Fighting Injustice in Polepally SEZ

…more than courage it takes WILL to stand up against injustice !

సెజ్‌లపై సెగ: నేడు రాజధానిలో భారీ ధర్నా

leave a comment »

హైదరాబాద్‌, ఆగస్టు 24 (ఆన్‌లైన్‌): ప్రత్యేక ఆర్థిక మండలి (సెజ్‌) ఏర్పాటు చేసేది ప్రైవేటు డెవలపర్లు. భూమి యజమానులు సామాన్య రైతులు. ఆ భూసేకరణకు చట్టం ప్రయోగించేది… ప్రభుత్వం! ఆ చట్టం బూచిని చూపిస్తూ ప్రైవేటు డెవలపర్ల ‘సొంత’ దందా! సత్యవేడు సెజ్‌లో జరిగిందదే. కాకినాడ సెజ్‌లో జరుగుతున్నదీ అదే. భూసేకరణ సమయంలో తమ హక్కులు హరిస్తున్నారని రైతులు వాపోతున్నా ప్రభుత్వం స్పందించడంలేదు. తన పని తాను చేసుకుపోతోంది. ఈ నేపథ్యంలో బాధితులు, సామాజిక కార్యర్తల్లో సెజ్‌లపై సెగ రగులుతోంది.

సోమవారం హైదరాబాద్‌లో సెజ్‌లకు వ్యతిరేకంగా భారీ ధర్నా జరగనుంది. దేశంలో ఎక్కడాలేని విధంగా మన రాష్ట్రానికి 97 సెజ్‌లు వచ్చాయి. వీటికి ఇస్తున్న భూమి సుమారు అరవై వేల ఎకరాల వరకు ఉంటుందని అధికార వర్గాలు తెలిపాయి. కొన్ని చోట్ల బలవంతగా భూసేకరణ జరుపుతున్నారు. ప్రభుత్వం భూసేకరణ చట్టం అస్త్రాన్ని ప్రయోగిస్తుంటే.. దీన్ని ఆసరాగా చేసుకుని ప్రైవేట్‌ సంస్థల ప్రతినిధులు బేరసారాలు సాగిస్తున్నారు. భూములు చేజిక్కుంచుకుంటున్నారు. కాకినాడ సెజ్‌ భూసేకరణలో ప్రమోటర్లు రైతులను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తూ వారి హక్కులను కూడా హరిస్తున్నారనే ఆరోపణలున్నాయి.

ఇదే విషయంపై బాధిత రైతులు ముఖ్యమంత్రికి, రాష్ట్ర మానవ హక్కుల సంఘానికి ఫిర్యాదులు చేశారు. దీనిపై రాష్ట్ర మానవ హక్కుల సంఘం ఇప్పటికే స్పందించింది. ప్రభుత్వం యంత్రాంగం మాత్రం కాకినాడలో సెజ్‌ డెవలపర్‌కు అండగా నిలుస్తోందని చెబుతున్నారు. ఈ సెజ్‌లో ఓఎన్జీసీ స్థానే రిఫైనరీ ఏర్పాటుకు జీఎంఆర్‌ సంస్థ ముందుకు రావటంతో మిగిలిన భూసేకరణ పనులు కూడా మరింత ఊపందుకున్నాయని చెబుతున్నారు. కొద్ది రోజుల క్రితం మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల ప్రగతిని సమీక్షించిన ముఖ్యమంత్రి రాజశేఖరరెడ్డి కూడా కాకినాడ సెజ్‌కు సంబంధించి పెండింగ్‌ భూసేకరణను సెప్టెంబర్‌ నెలాఖరులోగా పూర్తి చేయాలని ఆదేశించారు.

తూర్పు గోదావరి జిల్లా కాకినాడ సమీపంలోని యు.కొత్తపల్లి, తొండంగి మండలాల్లో ఈ సెజ్‌ కోసం సుమారు పది వేల ఎకరాలు సేకరించాలని లక్ష్యంగా పెట్టుకోగా… ఇప్పటికే 8 వేల ఎకరాలపైనే భూసేకరణ పూర్తయింది. ఈ సెజ్‌ కోసం 13 గ్రామాలను పూర్తిగా ఖాళీ చేయిస్తున్నారు. ఏటా రెండు పంటలు పండే భూములు లాక్కొని అంతంత మాత్రం పరిహారం ఇస్తున్నారని రైతులు చెబుతున్నారు. భూసేకరణకు నోటిఫికేషన్‌ విడుదల చేసినప్పటి నుంచే ఇక్కడ ఆందోళనలు జరుగుతున్నాయి. అయినా… ప్రభుత్వం తనపని తాను చేసుకుపోతోంది.

చిత్తూరు జిల్లాలోని సత్యవేడు సెజ్‌ కోసం అవసరమైన భూములను కూడా భూసేకరణ బూచిని చూపి కొనుగోలు చే శారు. ప్రభుత్వ భూములను కూడా కారుచౌకగా ప్రైవెట్‌ డెవలపర్లకు కోసం కేటాయించారు. రియల్‌ ఎస్టేట్‌ సంస్థలకు కోట్ల రూపాయల విలువైన భూములను కట్టబెట్టారు. సెజ్‌ల పేరుతో కోట్ల రూపాయల భూములు దక్కించుకున్న సంస్థలు.. సంబంధిత ప్రాజెక్టులు అమలు చేస్తున్నదీ లేనిదీ ప్రభుత్వం పట్టించుకోవడంలేదు. ప్రభుత్వంలోని కొందరు పెద్దలు కేవలం తమవారికి చెందిన రియల్‌ ఎస్టేట్‌ ప్రయోజనాలను కాపాడేందుకే వివిధ ప్రాంతాల్లో సెజ్‌లను ప్రోత్సహించారనే ఆరోపణలు ఉన్నాయి.

సెజ్‌ల చట్టాన్ని రద్దు చేయటంతోపాటు రాష్ట్ర ప్రభుత్వం కోస్టల్‌ కారిడార్‌ అభివృద్ధి పేరుతో జారీ చేసిన జీవో 34ను ఉపసంహరించాలని డిమాండ్‌ చేస్తూ ప్రజా ఉద్యమాల జాతీయ కూటమి (ఎన్‌ఏపీఎం) సోమవారం హైదరాబాద్‌లో ఆందోళన నిర్వహించనుంది. ఇందిరాపార్కు వద్ద జరిగే ధర్నాలో పర్యావరణ ఉద్యమవేత్త మేథాపాట్కర్‌, పౌర హక్కుల ఉద్యమ నేతలు బాలగోపాల్‌, కణ్ణబీరన్‌, కె. ఆర్‌.చౌదరి, జీవన్‌కుమార్‌, చెన్నయ్య తదితరులు పాల్గొంటారు. ఈ ధర్నాలో పాల్గొనేందుకు కాకినాడ సెజ్‌ బాధితులు పెద్దసంఖ్యలో హైదరాబాద్‌కు బయలుదేరారు.

Courtesy: Andhra Jyothy 25th Augu 2008

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

%d bloggers like this: