Fighting Injustice in Polepally SEZ

…more than courage it takes WILL to stand up against injustice !

సెజ్‌ బాధితులకు ప్రజారాజ్యం అండ-దండ

leave a comment »

పోలెపల్లి భూ నిర్వాసితులకు ‘చిరు’ హామీ

పోలేపల్లి, సెప్టెంబర్‌ 26 : సెజ్‌ బాధితులకు ప్రభుత్వం ఏమీ చేయకపోయినా, ప్రజారాజ్యం పార్టీ అండగా నిలుస్తుందని శుక్రవారం చిరంజీవి హామీ ఇచ్చారు. నిరుపేదల నుంచి భూములు తీసు కున్న ప్రభుత్వం వారికి మౌలిక వసతుల కల్పన మరచిందని ‘చిరు’ అస్త్రాలు సంధించారు. పోలే పల్లిలో తన పర్యటన గురించి తెలుసుకున్న ప్రభుత్వం ఆగమేఘాల మీద ఏదో చేయాలని ప్రయత్నించిందని, అయితే ఇంకా ఆరని సిమెంటు తడి వారి నిబద్దతను ప్రశ్నిస్తోందని అన్నారు.

దేశం మొత్తం మీద 250 సెజ్‌లు ఉంటే ఒక్క రాష్ట్రంలోనే 50 సెజ్‌లు ఏర్పాటు అంత అవసరమా? అని చిరంజీవి ప్రభుత్వాన్ని సూటిగా ప్రశ్నించారు. ఒకవేళ ఏర్పాటు చేసినా అందుకు పేద రైతుల భూములు తీసుకోవడం ఎంత వరకూ న్యాయమని నిలదీశారు. సెజ్‌ వల్ల ఒక్క రాజకీయ నాయ కుడు కూడా ఎందుకు భూములు పోగొట్టుకోలేదని అడిగారు. పేదల అమాయకత్వాన్ని ఆసరా చే సుకుని భూ సంతర్పణ కార్యక్రమం జరుగుతోందని చిరంజీవి వాగ్భాణాలు సంధించారు.

ఎక్కడ భూములు పచ్చగా ఉన్నా అక్కడికి వచ్చి వాలిపోయే వారిని, పారిశ్రామిక అవసరాల కోసమ ంటూ పచ్చని పొలాలు తీసుకునే సర్కారు వైఖరినీ చిరు తప్పుపట్టారు. ఇక పేదలు త్యాగాలు చేసే రోజులు పోయాయని, పెద్దవాళ్ళ భూములను ఎందుకు తీసుకోరని నిలదీసే రోజులు వచ్చాయని అన్నారు. పోలేపల్లిలో 150 ఎకరాలు అవసరమయ్యే సెజ్‌ కోసం 800 ఎకరాలు కేటాయించడం, నిర్వాసితులకు మౌలిక వసతుల్లో నిర్లక్ష్యం పరిస్థితికి అద్దం పడుతున్నదని ఆయన అన్నారు.

ఎలాగూ భూములు తీసేసుకున్నారు, కనీసం వసతి చూపండి అంటే ఇదిగో అదిగో అని కాలక్షేపం చేస్తారే తప్ప ఎవ్వరికీ ఏమీ చేయరని చిరంజీవి విమర్శించారు. ఒకవేళ ఆందోళన చేసిన వారికి ఇ చ్చినా వాటిని అమ్ముకోకూడదనే ఆంక్షలు విడ్డూరమని అన్నారు. కష్టం వచ్చినపుడు ఆస్తి అమ్ముకో కపోతే పేదలు ఇంకేం చేయగలరని అడిగారు. అయినా వారి భూములకు ఇచ్చిన తృణాన్ని కూడా అమ్ముకోకుండా కాందిశీకుల్లా బతకమని ఆదేశించడాని ఎవరికి అధికారం ఉందని ప్రశ్నించారు.

పోలేపల్లి భూ నిర్వాసితులు చేస్తున్న సత్యాగ్రహానికి చిరంజీవి మద్దతు ప్రకటించారు. సత్యాగ్రా హం చేస్తున్న వారికి పూలదండలు వేసి అభినందనలు తెలిపారు. వారికి ప్రజారాజ్యం పార్టీ అండ వుంటుందని ప్రకటించారు. ఇంకా భూ పోరాటంలో మృతిచెందిన ఉపేందర్‌ రెడ్డికి నివాళులు అర్పించారు. ఆయన త్యాగం వృధా పోదని అన్నారు. రైతుల భూములు తీసుకోకుండా, లేదంటే వారికి కనీస వసతులు, పరిహారం చెల్లించకుండా సెజ్‌ ఏర్పాటుకు తాము పూర్తి వ్యతిరేకమన్నారు.

(Courtesy: 26 September 2008, AndhraJyothy)

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

%d bloggers like this: