Fighting Injustice in Polepally SEZ

…more than courage it takes WILL to stand up against injustice !

ఎవరో వస్తారని…

leave a comment »

అన్ని పార్టీలదీ అవకాశవాదమే

పోలేపల్లి సెజ్‌ బాధితుల ఆపద్భాంధవులెవరు?

నేడు చిరంజీవి పర్యటన

పేదల భూములను బలవంతంగా గుంజుకున్నారు. వీటితో వై.ఎస్‌.రాజశేఖరరెడ్డి రియల్‌ ఎస్టేట్‌ ముఖ్య మంత్రి అయ్యారు. – బంగారు లక్ష్మణ్‌, బీజేపీ నేత

పోలేపల్లిలో బాధితులకు అన్యాయం జరిగింది. భూమికి భూమి ఇవ్వాలి. బాధితులకు నష్టపరిహారం ఇవ్వాలి. -నారాయణ, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి

పోలేపల్లి సెజ్‌ బాధితులకు చాలా అన్యాయం జరి గింది. వారికి భూమికి భూమి ఇవ్వాలి. నష్ట పరిహారం పెంచాలి. బాధితులను ఆదుకోవాలి. -కేసీఆర్‌, టీఆర్‌ఎస్‌ అధినేత

(ఆన్‌లైన్‌, మహబూబ్‌నగర్‌) మహబూబ్‌నగర్‌ జిల్లా జడ్చర్ల నియోజకవర్గంలోని పోలేపల్లి సెజ్‌ ప్రాంతాన్ని ప్రజారాజ్యం పార్టీ అధినేత చిరంజీవి శుక్రవారం సందర్శించనున్నారు. బాధితుల సమస్యలను తెలుసుకోనున్నారు. అయితే ఇప్పటి వరకు ఏరు దాటే వరకు ఓడ మల్లన్న… ఏరు దాటాక బోడిమల్లన్న అన్న చందాన పోలేపల్లి సెజ్‌ విషయంలో రాజకీయ పార్టీలు వ్యవహరిస్తున్నాయి.

నవ తెలంగాణ పార్టీ వ్యవస్థాపకుడు దేవేందర్‌ గౌడ్‌ పోలేపల్లి సెజ్‌ బాధితుల సమస్యలను తెలుసుకునేందుకు కొద్ది నెలల క్రితం ఆ గ్రామానికి వచ్చి ధర్నా నిర్వహించా రు. ఇన్నాళ్లూ మా సమస్య నీకు ఎందుకు కనిపించలేదని ఈ సందర్భంగా పోలేపల్లి సెజ్‌ బాధితులు దేవేందర్‌ గౌడ్‌ను నిలదీశారు. అంటే రాజకీయ నాయకులపై బాధితులకు ఎంత విశ్వాసం ఉన్నదో ఈ సంఘటన స్పష్టం చేస్తున్నది.

ఇప్పటికి కూడా అక్కడి బాధితులకు ప్రజాసంఘాల నిస్వార్థ పోరాటంపై ఉన్న విశ్వసనీయత రాజకీయ పార్టీలపై లేదు. సెజ్‌లపై రాజకీయ పోరాటం నిజంగా సాగి ఉంటే ఈ పాటికి పోలేపల్లి సెజ్‌ బాధితుల సమస్యకు పరిష్కారం దొరికేది. మందుల కంపెనీలు ఇక్కడి నుంచి బిచాణా ఎత్తేసి ఉండేవి. పోలేపల్లి సమస్యపై న్యాయ పోరాటానికి ఏ పార్టీ కూడా ఇప్పటి వరకు సాహసించలేదు.

ఈ నేపథ్యంలో చిరంజీవి ఇక్కడికి రానున్నారు. 2003లో గ్రోత్‌ సెంటర్‌ కోసం వేయి ఎకరాల భూమిని ప్రభుత్వం సేకరించింది. భూసేకరణ పూర్తయ్యాక కూడా ఇక్కడ నిర్మాణాలు ప్రారంభం కాలేదు. ఆ తరువాత దీన్ని గ్రీన్‌ పార్కుగా మార్చారు. ఇక్కడ కాలుష్య రహిత పరిశ్రమలను మాత్ర మే ఏర్పాటు చేయాలి. కానీ రెండు మందుల కంపెనీల ఏర్పాటుకు అవకాశం కల్పించటానికి రాత్రికి రాత్రి నిబంధనలు మార్చి 155 ఎకరాలను ప్రత్యేక ఆర్థిక మండలి కింద ఏర్పాటు చేశారు.

ఇందులో అరబిందో ఫార్మా, హెట్రో డ్రగ్స్‌ కంపెనీలకు ఈ భూమిని కేటాయించారు. నిజానికి ఈ భూములు ఎస్‌ఈజెడ్‌కు పనికిరావు. ఈ మందుల కంపెనీలకు పర్యావరణ అనుమతి కూడా లేదు. అయితే అప్పట్లో కరువు ఏర్పడటంతో నిస్పృహకు లోనైన రైతులు పంట పండే పొలాలను కూడా గ్రోత్‌ సెంటర్‌కు తెగనమ్ముకున్నారు. ఆ తరువాత జాతీయ రహదారి సమీపంలో భూముల ధరలు భారీగా పెరిగాయి.

ఇది ఎపిఐఐసికి, ప్రభుత్వానికి, మందుల కంపెనీలకు కూడా సిరుల పంట పండించింది. భూములు కోల్పోయిన పోలేపల్లివాసులకు మాత్రం కడుపు మంట మిగిల్చింది. వచ్చిన ఆదాయంలో 10 శాతాన్ని బాధితులకు నష్ట పరిహారంగా ఇస్తామని, ప్రతి కుటుంబానికి 200 గజాల ఇంటి స్థలం, ఒక ఉద్యోగం ఇస్తామని ఎపిఐఐసి ఒప్పదం చేసుకుంది. కానీ ఆ హామీలు ఇప్పటికీ అమలు జరగలేదు. ఇది ఆ బాధితులలో మరింత ఆక్రోశాన్ని కలిగించింది.

తెగించిన ఆ పేదలు ప్రజా సంఘాల తోడ్పాటుతో పోరాటం నిర్వహించారు. భూములు పోగొట్టుకున్న దళితులు, లంబాడీలు నిర్మాణాలను అడ్డుకున్నారు. దీంతో వారిని పోలీస్‌ స్టేషన్లలో బంధించారు. తమ బాధలు లోకానికి చెప్పుకోవడానికి కూలీనాలి చేసుకుని పొట్ట పోసుకునే 13 మంది బాధితులు భిక్షాటన చేసి జడ్చర్ల ఉప ఎన్నికల్లో పోటీ చేశారు. తమకు న్యాయం చేయాలని వేడుకున్నారు. అయినా ఏ పార్టీ కూడా వారిపై కనికరం చూపలేదు.

తమకు భూమికి భూమి ఇవ్వాలని బాధితులు డిమాండ్‌ చేస్తున్నారు. కానీ ఇప్పటికీ రాజకీయ పార్టీలు సెజ్‌లపై తమ వైఖరి, విధానాలను వెల్లడించడంలో తాత్సారం చేస్తున్నాయి. ఈ మందుల పరిశ్రమలు ప్రారంభం అయితే దాని సమీపంలో ఉన్న దుందుభి నది కలుషితమై చుట్టుపక్కల ఉన్న 200 గ్రామాలకు ముప్పు ఏర్పడనున్నది. అయితే చిరంజీవి అయినా తమ తరఫున నిలబడతారేమోనన్న ఆశాభావంతో సెజ్‌ బాధితులు ఎదురుచూస్తున్నారు.

Courtesy: Andhrajyothy 26th Sept 2008

Advertisements

Written by dilkibaatein

September 26, 2008 at 9:32 am

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

%d bloggers like this: