Fighting Injustice in Polepally SEZ

…more than courage it takes WILL to stand up against injustice !

పోలేపల్లి సెజ్ పై సంయుక్త పోరాటం: కేసీఆర్‌, నారాయణ

leave a comment »

ఇన్నాళ్లూ పోలేపల్లి పోరాటంలో ప్రత్యక్షంగా పాల్గొనని ప్రధాన రాజకీయ పార్టీల్లో మెల్లగా కదలిక ప్రారంభం అయ్యింది. మొదలు కొత్తగా మొదలైన నవతెలంగాణా పార్టీ, ప్రజా రాజ్యం పార్టీలు పోలేపల్లి పోరాటానికి సంఘీభావం తెలియజేయగా ఇప్పుడు భారత కమ్యూనిస్టు పార్టీ, తెలంగాణా రాష్ట్ర సమితి కూడా తాము పోలేపల్లి పోరాటంలో ప్రత్యక్షంగా పాల్గోబోతున్నామని ప్రకటించాయి.

ఇందుకు సంబంధించిన వార్తా కథనాలు కింద చదవచ్చు.

1) The Hindu

CPI Threatens to Stall Polepally SEZ

2) ఆంధ్రజ్యోతి – 20-09-2008

పోలేపల్లి సెజ్ పై సంయుక్త పోరాటం: కేసీఆర్‌, నారాయణ

హైదరాబాద్‌ , సెప్టెంబర్‌ 19 (ఆన్‌లైన్‌-సిటీబ్యూరో): రాష్ట్రంలో సరికొత్త రాజకీయ సమీకరణలకు తెరలేస్తోంది. కారు- కొడవలి మధ్య మైత్రీబం«ధానికి బీజం పడుతోంది. రాజధాని నగరంలో శుక్రవారం చోటుచేసుకున్న సంఘటనలు ఇందుకు నిదర్శనంగా నిలిచాయి. తెలంగాణ రాష్ట్రసమితి అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖరరావుకు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె. నారాయణ శుక్రవారం రాత్రి విందు ఇచ్చారు. ఈ విందుకు కేసీఆర్‌ స్వయంగా బయల్దేరి నారాయణ ఇంటికి వెళ్లారు. ఇద్దరూ కలిసి అక్కడ విందు భోజనం ఆరగించి, రెండున్నర గంటల పాటు సుదీర్ఘంగా చర్చించారు.

వచ్చే ఎన్నికల్లో ఇరుపార్టీలు కలిసి పనిచేయాలని సూత్రప్రాయంగా నిర్ణయించుకున్నారు. తెలంగాణకు అనుకూలంగా పనిచేయాలని సీపీఐ ఇప్పటికే నిర్ణయించడంతో తమ మధ్య భావ సారూప్యత ఏర్పడిందని… అందువల్లే సీపీఐ-టీఆర్‌ఎస్‌ మిత్రపక్షాలు అయ్యాయని చంద్రశేఖరరావు చెప్పారు. ప్రస్తుతానికి ఇరుపార్టీల మధ్య చర్చలు ప్రాథమిక స్థాయిలోనే ఉన్నా, త్వరలోనే భవిష్యత్‌ కార్యాచరణపై పూర్తిస్థాయిలో చర్చించుకుని తగు ప్రణాళిక రూపొందించుకుంటామని ఆయన అన్నారు. రాష్ట్రంలో రాబోయే ఎన్నికల్లో ఎలా ముందుకెళ్లాలనే విషయమై తర్వాత చర్చిస్తామని తెలిపారు.

భోజనానికి పిలిచారు: కేసీఆర్‌

నేతలు ఇరువురి మధ్య జరిగిన చర్చల సారాంశాన్ని కేసీఆర్‌ మీడియాకు వివరించారు. ఒకానొక సందర్భంలో నారాయణతో ఫోన్లో మాట్లాడినపుడు రాజకీయ అంశాలు చర్చకు వచ్చాయని, విపులంగా మాట్లాడుకోడానికి ఓరోజు ఇంటికి భోజనానికి రమ్మని ఆయన ఆహ్వానించగా, 19వ తేదీన వీలవుతుందని చెప్పానన్నారు. ఆ మేరకు శుక్రవారం వెళ్లగా, ఇద్దరి మధ్య మైత్రీబంధానికి సంబంధించిన చర్చలు వచ్చాయన్నారు.

ముందుగా మహబూబ్‌నగర్‌జిల్లా పోలేపల్లి సెజ్‌ బాధితుల గురించి చర్చించామని, అక్కడ రైతులకు జరుగుతున్న అన్యాయంపై సంయుక్త పోరాటం జరిపేందుకు నిర్ణయించామన్నారు. వచ్చేవారంలో తామిద్దరం కలిసి అక్కడ ఆందోళన నిర్వహిస్తామని తెలిపారు. డిసెంబర్లోగా పార్లమెంటు రద్దయ్యే అవకాశాలున్నాయని కేసీఆర్‌ జోస్యం చెప్పారు. జనవరి లేదా ఫిబ్రవరిలో ఎన్నికలు ఉండవచ్చన్న సంకేతాలు తనకు ఢిల్లీ నుంచి అందాయని ఆయన అన్నారు. ఈ మేరకు అక్కడ జోరుగా ప్రచారం జరుగుతోందన్నారు.

ప్రాథమికంగా చర్చించాం: నారాయణ

ఇరుపార్టీల మధ్య ప్రాథమికంగా చర్చలు జరిగినట్లు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.నారాయణ తెలిపారు. గతంలోనే చర్చలు సాగినా, తెలంగాణకు అనుకూలంగా సీపీఐ తీర్మానం చేసిన తర్వాత మాట్లాడదామని కేసీఆర్‌ కోరడంతో ఇపుడు చర్చించినట్లు ఆయన వివరించారు. ఇపుడు జరిగిన చర్చల సారాంశాన్ని పార్టీలో చర్చించి, ఆ తర్వాత పార్టీ నిర్ణయం మేరకు పనిచేస్తామని ఆయన వివరించారు. రాష్ట్రంలో రాజకీయాలు, మారుతున్న సమీకరణలపై తాము మాట్లాడుకున్నామన్నారు. పోలేపల్లి సెజ్‌లో రైతులకు జరిగిన అన్యాయంపై కలిసి ఆందోళన చేయాలని నిర్ణయించామని, తేదీ ఇంకా ఖరారు కాలేదని తెలిపారు.

Advertisements

Written by dilkibaatein

September 20, 2008 at 4:31 pm

Posted in News Archive, Telugu

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

%d bloggers like this: