Fighting Injustice in Polepally SEZ

…more than courage it takes WILL to stand up against injustice !

సెజ్‌లు కాదు..అగ్నిగుండాలు!

leave a comment »


గాంధీ పేరుతో మోసం
ప్రేక్షకపాత్రలో గవర్నర్లు
కోస్తా కారిడార్‌పై జీవోను రద్దు చేయండి
ఇదే మీకు చివరి అవకాశం
ముఖ్యమంత్రి వైఎస్‌కు మేధా హెచ్చరిక
జోక్యం చేసుకోవాలని తివారికి విజ్ఞప్తి

హైదరాబాద్‌, న్యూస్‌టుడే: ”కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వికాసం పేరిట వినాశనాన్ని సృష్టిస్తున్నాయి. అతి తెలివిగా గాంధీ పేరు వాడుకుంటూ.. అభివృద్ధిమంత్రంతో పేదల భూములను కొల్లగొడుతున్నాయి. న్యాయ, పోలీసు విభాగాలు అందుకు అండగా నిలుస్తున్నాయి. అవి.. సెజ్‌లు కాదు దేశవ్యాప్తంగా పుట్టుకొస్తున్న అగ్నిగుండాలు. ఎంతో అభివృద్ధి చెందిన కోస్తా కారిడార్‌ను ప్రభుత్వం కొన్ని కార్పొరేట్‌ సంస్థల చేతుల్లో పెడుతోంది. గవర్నర్లకు వీటిని ఆపేశక్తి ఉంది. అయితే ఎక్కడా వారు తమ అధికారాలను వినియోగించడం లేదు” అని పర్యావరణ వేత్త మేధాపాట్కర్‌ విమర్శించారు. సోమవారమిక్కడి ఇందిరాపార్కువద్ద ప్రజాఉద్యమాల జాతీయ సమాఖ్య ఆధ్వర్యంలో మూడ్రోజుల ధర్నా కార్యక్రమం ప్రారంభమైంది. ఈసందర్భంగా సెజ్‌, అభివృద్ధి పేరుతో ప్రభుత్వాలు జరుపుతున్న భూసేకరణపై ఆమె మండిపడ్డారు.


”కోస్తా కారిడార్‌ ఎంతో అభివృద్ధి చెందింది. రాష్ట్రంలో ఉత్పత్తి అయ్యే 96 లక్షల ధాన్యంలో.. అక్కడి నుంచే 67 లక్షల టన్నులు వస్తోంది. తీర ప్రాంతంలో ఉన్న తొమ్మిది జిల్లాల నుంచి రూ.6,700 కోట్ల విలువైన చేపల ఉత్పత్తి జరుగుతోంది. ఇలాంటి ప్రాంతాన్ని ప్రభుత్వం కార్పొరేట్‌ సంస్థల చేతుల్లో పెడుతుంది. ఇప్పటికే కాకినాడ సెజ్‌ పేరిట 12,500 ఎకరాల వ్యవసాయ భూములను సేకరిస్తోంది. రైతుల నుంచి బలవంతంగా భూములను సేకరించవద్దని రాష్ట్ర మానవ హక్కుల సంఘం స్పష్టమైన ఆదేశాలిచ్చినా.. భూసేకరణను వ్యతిరేకిస్తున్న వారిపై కేసులు బనాయించి, జైలుపాలు చేస్తోంది. కాకినాడ సెజ్‌పై ప్రజా ఉద్యమాలు సఫలీకృతమయ్యాయి. ఇంకా పోరాడాల్సిన అవసరముంది” అని అన్నారు. ప్రభుత్వం కేటాయించిన భూముల్లో కేవలం 40 శాతం భాగంలోనే కార్పొరేట్‌ సంస్థలు పరిశ్రమలను స్థాపిస్తున్నాయని, మిగతా భూముల్లో రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం చేస్తున్నాయని ఆరోపించారు.

గిరిజన ఆవాసాలను ఐదో షెడ్యూలు కిందకు తీసుకురావాలని చాలా కాలం నుంచి డిమాండు వినిపిస్తున్నా.. ప్రభుత్వాలు వందలాది గ్రామాలను గుర్తించకుండా విస్మరిస్తున్నాయని ఆమె విమర్శించారు. ”ఐదో షెడ్యూలు కిందకు తీసుకువస్తే రాజ్యాంగం కల్పించిన రక్షణ కవచం అడ్డువస్తుంది. భూసేకరణ వీలుకాదు. అందుకే నిర్లక్ష్యం చేస్తున్నారు” అని ఆరోపించారు. కోస్తా కారిడార్‌పై ప్రభుత్వం జారీ చేసిన 34 జీవోను వెంటనే రద్దు చేయాలని డిమాండు చేశారు. ”ఈ రోజు చివరి అవకాశం ఇస్తున్నాం. ఆందోళన ఉద్ధృతం చేస్తాం” అని ముఖ్యమంత్రి వైఎస్‌ను హెచ్చరించారు. భూసేకరణ విషయంలో గవర్నర్‌ ఎన్డీ తివారి జోక్యంచేసుకోవాలని కోరారు.

ఇదే అనుకూల వాతావరణం: ”ఇది ఎన్నికల ఏడాది. అంటే ప్రజల సంవత్సరం. ప్రభుత్వాలు ప్రజల డిమాండ్లను నెరవేర్చేందుకు, వివిధ పార్టీలు వాటిని తమ మేనిఫెస్టోలో పొందుపరిచేందుకు అవకాశముంది” అని మేధాఅన్నారు. ప్రత్యేక ఆర్థిక మండళ్ల ఏర్పాటుపై ప్రతిపక్ష పార్టీలన్నీ ఏకమై, ఉద్యమాలు నిర్వహించాలని పిలుపునిచ్చారు. పశ్చిమ బెంగాల్‌ను వదిలి వెళ్తామంటూ రతన్‌మ టాటా చేసిన హెచ్చరికను విలేకరులు ప్రస్తావించగా.. ”వదిలి వెళ్తే మంచిదే కదా. చూద్దాం” అని ఆమె బదులిచ్చారు. బెంగాల్‌లో ఒక తీరుగా, ఇక్కడ మరో తీరుగా వ్యవహరిస్తూ.. వామపక్షాలు ద్వంద్వ వైఖరిని అవలంబిస్తున్నాయని భావిస్తున్నారా అని ప్రశ్నించగా.. నేరుగా సమాధానమివ్వలేదు. ”ఇక్కడ వ్యతిరేకిస్తున్నారుకదా..సంతోషిద్దాం”అని అన్నారు.

Courtesy: Eenadu 26th August 2008

Advertisements

Written by dilkibaatein

August 26, 2008 at 9:40 am

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s

%d bloggers like this: