Fighting Injustice in Polepally SEZ

…more than courage it takes WILL to stand up against injustice !

పాలమూరుకు…’చిరు’గాలి

leave a comment »

* పోలేపల్లికి నేడు ప్రజారాజ్యం అధినేత  * జనసమీకరణకు నేతల సన్నాహాలు  * అభిమానుల కోలాహలం షురూ

న్యూస్‌టుడే, మహబూబ్‌నగర్‌ : ఆత్మీయులను కోల్పోయి…ఆసరా లేక…ఏళ్లుగా పోరాటం చేసి… కన్నీరు కార్చి… ఫలితం లేక బీడు భూమిలా ఎండిపోయాయి వారి జీవితాలు… సరైన తిండి లేక ఎముకలు తేలాయి…అయిన వారు చనిపోతే కనీసం పూడ్చేందుకు కూడా జాగా లేదు…ఎవరో వస్తారని…ఏదో చేస్తారని ఏళ్లుగా ఎదురు చూశారు…కాని వారి ఆశ ఆడియాశే అయింది…ఎదురు చూసిన కళ్లు ప్రస్తుతం రెప్పకొట్టడం మానేశాయి… ఇది పోలేపల్లి ఫార్మాసెజ్‌లో సర్వం కోల్పోయిన 300 మంది ఎస్సీ, ఎస్టీ రైతు కుటుంబ సభ్యుల దీనగాథ. ఇంతకాలం నాయకులు తమ కష్టాలు కడతేర్చుతాయని నమ్మారు. రూ.18 వేలకే ఎకరం భూమిని కాజేసిన ప్రభుత్వంపై ఎన్నో పోరాటాలు.. ఆందోళనలు చేశారు. గాంధీజీ కలలు కన్న స్వరాజ్యంలో శాంతియుత పోరాటం చేశారు. ప్రభుత్వం చెవికి ఎక్కలేదు. పరిహారం ఇవ్వడంలోనూ పిసినారితనం చేసింది. ఎన్నికల సందర్భంగా నిరసనను చూపిద్దామనుకుంటే అడుగడుగునా పోలీసు బలగాలతో హక్కులను కాలరాశారు. ఆనాడు గాంధీజీ బ్రిటిషు పాలకుల వెన్నులో చలి పుట్టించిన సత్యాగ్రహంతో… కాంగ్రెస్‌ ప్రభుత్వానికి కనువిప్పు కలిగించాలని నిర్ణయించారు. గాంధీజయంతి దాకా శాంతియుత ఆందోళనకు దిగారు. మా భూమి మాకే దక్కాలనే ఒక లక్ష్యంతో ముందుకు వెళ్తున్నారు. ఈ బాధిత రైతులకు అండగా ఉండేందుకు ప్రజారాజ్యం అధినేత ముందుకు వచ్చారు. పార్టీ ఆవిర్భావం రోజున చెప్పినట్టే పేద రైతుల పొట్టకొట్టే సెజ్‌ సంస్కృతికి వ్యతిరేకం.. అంటూ శుక్రవారం బాధితులతో గొంతు కలుపనున్నారు.

‘చిరు’..నీ రాక కోసం..

పోలేపల్లి సెజ్‌ బాధితుల కష్టాలు తెలుసుకునేందుకు ప్రజారాజ్యం అధినేత చిరంజీవి శుక్రవారం వస్తున్నారు. జిల్లా నేతలు రాజేశ్వర్‌రెడ్డి, అమరేందర్‌, నూర్జహాన్‌, శ్రీనివాసరెడ్డి, చెన్నయ్య, ఉపేందర్‌ కలిసి జనసమీకరణ యత్నాలు చేపట్టారు. శుక్రవారం ప్రజలే కాదు.. భారీ స్థాయిలో అభిమానులు తరలి వస్తారని అంచనా వేస్తున్నారు. అధికారికంగా జనసమీకరణకు పార్టీ ఆదేశాలు లేవు. అయినా సుమారుగా 10వేల మందికి ఇబ్బంది కలుగని రీతిలో ఏర్పాట్లు ఉంటాయని నేతలు చెబుతున్నారు. పర్యటన సమయం రహస్యంగానే ఉంచుతున్నారు. ఎవరికి స్పష్టంగా తెలియజేయడం లేదు.

భూసత్యాగ్రహం ప్రారంభం

పోలేపల్లి సెజ్‌ బాధితులు గురువారం నుంచి ‘భూసత్యాగ్రహం’ పేరుతో శాంతియుత పోరాటం ప్రారంభించారు. పోలేపల్లి సెజ్‌ వ్యతిరేక ఐక్య సంఘటన ఆధ్వర్యంలో ఫార్మా కంపెనీల నిర్మాణం వద్ద అక్టోబరు 2 వరకు ఈ కార్యక్రమం కొనసాగుతుంది. ప్రారంభ కార్యక్రమంలో పలువురు నాయకులు, బాధిత రైతులు పాల్గొన్నారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

%d bloggers like this: