Fighting Injustice in Polepally SEZ

…more than courage it takes WILL to stand up against injustice !

సెజ్‌ బాధితుల సత్యాగ్రహం ప్రారంభం..

leave a comment »

AJ SEZ Cartoon

... not like this, do come in some nice suits & suitCASES, the Chief Minister will give more lands than he took!

(ఆన్‌లైన్‌ ప్రతినిధి-మహబూబ్‌నగర్‌) : మా భూములు మాకు ఇవ్వాలని పోలేపల్లి సెజ్‌ బాధితులు గురువారం అరవిందో ఫార్మా కంపెనీ ఎదుట సత్యాగ్రహం ప్రారంభించారు. అక్టోబర్‌ రెండో తేదీ వరకు సాగే ఈ సత్యాగ్రహంలో స్వచ్ఛందంగా పనులు మానుకుని బాధిత కుటుంబాలతోపాటు కంపెనీలో పని చేస్తున్న ప్రతి ఒక్కరు పాల్గొనాలని బాధితులు విజ్ఞప్తి చేశారు. గురువారం మధ్యాహ్నం నుంచి వందలాది మంది బాధితులు సత్యాగ్రహాన్ని ప్రారంభించారు. సెజ్‌ వ్యతిరేక ఐక్య సంఘటన ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. ఉదయం నుంచి రాత్రి వరకు ఈ కార్యక్రమం కొనసాగుతుందని చెప్పారు. ఫ్యాక్టరీ నిర్మాణంలో పాల్గొంటున్న ఇతర రాష్ట్రాల కార్మికులు కూడా పనులు స్వచ్ఛందంగా నిలిపి వేసి తమ సత్యాగ్రహానికి సహకరించాలని కోరారు.

ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా తెలంగాణ సెజ్‌ వ్యతిరేక ఐక్య సంఘటన కన్వీనర్‌ సుజాత, పోలేపల్లి సెజ్‌ వ్యతిరేక కమిటి కన్వీనర్‌ మధు కాగుల తోపాటు రత్నమాల, రాధ, హేమా వెంకట్‌రావు తదితరులు మాట్లాడారు. రాజకీయ నాయకులంతా పోరాటంలో భాగస్వాములుగా మారి సమస్యలను పరిష్కరించేందుకు పోరాటం చేయాలని పిలుపు నిచ్చారు. ఇప్పటి వరకు 42 మంది ప్రాణాలు పోగొట్టుకున్నారని, ఇంకా మనం ఎవరి కాళ్లు పట్టుకోవాల్సిన అవసరంలేదని కొందరు బాధితులు చిరంజీవి కాళ్లు పట్టుకున్న ఉదంతాన్ని ప్రస్తావించారు. మన కోసం ఏ రాజకీయ పార్టీ ఏం చేస్తుందో గట్టిగా నిలదీసి ప్రశ్నించాలని కోరారు. ఐకమత్యంగా ఉంటే ఈ కంపెనీలకు కూడా తరిమికొట్టవచ్చునని చెప్పారు. ప్రజారాజ్యం పార్టీ నేతలు గురువారం సాయంత్రం పోలేపల్లిని సందర్శించి బాధితులను కలుసుకున్నారు.

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

%d bloggers like this: