Fighting Injustice in Polepally SEZ

…more than courage it takes WILL to stand up against injustice !

మీరు దగా పడ్డారు.. శుక్రవారం మీ వూరొస్తా: ‘సెజ్‌’ బాధితులతో చిరంజీవి

with 6 comments

కొంత కాలం ఆగండి అన్నింటికీ పరిష్కారం
మీరు దగా పడ్డారు.. శుక్రవారం మీ వూరొస్తా
పోలేపల్లి ‘సెజ్‌’ బాధితులతో చిరంజీవి వ్యాఖ్య

హైదరాబాద్‌, న్యూస్‌టుడే: మరికొంత కాలం వేచిచూడాలని, తమ సమస్యలన్నిటికీ పరిష్కారం లభిస్తుందని మహబూబ్‌నగర్‌ జిల్లా పోలేపల్లి ప్రత్యేక ఆర్థిక మండలి(సెజ్‌) బాధితులతో ప్రజారాజ్యం పార్టీ అధినేత చిరంజీవి అన్నారు. ”మీ పరిస్థితి చూస్తే హృదయవిదారకంగా ఉంది. మీ సమస్య గురించి గతంలో విన్నా. మీరు దగా పడ్డారు. ఎల్లుండి(ఈ నెల 26న) మీ గ్రామానికి వస్తా. ప్రత్యక్షంగా చూస్తా. మీకు అండగా ఉంటా. ప్రతి సమస్యకూ పరిష్కార మార్గాలు ఉన్నాయి. వాటిని అన్వేషించాలి” అని ఆయన వారితో పేర్కొన్నారు. సెజ్‌తో పోలేపల్లిలో భూములు కోల్పోయిన దాదాపు 20 కుటుంబాలవారు బుధవారమిక్కడ ప్రరాపా కార్యాలయంలో చిరంజీవిని కలిశారు. తమ పరిస్థితి గురించి దాదాపు గంటపాటు ఆయనకు వివరించారు. ప్రభుత్వం తమను భయభ్రాంతులకు గురిచేస్తూ భూములు లాక్కొన్నట్లు చెప్పారు. నష్టపరిహారం విషయంలోనూ తాము తీవ్ర అన్యాయానికి గురయ్యామని కంటతడి పెట్టుకొన్నారు. ”మాకు భూములున్నపుడు వ్యవసాయం చేసుకొంటూ బతికాం. ఇప్పుడు అప్పులపాలై పిల్లల్ని చదువులు మాన్పించి తినడానికి కూడా లేక ఇబ్బందులు పడుతున్నాం” అని ఆవేదన వ్యక్తంచేశారు. దేశవ్యాప్తంగా మహబూబ్‌నగర్‌ జిల్లా పేదలు కూలీలుగానే ఉన్నారని, ఈ నిరుపేదల పక్షాన నిలవాలని కోరారు. వారు చెప్పిందంతా విన్న తర్వాత, ”ఇప్పటివరకు ఓపిక పట్టిన మీరు మరికొంత కాలం ఉండాలి. మీ సమస్యలన్నింటికి పరిష్కారం లభిస్తుంది” అని చిరంజీవి భరోసా ఇచ్చారు.

(Courtesy: Eenadu 25th Sept 2008)

Advertisements

Written by dilkibaatein

September 25, 2008 at 9:41 am

6 Responses

Subscribe to comments with RSS.

  1. అసలు ఇంతకీ SEZ అంటే ఏమిటో చిరంజీవికి తెలుసా?

    సుజాత

    September 25, 2008 at 11:27 am

  2. సుజాత గారు

    అన్ని విషయాలు అందరికి తెలియాల్సిన అవసరం లేదు కదండి. ఆ బాధితుల గోడు విని, కనీసం తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నందుకు మనం హర్షించాలి.

    సురేశ్

    September 25, 2008 at 11:57 am

  3. సురేష్ గారు,
    బాధితుల గోడేమిటో తెలియాలంటే సెజ్ అంటే ఏమిటో , అది ఎందుకు ఎవరు చేస్తున్నారో తప్పక తెలిసి తీరాలండీ! మామూలు మనుషులో, లేక ఉద్యమ కారులో (భూమిక సత్యవతి గారి బ్లాగు చూడండి) వెళ్ళి ఇటువంటి ప్రయత్నం చేస్తే తప్పక హర్షిస్తాను. సడన్ గా గోడ దూకినట్టు రాజకీయాల్లోకి దూకిన వాళ్ళు చేస్తే ఇలాంటి ప్రశ్నలే వస్తాయి. ఆయన పార్టీ పెట్టకముందు నుంచే సెజ్ గొడవ జరుగుతూనే ఉంది. అప్పుడేం చేస్తున్నాడో?

    సెజ్ బాధితుల గోడును ను ఈ బ్లాగు ద్వారా వీలైనంత మందికి చేరవేస్తున్నందుకు బ్లాగర్ ని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను.

    సుజాత

    September 25, 2008 at 1:18 pm

  4. sujatha gaaru,
    sez gurinchi chiranjeevi ki vivaridham.raaniyandi polepally ki.manamu evvarini vyathirekinchalisina avasaram ledanukunatanu.

    venkatrao

    September 25, 2008 at 6:28 pm

  5. \\ఆయన పార్టీ పెట్టకముందు నుంచే సెజ్ గొడవ జరుగుతూనే ఉంది. అప్పుడేం చేస్తున్నాడో?\\

    నేను గమనించింది ఏమిటంటే ప్రతివారు ఇలాగే అంటున్నారు ఇంతకు ముందు ఏమి చేశాడు? ఇప్పుడు గుర్తుకు వచ్చారా అంటున్నారు కానీ ఎంటీఅర్ కూడా ఇలాగే గోడ దూకి వచ్చినట్లుగా రాజకీయ్యాల్లోకి వచ్చినవారే కదా? ఆయన పార్టీ పెట్టక ముందు ఆయన ఏమైనా చేశారా? ఎవరికైనా ఏదైనా సహాయం చేశారా? అంతదాక ఎందుకు చంద్రబాబు, వై.ఎస్ రాజకీయ్యాల్లోకి రాకముందు వాళ్ళు ఏమైనా చేసారా? :-?

    srilu

    September 26, 2008 at 3:01 am

  6. Let him also come. Now Polepaly SeZ became an issue of each party.

    Polepally Herins and Heros alredy spelled out their Maximum Demands Way back.

    Let the parties tell to what extent to in what way they will help the Polepallians to realise their Demands.

    vageesh

    September 26, 2008 at 10:32 am


Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

%d bloggers like this: