Fighting Injustice in Polepally SEZ

…more than courage it takes WILL to stand up against injustice !

సెజ్‌ హఠావో… జమీన్ బచావో

with 2 comments

 
( ఆన్‌లైన్‌ ప్రతినిధి-మహబూబ్‌నగర్‌) సెజ్‌ హఠావో… జమీన్‌ బచావో అని పోలేపల్లి నిరుపేదలు చేస్తున్న నినాదాలు ఎట్టకేలకు రాజకీయ పార్టీల చెవుల వరకు చేరాయి. పేదల ఆర్త నాదాలు విన్న రాజకీయ పార్టీలు పోలేపల్లి సెజ్‌ వల్ల అక్కడి ప్రజలకు అన్యాయం జరిగిందని గొంతు పెకిలించి మాట్లాడుతున్నారు. రెండు సంవత్సరాలుగా పోలేపల్లికి చెందిన హరిజన, గిరిజనులు ఆకలి మంటతో ప్రాణాలు అరచేతి లో పెట్టుకుని అడుగడుగున అవమానాలు భరిస్తూ మొక్కవోని ఆత్మవిస్వాసంతో పోరాటం సాగిస్తున్నారు. భూమి ఎంత విలువైందో మన రాజకీయ పార్టీల నేతలు ఇప్పుడు గుర్తించడం శోచనీయం. భూమి బలవంతంగా గుంజుకోవడంతో కొంత మంది రైతులు గుండె ఆగి చనిపోయారు. మరి కొంత మంది ఊరు విడిచి వలస పోయారు. ప్రభుత్వం ఇచ్చిన హామీ నెరవేరక ఉపాధి దొరకక మరి కొంత మంది సొంత పొలంలోనే కూలీలుగా పని చేస్తున్నారు.

ఇంత జరిగినా ప్రభు త్వం భూవ్యాపారాన్ని నిరాటంకంగా కొనసాగిస్తున్నది . ఎపిఐఐసి దళారి పాత్రతో కోట్లు కూడబెడుతున్నది. పారిశ్రామిక వేత్తలు కోట్ల సబ్సిడీలు దర్జాగా మెక్కుతున్నారు. ఇవన్నీ జరిగిపోతున్నా పోలేపల్లి బాధితులకు మాత్రం న్యాయం జరగడం లేదు. వారి పోరాటం గ్రామాన్ని, జిల్లాను దాటి రాష్ట్రానికి పాకింది. గ్రీన్‌ పార్కు పేరుతో ప్రభుత్వం పోలేపల్లి, ముదిరెడ్డి పల్లి గ్రామాలలో వేయి ఎకరాల భూమిని సేకరించింది. దీనికి కేంద్ర ప్రభుత్వం కోట్ల రూపాయల గ్రాంటును ఇచ్చింది. కానీ ప్రభుత్వం నిబందనలు తుంగలో తొక్కి ఇందులో 155 ఎకరాల భూమిని ప్ర ఆర్థిక మండలి పేరుతో రెండు మందుల కంపెనీలకు కేటాయించింది.

సేకరించిన వేయి ఎకరాల భూమిలో 280 ఎకరాల అసైన్డ్‌ భూమిని, 780 ఎకరాల పట్టా భూములను సేకరించారు. ప్రభుత్వ భూమికి కే 18 వేల చొప్పున పరిహారం ఇచ్చారు. ఇందులో నిబంధనలు ఒక్కటి కూడా పాటించలేదు. అప్పట్లో రాజకీయ పార్టీల నేతలు ఎవరు దీని గురించి మాట్లాడలేదు. పోలేపల్లివాసులు పోరాటం సాగించాకే రాజకీయ పార్టీలు దీన్ని గుర్తించడం వారి ద్వంద్వ వైఖరికి నిదర్శనంగా చెప్పవచ్చు. కేసిఆర్‌ అనేక సార్లు జిల్లాలో పర్యటించారు. కానీ ఎప్పుడూ పోలేపల్లి సెజ్‌ బాధితులకు జరుగుతున్న అన్యాయంపై మాట్లాడలేదు.

ఇక నిత్యం ఉద్య మాలలో ఉండే కమ్యూనిస్టు పార్టీలకు పోలేపల్లి బాధితుల బాధలు, సెజ్‌ వల్ల ఏర్పడుతున్న ముప్పు కన్పించలేదు. తెలుగుదేశం పార్టీ కూడా సెజ్‌ గురించి ఏనాడూ ఉద్యమ స్ఫూర్తితో వ్యవహరించలేదు. బిజెపి కొంత వరకు సెజ్‌లపై పోరాటాన్ని రోడ్డెక్కించింది. కానీ రాజకీయ పార్టీలు చేయాల్సిన కృషిని విస్మరించాయి. ఇప్పుడు ఎన్నికలు తరుముకొస్తున్న సమయంలో ఆయా పార్టీల అధినేతలు పోలేపల్లి సెజ్‌ బాదితులకు తీరని అన్యాయం జరిగిందని మొసలి కన్నీరు కారుస్తున్నారు.

వారికి వారే ఆత్మ వంచన చేసుకుంటున్నారు. ఇటీవల సిపిఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణ పోలేపల్లి గ్రామాన్ని సందర్శించి సెజ్‌ బాధితులను పరామర్శించారు. భూమికి భూమి ఇవ్వాలని డిమాండు చేశారు. భూమిని కోల్పోవడం ఒక సామాజిక అన్యాయమని రాజకీయ పార్టీలో ఆలస్యంగా తెలుసుకోవడం ఆవేదనకరం. కేసిఆర్‌ కూడా ఈ విషయంపై అవేదన వ్యక్తం చేశారు. త్వరలో ప్రజారాజ్యం పార్టీ వ్యవస్థాపకుడు చిరంజీవి పోలేపల్లి గ్రామానికి వచ్చే అవకాశం కన్పిస్తున్నది.

సెజ్‌ బాధితులను పరామర్శించడం తోపాటూ తమ పార్టీ వస్తే భూమికి భూమి ఇస్తామని ఆయన ప్రకటించ బోతున్నట్లు సమాచారం. ఆ పార్టీ నేతలు పోలేపల్లి సెజ్‌ బాధితులకు జరిగిన అన్యాయంపై పూర్తి సమాచారాన్ని సేకరించి పంపించారు. ఇక కాంగ్రెస్‌ పార్టీ ఇప్పుడు బాధితుల ఇల్లు అలికే ప్రయత్నం మొదలు పెట్టింది. బాధితులు పోరాడి అలసి పోయినా పట్టించుకోని కాంగ్రెస్‌ నేతలు ఇప్పుడు మీకు మేము ఉన్నామని చెప్పుకునే ప్రయత్నం చేస్తున్నారు. అధినేతల దృష్టి పోలేపల్లి సెజ్‌పై పడడంతో జడ్చర్ల ఎమ్మెల్యే మల్లురవి హడావుడిగా అక్కడికి వెళ్ళి కోటిన్నరతో పోలేపల్లి గ్రామాన్ని అభివృద్ధి చేస్తామని ప్రకటించారు. అ యితే భూములు అమ్మకంలో 10 శాతం వాటాను ఏపి ఐ ఐసి పోలేపల్లి బాధితులకు కేటాయించింది. దీని కింద 10 కోట్ల రూపాయలు వచ్చాయి. వీటిని బాధితులకు పంపిణీ చేయాల్సి ఉన్నప్పటికి ఈ నాటికి ఇంకా మీనమేశాలు లెక్కిస్తున్నారు. ఆ 10 కోట్ల నుంచే ఈ కోటిన్నర ఖర్చు పెట్టడానికి ఎమ్మెల్యే పెత్తనం తీ సుకున్నట్లు కనిపిస్తోంది.

Courtesy: Andhrajyothy 24th Sept 08

Advertisements

Written by dilkibaatein

September 24, 2008 at 12:05 pm

2 Responses

Subscribe to comments with RSS.

  1. polepally prajalu nayakulani nirdeshistunnaru, good good…

    bujji

    September 24, 2008 at 12:57 pm


Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

%d bloggers like this: