీ పత్రం ఉండాలని, సర్వాధికారాలు సర్వహక్కులు పట్టాదారునికి ఇవ్వాలని, ఎ.పి.ఐ.ఐ.సి వారిచే రిజిష్ట్రర్‌ పట్టా ఇవ్వాలని, డిమాండ్‌ చేశారు. ప్రస్తుతం పంపిణీ చేసిన పట్టాలలో ప్రభుత్వం ఆమోదింపబడిన విధంగా ఇల్లు కట్టాలని, స్థలాన్ని అమ్మేందుకు, దానం చేసేందుకు , మార్చుకునేందుకు వీలు లేదని విధంగా ఉందని వివరించారు. ఈ కార్యక్రమంలో గోపాల్‌ మాది, రావుల కిష్టయ్య, వెంకటేశ్వర్లు, పోలేపల్లి సెజ్‌ నిర్వాసితులు తదితరులు పాల్గొన్నారు.

Advertisements

Written by dilkibaatein

August 13, 2008 at 9:04 am

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

%d bloggers like this: