Fighting Injustice in Polepally SEZ

…more than courage it takes WILL to stand up against injustice !

చిరంజీవి పోలేపల్లి పర్యటన వార్తలు

leave a comment »

పోలేపల్లి చేరుకున్న చిరంజీవి

మహబూబ్‌నగర్‌ : పోలేపల్లి సెజ్‌ బాధితులను పరామర్శించేందుకు ప్రజారాజ్యం పార్టీ అధినేత చిరంజీవి ఆ గ్రామానికి చేరుకున్నారు. ఆర్థిక మండలికి వ్యతిరేకంగా గ్రామస్థులు చేస్తున్న ఆందోళనకు మద్దతు ప్రకటించారు.

కొన్నాళ్లలో పరిస్థితులు మారుతాయి : చిరంజీవి

మహబూబ్‌నగర్‌ : పోలేపల్లి సెజ్‌బాధితులను పరామర్శించేందుకు చిరంజీవి జిల్లాకు చేరుకున్నారు. గుండ్లగడ్డ తండాలో బాధితులను పరామర్శించారు. ఇంటింటికీ తిరుగుతూ… ప్రజలతో మాట్లాడారు. పేదల త్యాగం పెద్దల మరం అవుతోందని విమర్శించారు. కొన్నాళ్లు వేచిచూడాలని.. తాము అధికారంలోకి రాగానే పరిస్థితులు మారుతాయని హామీ ఇచ్చారు.

అందరిలా వచ్చిపోయే నేతను కాదు : చిరంజీవి

మహబూబ్‌నగర్‌ : బాధితుల్ని పరామర్శించేందుకు అందరిలా వచ్చిపోయే నేతను కాదని ప్రజారాజ్యం పార్టీ అధినేత చిరంజీవి అన్నారు. అధికారంలోకి వచ్చిన వెంటనే సమస్యలు తీర్చుతానని తెలిపారు. పేదల భూములు లాక్కొని వారి హృదయాలకు గాయాలు చేశారని ఆరోపించారు. పరిహారం ఇచ్చేందుకు అధికారులు లంచం అడిగారని పోలేపల్లి బాధితులు చిరంజీవికి ఫిర్యాదు చేశారు.

నోటికెంత వస్తే … అన్ని ఎకరాలా?: చిరంజీవి
* రాష్ట్రంలో 50 సెజ్‌లా?
* సర్కారుది దళారీ పాత్ర
* 2003 నుంచే ఈ పరిస్థితి
* ప్రజారాజ్యం పార్టీ అధినేత చిరంజీవి


మహబూబ్‌నగర్‌ : ప్రభుత్వ నోటికి ఎంతవస్తే… అన్ని ఎకరాల భూములు సెజ్‌ల పేరిట బడాబాబులకు ధారాదత్తం చేస్తున్నారని ప్రజారాజ్యం పార్టీ అధినేత చిరంజీవి ఆరోపించారు. ఇప్పటివరకు సెజ్‌ల్లో ఎన్ని పరిశ్రమలు ఏర్పాటు చేశారో ప్రకటించాలని డిమాండ్‌ చేశారు. పోలేపల్లి సెజ్‌బాధితులను పరామర్శించడానికి వచ్చిన చిరంజీవి అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొన్నారు. పరిశ్రమలు ఏర్పాటు చేయడానికి ఎంతమేరకు భూములు కావాలో అంచనా వేయకుండా పేదల భూములు పెద్దలకు ఇస్తున్నారని తెలిపారు. పేదల కోసం పెద్దలు త్యాగం చేయాలి…కానీ పెద్దల కోసం పేదలు త్యాగం చేయాల్సిన దుస్థితి రాష్ట్రంలో నెలకొందని పేర్కొన్నారు. ఎక్కడ పచ్చదనం కనిపిస్తే అక్కడ రాబందుల్లా వాలిపోతున్నారని విమర్శించారు. పేదల పొట్టగొట్టి వారి భూముల్లో పారిశ్రామిక ప్రగతి మంచిదికాదన్నారు. ఇద్దరు, ముగ్గురు పెద్దల కోసం పేదల్ని బలిచేస్తారా అని ప్రశ్నించారు.దేశంలో 256 సెజ్‌లు ఉండగా… కేవలం రాష్ట్రంలో 50 వరకు ఉన్నాయని గుర్తుచేశారు. ప్రజలు అమాయకులు కావడంతో దోపిడీలకు దిగుతున్నారు. సెజ్‌ల ముసుగులో రియల్‌ఎస్టేట్‌ వ్యాపారం కొనసాగుతోందని తెలిపారు. బడాబాబుల వద్ద సర్కారు దళారీ పాత్రపోషిస్తోందని ఎద్దేవాచేశారు. 2003 నుంచి రాష్ట్రంలో ఎన్ని పరిశ్రమలు ఏర్పాటు చేశారో చెప్పాలని ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు.

Courtesy: Eenadu 26th Sept 2008

Advertisements

Written by dilkibaatein

September 26, 2008 at 2:25 pm

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

%d bloggers like this: