Fighting Injustice in Polepally SEZ

…more than courage it takes WILL to stand up against injustice !

చిరంజీవి ప్రసంగంపై బాధితుల అసంతృప్తి

with 9 comments

మహబూబ్‌నగర్‌: తమ దగ్గర నుంచి తీసుకున్న భూములకు పరిహారంగా రూ.10 లక్షలు ఇవ్వాలని ప్రభుత్వాన్ని తాము ఎంతోకాలంగా పోరుతున్నామనీ, దీనిపై చిరంజీవి స్పష్టమైన హామీ ఇవ్వలేదని పోలేపల్లి సెజ్‌ బాధితుతులు ఈరోజు మధ్యాహ్నం నిరసనకు దిగారు. చిరంజీవి ప్రసంగాన్ని పూర్తి చేసి వెళ్లిపోయిన తర్వాత బాధితుల్లో అసంతృప్తి వ్యక్తమైంది. చిరు ప్రసంగంలో స్పష్టత లేదనీ, తమకు ఏం చేస్తారో చెప్పలేదని వారు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ విషయాన్ని తెలుసుకున్న చిరంజీవి వెనక్కి తిరిగి వచ్చి సెజ్‌ బాధితుల ఐక్య సంఘటన సభ్యులతో మాట్లాడారు. ఈ సమస్యను అధ్యయనం చేసిన తర్వాత తగు నిర్ణయం తీసుకుంటామని చిరంజీవి వారికి హామీ ఇచ్చారు.

(Courtesy: Eenadu, 26 Sept 2008)

Advertisements

Written by JayaPrakash Telangana

September 26, 2008 at 7:19 pm

9 Responses

Subscribe to comments with RSS.

 1. పాపమని పచ్చి పులుసు పోస్తే…

  నాగన్న

  September 27, 2008 at 4:40 am

 2. చిరంజీవి దగ్గర స్క్రిప్టు రెడీగా లేదన్నమాట! బంగారు పళ్ళెంలో భోజనం చేసే వాడికి గుప్పెడు మెతుకులు లేనివాళ్ల బాధలు ఎలా అర్థమవుతాయి? ఆయన ఇలా పుణ్యకాలం ముగిసే వరకూ అధ్యయనాలు చేస్తూనే ఉంటాడు.

  సుజాత

  September 27, 2008 at 7:41 am

 3. Dear Sujatha,

  SEZ gurinchi chiru ki yemi telusu ani meere comment chesinatlu vunnaru. Chiru spastam ga tana abhipraayam, vidhaanam cheppadu. Mee dimma tirigi mind block i natlu vundi chiranjeevi vupanyasam vini.

  Mee basha prijyanam, mee avagaahana, anubhavam tho meeru raase paniki maalina comments, posts mee blog lo raasukondi, Mee goppatananni gurthinchi, meeku dappu kotte tandana batch ready ga vundi.

  elanti vishayallo mee vekili tanam chupinchi peda vaadi bochha lo raaye kottakandi. Yedanna paniki vachhe pani cheyyandi.

  Meelanti 1000 mandi sanghasamskarthalu samvatraluga cheyyaleni pani chiru okka rojulo chesi chuinchadu.
  Eppudu raastra vyaptam ga ee samasya ku gurtimpu vachhindi. Pratyaksham ga chiru yemi chesthadu anedi pakkana pedithe, paroksham ga adhikaarapaksham lo adhikaarullo chalanam techhadu. Ye vudyamaanikaina edi atyanta avasaram.

  Sreedhar

  September 27, 2008 at 9:04 am

 4. చిరంజీవి వచ్చినందుకు పోలెపల్లికి పబ్లిసిటీ వచ్చిందా ? … లేక పోలెపల్లి (లేదా సెజ్ లు) ఇప్పటి ఎన్నికల ప్రతిపాదికల ఒక ముఖ్య అంశం అయినందుకు రాజకీయ పార్టీలు (ఇప్పుడు నాలుగేండ్లు అయినంక) అవకాశాన్ని వాడుకోనీకి వస్తున్నయా? అన్న విషయాన్ని మనం జాగ్రత్తగ గమనించాలె.

  JayaPrakash Telangana

  September 27, 2008 at 11:24 am

 5. శ్రీధర్ గారు……మీఎరు సుజాత గారిని అల విమర్సించతం ఏమీ బాగొలేదు…ఆవిడని విమర్సించటానికి బదులు …….బ్లాగర్ల ను గౌరవించండి

  bhascar

  September 27, 2008 at 11:35 am

 6. శ్రీధర్,
  మీరు చిరంజీవికి అభిమాని అయి ఉంటే నీకేం అభ్యంతరం లేదు. కానీ చిరంజీవి వల్ల పోలేపల్లి సమస్యకు ప్రాముఖ్యం వచ్చిందని, అందువల్లనే అధికారులు కదిలారని అనడం చూస్తుంటే ఏమనాలో అర్థం కావడం లేదు. అతని మీద నాకేమీ వ్యక్తిగత ద్వేషం లేదు. కానీ ఆయన దీన్ని రాజకీయం గా వాడుకోడానికి ప్రయత్నిస్తున్నాడని మీకు ఏ మాత్రం అనిపించడం లేదంటే మిమ్మల్ని ప్రజారాజ్యం కార్యకర్తగా భావించ వలసి వస్తుంది.

  “బాధితుల అసంతౄప్తి” అని పైన న్యూసు చూసాక కూడా మీరు ఆయన విధానాలు స్పష్టంగా ఉన్నాయని చెప్తున్నారే! మిగతా రాజకీయనాయకులకు ఏ మాత్రం భిన్నంగా లేదు చిరంజీవి ప్రవర్తన, ప్రదర్శన!

  పేదవాడి బొచ్చెలో రాయి కొట్టేది మనలాంటి సామాన్యులు కాదు….అలాంటి అవసరం, అవకాశం పైన చెప్పిన రాజకీయనాయకులకే ఉంటాయని గ్రహించండి.

  అభిప్రాయంతో విభేదముంటే అభిప్రాయంతో విభేదించాలి గానీ వ్యక్తులతో కాదని నమ్ముతాను. అందుకే మీ వ్యక్తిగత దూషణలను మీ సంస్కారానికి,విచక్షణకు వదిలేస్తున్నాను.

  సుజాత

  September 27, 2008 at 6:39 pm

 7. శ్రీధర్, అచ్చుతప్పు పడింది! “నాకేం అభ్యంతరం లేదు” అని ఉండాలి!

  సుజాత

  September 27, 2008 at 6:40 pm

 8. ఏదో ఓ అవకాశం దొరికితే దొరుకుతుందని వచ్చిన చిరంజీవికి ఎవరి బాధలు ఏం తెలుస్తాయి. ఎన్ని సార్లు ఎన్ని ప్రయోగాలకు బలైపోవాలి ఈ రాష్ట్రం. ఒక విఫలం కానున్న ప్రయోగమే చిరంజీవి. గెలవాలంటే గుంపు కావాలి. గుంపుకి నిబద్దత ఉండదు. ఇప్ఫటికి చేరుతున్నదంతా గుంపు మాత్రమే.

  Sitaramreddy

  September 27, 2008 at 7:31 pm

 9. Sujatha,

  Vimarsinche badulu, yemi chesi vunte baaguntundo chebithe mimmalni abhinandinche vaadini.
  Mee meda kuda naaku vyakthigatha dvyasam ledu, Neenu vimarsinchindi meeloni vekili tananni maatrame.

  Amma pettadu adukku tinanivvadu, subham palakra pelli koduka ante……, Etuvanti saamethalu gurthu techharu….

  Yemi chesi vunte baavuntundo cheppandi…

  Sreedhar

  September 27, 2008 at 10:21 pm


Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

%d bloggers like this: