Fighting Injustice in Polepally SEZ

…more than courage it takes WILL to stand up against injustice !

రైతు పొట్టకొట్టి బుకాయింపా?

leave a comment »

రైతు సంతోషిస్తున్నాడా?
వారి పొట్టకొట్టి బుకాయింపా?
ముందస్తు సమాచారం ఏదీ
నోటిఫికేషన్లు ఎక్కడ
పునరావాస చర్యలేవీ
నీటి వనరుల్ని సేకరించట్లేదా
మంత్రులూ… వీటికి సమాధానాలు ఎక్కడ?
చిలమత్తూరు భూసేకరణలో పారదర్శకతకు పాతర

హైదరాబాద్‌ – న్యూస్‌టుడే : ప్రభుత్వం ఎక్కడైనా భూమిని సేకరిస్తూ ఉంటే… ఎందుకోసం సేకరిస్తున్నారో చెప్పడం ధర్మం. ఆ మేరకు నోటిఫికేషన్లు ఇవ్వడం, పరిహారాన్ని ప్రకటించడం, పునరావాస చర్యలు చేపట్టడం విధిగా చేయాల్సిన పనులు. కానీ అనంతపురం జిల్లా చిలమత్తూరు భూసేకరణ విషయంలో ప్రభుత్వం పారదర్శకతకు పాతరేసింది. ఎంత భూమిని సేకరిస్తుందో, ఏయే సర్వే నెంబర్లలో, ఎందుకోసం సేకరిస్తుందో ఎవరికీ చెప్పలేదు. నోటిఫికేషన్లూ ఇవ్వలేదు. భూమిని కోల్పోయే రైతుల పునరావాసానికి చర్యల్లేవు. భూములు కోల్పోనున్న రైతులు కొన్ని రోజులుగా ఆందోళనలు చేస్తూనే ఉన్నారు. సోమవారం చేశారు. ఇవేవీ ప్రభుత్వ కళ్లకు కనబడినట్లులేవు. రైతులంతా సంతోషంగా ఉన్నారంటూ అబద్ధాలాడుతోంది. వారిసమ్మతితోనే భూముల్ని సేకరిస్తున్నామని మంత్రులు దివాకరరెడ్డి, రఘువీరారెడ్డిలు పేర్కొనడమే కాదు, అనంతపురం అభివృద్ధిని అడ్డుకునేందుకు ‘ఈనాడు’ పత్రిక ప్రయత్నిస్తోందంటూ ఆరోపణలు గుప్పించారు.

ఏపీఐఐసీ జోనల్‌ మేనేజర్‌ కార్యాలయం నుంచి కలెక్టర్‌కు లేఖ అందిన మరుక్షణం భూ సేకరణకు శ్రీకారం చుట్టారు. రాత్రి దండోరా వేసి, ఉదయాన్నే పాస్‌ పుస్తకాలు తెమ్మన్నారని, భూములను పరిశీలించి వెళ్లిపోయారని బాధిత రైతులు వాపోతున్నారు. అక్కడ ఎలాంటి పరిశ్రమలు ఏర్పాటుచేయాలని నిర్ణయించారో, అందుకు ఎంత భూమి అవసరమో పారదర్శకంగా ప్రకటించాల్సి ఉండగా… అలాంటిదేమీ జరగలేదు. పైగా తొలుత అసైన్డ్‌ భూమి మాత్రమే సేకరించనున్నట్లు ఏపీఐఐసీ రాసిన లేఖలో పేర్కొన్నారు. ఉదాహరణకు చిలమత్తూరు మండలంలోని వీరాపురం గ్రామంలో 1945.97 ఎకరాల భూమి ఉంది. ఇందులో 1113.45 ఎకరాల్లోని అసైన్డ్‌, ప్రభుత్వ భూమి సేకరణ జాబితాలో ఉంది. మిగిలింది పట్టా భూమి. అసైన్డ్‌, పట్టా భూమి పక్కపక్కనే ఉన్నప్పుడు మొత్తం భూ సేకరణకు నోటిఫికేషన్‌ ఇవ్వకుండా… మొదట వచ్చే పట్టా భూమిని వదిలిపెట్టి, తర్వాత ఉండే అసైన్డ్‌ భూమిని సేకరణ జాబితాలో చేర్చడం వెనుక ఉద్దేశమేమిటో మంత్రులే చెప్పాలి. తాడిపత్రిలోతప్ప ఎక్కడా నీటి వనరుల్లేవని మంత్రులు సెలవిచ్చారు. కానీ వీరాపురం గ్రామంలోనే 59 బోర్లున్నాయి. ఇవన్నీ పని చేస్తున్నాయి. ప్రభుత్వం ఇస్తున్న ఉచిత విద్యుత్‌ సౌకర్యాన్ని రైతులు పొందుతున్నారు. గ్రామంలో చెరకు ఎక్కువగా పండిస్తున్నారు.

చిలమత్తూరు మండలంలో 3దశల్లో 11,716.37 ఎకరాల భూ సేకరణకు నిర్ణయించారు. ఇందులో తొలి దశ సేకరణ మొత్తం 2240 ఎకరాలు. ఈ భూమిని కోల్పోయే రైతులకు ఎలాంటి పునరావాసాన్ని కల్పిస్తున్నారో ప్రభుత్వం చెప్పనేలేదు. ఎక్కువ మంది రెండు నుంచి ఐదెకరాల వరకు భూమిఉన్న దళిత, బలహీన వర్గాల రైతులు. ఇక్కడ ఎకరం రూ.10వేల నుంచి రూ.15వేల వరకు ఉందని, కానీ ప్రభుత్వం రూ.1.75 లక్షలు పరిహారం ఇవ్వడంతో రైతులు సంతోషంగా ఉన్నారని మంత్రులు చెప్పారు. నిజానికి అనంతపురం జిల్లాలో ఈ ధర ఎక్కువే. అయితే నాలుగు లేన్ల జాతీయ రహదారి నిర్మాణంలో ఉండటం, బెంగుళూరు అంతర్జాతీయ విమానాశ్రయానికి దగ్గరగా ఉండటంతో చిలమత్తూరు ప్రాంతంలో భూములకు డిమాండ్‌ విపరీతంగా పెరిగింది. చిలమత్తూరు మండలానికి ఆనుకొని ఉన్న కర్ణాటకలోని భూముల్ని ఎకరం రూ.3 లక్షల నుంచి రూ.5 లక్షల వరకు కొనుగోలు చేశారు. ఇప్పుడు ఇంకా పెరిగాయి. మంత్రి దివాకరరెడ్డి చెప్పినట్లు సమీప ప్రాంతంలో ఎకరం రూ.15 వేలకు కాదు, రూ.50 వేలకు దొరికినా రైతులు సంతోషంగా తీసుకునేవారే. కానీ ఆ పరిస్థితి ఎక్కడా లేదు.

మంత్రులు మాట్లాడుతూ చెరువులు, వాగులు, వంకల్ని సేకరించడం లేదని, ఇవన్నీ ప్రభుత్వ ఆధీనంలోనే ఉన్నాయని ప్రకటించారు. ఏపీఐఐసీ పేర్కొన్న భూసేకరణ జాబితాలో గ్రామాల వారీగా సర్వే నెంబర్లు వివరాల్ని కూడా స్పష్టంచేసింది. బహుశా మంత్రులకు ఇందులోని వివరాలు తెలియవో, లేక తెలిసీ బుకాయిస్తున్నారో వారికే తెలియాలి. ఈ ఏడాది మే ఐదో తేదీన కర్నూలులోని ఏపీఐఐసీ జోనల్‌ మేనేజర్‌ జి.తిరుపతయ్య అనంతపురం జిల్లా కలెక్టర్‌కు 3542.77 ఎకరాల భూసేకరణకు సంబంధించి రాసిన లేఖలో(నెం: జెడ్‌ఓ-కేడీపీ/ఐడీపీ.కేడీఆర్‌/హెచ్‌ఎన్‌పీ/2008/1853) గ్రామాల వారీగా సర్వే నెంబర్ల వివరాల్ని పేర్కొని, వాటిని తమకు స్వాధీనం చేయాలని కోరారు. ఇందులో చిలమత్తూరు మండలం కోడూరు గ్రామంలోని సర్వే నెంబరు 18లో 60.36 ఎకరాల్లో ఉన్న చెరువు, సర్వే నెంబరు 34లో 30.48 ఎకరాల్లో ఉన్న కుంట, 146లో 28 ఎకరాల్లో ఉన్న కుంట ఉన్నాయి. శెట్టిపల్లి గ్రామంలో సర్వే నెంబరు 20, 22లో ఉన్న వంకలు ఉన్నాయి. ఈ గ్రామంలో ఏడు సర్వే నెంబర్లలో ఉన్న 70 ఎకరాల మేత బీడు కూడా ఉంది. ఈ ఏడాది జులై 17న కర్నూలు జోనల్‌ మేనేజర్‌ జె.రామాంజనేయులు అనంతపురం జిల్లా కలెక్టర్‌కు 5933.57 ఎకరాల సేకరణకు సంబంధించి మరో లేఖ(జెడ్‌ఓ/ఏపీఐఐసీ-కేఎన్‌ఎల్‌/ఐపీ.చిలమత్తూరు/2008) రాశారు. ఇందులో హుస్సేనాపురంలో సర్వే నెంబరు 31లో 8.64 ఎకరాల్లో వంక, సర్వే నెంబరు 40లో 5.51 ఎకరాల్లో కుంట, 46లో 17.45 ఎకరాల్లో కుంట ఉన్నాయి. కోడూరు గ్రామంలో సర్వే నెంబరు 832లో కాలవ, 38లో కుంట, 156లో 57.01 ఎకరాల్లో ఉన్న చెరువు ఉన్నాయి. చిలమత్తూరు నార్త్‌లో సర్వే నెంబరు 68, 69లలో 151.68 ఎకరాల్లో ఉన్న పెక్కల చెరువు, 417లో 80.26 ఎకరాల్లో ఉన్న తుమ్మలకుంట చెరువు, 471లో 72.10 ఎకరాల్లో ఉన్న కుంట, 728లో 35.28 ఎకరాల్లో ఉన్న చెరువు, 849లో 18.94 ఎకరాల్లో ఉన్న కాలవ, 850, 851, 853లో 59 ఎకరాల్లో ఉన్న నదీ ప్రవాహ ప్రాంతం, 908లో 42.33 ఎకరాల్లో ఉన్న కొడిగేపల్లి చెరువు సేకరణ జాబితాలో ఉన్నాయి. చిలమత్తూరు సౌత్‌లో సర్వే నెంబరు 708లో 11.67 ఎకరాల్లో వంక, 964లో 13.85 ఎకరాలు, 972లో 11.13 ఎకరాల్లో ఉన్న కుంటలు, 998లో 34.55 ఎకరాల్లో చెరువు, 1011లో 21.93 ఎకరాల్లో చెరువు, 1016లో 11.38 ఎకరాల్లో చెరువు, 1018లో 69.02 ఎకరాల్లో ఉన్న చెన్నంపల్లి చెరువు, 1060, 1061, 1064, 1065 సర్వే నెంబర్లలో ఉన్న 4వంకలు ఉన్నాయి. భూసేకరణ జరపాలని నిర్ణయించిన గ్రామాల్లోని చెరువులు, వంకలు, కుంటలు, చివరకు నదులు ప్రవహించే మార్గాలు సర్వే నెంబర్లతో సహా తమకు అప్పగించాలని ఏపీఐఐసీ కోరితే… ఈ గ్రామాల్లో ఇక వ్యవసాయానికి ఉన్న వనరులేంటో మంత్రులకే తెలియాలి. అంటే ఈ గ్రామాల్లో ఉన్న మొత్తం భూమిని సేకరించి, వ్యవసాయమనేదే లేకుండా చేస్తారన్నమాట.

భూ కేటాయింపులోనూ ఇంతే:

రైతుల నుంచి భూములను తీసుకొన్న ఏపీఐఐసీ- అక్కడ ఎలాంటి పరిశ్రమల ఏర్పాటుకు అవకాశముందో పరిశీలించి, అందులో అనుభవమున్నవారిని ఎంపిక చేయాల్సి ఉండగా అలాంటిదేమీ జరగలేదు. తొలి విడతలో సేకరించిన భూమిలో వెయ్యి ఎకరాలు లేపాక్షి నాలెడ్జి హబ్‌కు కేటాయిస్తూ మే నెల ఆరున ఏపీఐఐసీ లేఖరాసింది. రెండో, మూడవ విడత సేకరించనున్న భూమిని ఈ సంస్థకే కేటాయించనున్నారు. పరిశ్రమల ఏర్పాటులో లేపాక్షి నాలెడ్జి హబ్‌కు ఉన్న అనుభవం ఏమిటి? రౖౖెతులకు ఇందులో ఎలాంటి భాగస్వామ్యం ఉంటుంది? ఎలాంటి ఉపాధి అవకాశాలు ఏర్పడతాయి?వంటి ప్రశ్నలకు ప్రభుత్వంవైపు నుంచి సమాధానాల్లేవు.

Courtesy: Eenadu 26th August 2008

Advertisements

Written by dilkibaatein

August 26, 2008 at 9:12 am

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

%d bloggers like this: