Fighting Injustice in Polepally SEZ

…more than courage it takes WILL to stand up against injustice !

నేడు పోలేపల్లిలో చిరు పర్యటన

leave a comment »

సెజ్‌ బాధితులకు మద్దతు

హైదరాబాద్‌, న్యూస్‌టుడే: ప్రజారాజ్యం అధినేత చిరంజీవి శుక్రవారం మహబూబ్‌నగర్‌ జిల్లా పోలేపల్లిని సందర్శించనున్నారు. అక్కడి సెజ్‌ బాధిత రైతులతో మాట్లాడనున్నారు. భూసేకరణతో కూలీలుగా మారిన రైతులు కొందరు బుధవారం రాత్రి చిరంజీవిని కలిశారు. భూసేకరణ ఫలితంగా వారి జీవితాలు ఎంత దారుణంగా మారాయో వివరించారు. తమ ఆందోళనకు మద్దతివ్వాలని కోరారు. సానుకూలంగా స్పందించిన చిరంజీవి శుక్రవారం ఆ ప్రాంతంలో పర్యటిస్తానని ప్రకటించారు. శుక్రవారం ఉదయం పది గంటల సమయంలో చిరంజీవి పోలేపల్లికి చేరుకుంటారు. రైతులు కోల్పోయిన పంట భూములను పరిశీలిస్తారు. జాతీయ రహదారి పక్కన బాధితులు చేస్తున్న ఆందోళనలో పాలుపంచుకుంటారు. ఈ సందర్భంగా భూసేకరణ విధానాలు మార్చాలని, పరిశ్రమలే స్వయంగా భూమిని సేకరించుకునేలా చూడాలని ఆయన డిమాండు చేసే అవకాశముంది. తిరుగు ప్రయాణంలో ఎక్కడైనా ప్రజలు భారీ సంఖ్యలో గూమిగూడితే వారినుద్దేశించి మాట్లాడాలని చిరంజీవి భావిస్తున్నారు.

ఆరు డిమాండ్లతో సెజ్‌బాధితులు

మహబూబ్‌నగర్‌: పోలేపల్లి సెజ్‌ పర్యటనకు శుక్రవారం వస్తానని ప్రకటించిన ప్రజారాజ్యం పార్టీ అధినేత చిరంజీవి ముందు బాధిత రైతులు ఆరు డిమాండ్లు ఉంచారు. ‘కాంగ్రెసేతర పార్టీల నేతలంతా వచ్చి పరామర్శించడం తప్ప మా బాధలకు విముక్తి కల్పించడం లేదు… ఏ పార్టీ మాకు అండగా ఉండి పోరాటం చేయడం లేదు… ఐదేళ్లుగా ఒంటరి పోరాటం చేస్తున్నాం..మా సమస్యను పరిష్కరించాలనే లక్ష్యముంటేనే పోలేపల్లి సెజ్‌కు రావాలని’ బాధిత రైతులు స్పష్టం చేస్తున్నారు.

డిమాండ్లు:

*మా భూమిని మాకే ఇవ్వాలి

* సెజ్‌ చట్టాన్ని రద్దు చేయాలి

* పోలేపల్లి ఫార్మాసెజ్‌ను ఎత్తివేయాలి

* ఐదేళ్లుగా మా భూములను పడావుగా పెట్టినందుకు నష్టపరిహారంగా ఒక్కో రైతుకు రూ.10లక్షలు చెల్లించాలి

* ప్రజాభిప్రాయ సేకరణ, గ్రామ సభ తీర్మానం, పర్యావరణ అనుమతి లేకుండా నిర్మిస్తున్న ఫార్మా కంపెనీ యాజమాన్యంపై సుప్రీంకోర్టు జడ్జితో విచారణ చేయించి శిక్షించాలి

* నిర్మాణాలు నిలపాలి. 800 ఎకరాలను రైతులకు స్వాధీనం చేయాలి.

Courtesy: Eenadu 26th Sept 2008

Advertisements

Written by dilkibaatein

September 26, 2008 at 9:52 am

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

%d bloggers like this: