Fighting Injustice in Polepally SEZ

…more than courage it takes WILL to stand up against injustice !

రేపు పోలేపల్లికి చిరు

leave a comment »

మెగాస్టార్‌ను కలిసిన బాధితులు

హైదరాబాద్‌, సెప్టెంబర్‌ 24 (ఆన్‌లైన్‌): ప్రజారాజ్యం పార్టీ అధినేత చిరంజీవి శుక్రవారం మహబూబ్‌నగర్‌ జిల్లా పోలేపల్లి ప్రత్యేక ఆర్థికమండలి (సెజ్‌)ని సందర్శించి, బాధితులను కలుసుకోనున్నారు. ఇప్పటికే కరీంనగర్‌ జిల్లా సిరిసిల్లలో పర్యటించిన ఆయన తాజాగా మలివిడత పర్యటన కోసం మహాబూబ్‌నగర్‌ వెళ్లనున్నారు. బుధవారం పార్టీ కార్యాలయంలో తనను కలిసిన సెజ్‌ బాధితులతో మాట్లాడుతూ.. ఈ నెల 26న స్వయంగా వచ్చి అందరినీ కలుస్తానని హామీ ఇచ్చారు.

ఉద్యోగాలిస్తామని మభ్యపెట్టి ఎకరం రూ. 18 వేల చొప్పున లెక్క కట్టి లాక్కున్నారని, ఇప్పటికి రూ.9 వేలు మాత్రమే చేతిలో పెట్టారని బాధితులు ఆవేదనతో చెప్పారు. పోరాటం చేస్తే పోలీసుల లాఠీ దెబ్బలు, కేసులతో భయపెడుతున్నారని మహిళా రైతులు కన్నీటి పర్యంతమయ్యారు. తమ ప్రాంతానికి వచ్చి తమ సమస్యలను కళ్లారా చూడాలని వారు చిరంజీవిని కోరారు.

చిరంజీవి 45 నిముషాల పాటు వారితో ముచ్చటించారు. ఇన్నాళ్లు ఓపిక పట్టారు.. మరికొన్నాళ్లు ధైర్యంగా ఉండండి మంచి రోజులు వస్తాయి అని చిరంజీవి వారికి భరోసా ఇచ్చారు. గురువారం నాడే ఆ ప్రాంతానికి వెళ్లాలని భావించినా అప్పటికే ఇతర కార్యక్రమాలు ఖరారు కావడంతో శుక్రవారానికి వాయిదా వేసుకున్నారు. అంతకుముందు వారంతా పవన్‌ కళ్యాణ్‌ను కలిశారు.

Courtesy: Andhrajyothy 25th Sept 2008

Advertisements

Written by dilkibaatein

September 25, 2008 at 9:32 am

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

%d bloggers like this: