Fighting Injustice in Polepally SEZ

…more than courage it takes WILL to stand up against injustice !

భూమికి భూమి! పోలేపల్లి బాధితులకు చిరు హామీ

with 2 comments

సెజ్‌లు కావాల్సిందే కానీ.. పచ్చటి భూములు ఇవ్వొద్దు
అభివృద్ధికి ఇది కాదు అర్ధం పేదలను కొట్టి పెద్దలకా?
గద్దల్లా వాలిపోతున్నారు బాధితుల్లో ఒక్క నేతా లేడే..!
ఇదేనా రైతు రాజ్యం? చిరంజీవి సూటి ప్రశ్న

‘నేను పరామర్శకు వస్తున్నానని తెలిసి ఎన్ని శంకుస్థాపనలు జరిగాయో! ఆ శిలాఫలకాల సిమెంటు తడి కూడా ఆరలేదు. మీ కష్టాలు ఇంకా ఎన్నాళ్లో ఉండవు. పీఆర్‌పీని మీ భుజస్కంధాలపై వేసుకుని నడిపించండి. అన్న మాట అన్నట్టుగా నెరవేర్చే బాధ్యత నాది. భూ సత్యాగ్రహం చేస్తున్న బాధితులకు నా అభినందనలు. భూమిని కాపాడుకోవడం కోసం పోరాడి మరణించిన ఉపేందర్‌రెడ్డికి నివాళులర్పిస్తున్నాను. ఆయన ఆశయాలు వృథాకావు.

(పోలేపల్లి నుంచి ఆన్‌లైన్‌ ప్రతినిధి) ‘దేశంలో 250 సెజ్‌లున్నాయి. అందులో… 56 మన రాష్ట్రంలోనే ఉన్నాయి. సెజ్‌ల పేరు చెప్పి ఎన్నో పచ్చని భూములు అప్పగించారు. భూములు కోల్పోయిన బాధితుల్లో ఒక్క రాజకీయ నాయకుడైనా ఉన్నారా?’ …ఒకే ఒక ప్రశ్న. సూటి ప్రశ్న. ఆసక్తికరమైన ప్రశ్న. ఆలోచింపచేసే ప్రశ్న. ఇది… ప్రజారాజ్యం అధినేత చిరంజీవి వేసిన ప్రశ్న. శుక్రవారం ఆయన మహబూబ్‌నగర్‌ జిల్లాలోని పోలేపల్లి సెజ్‌ బాధితుల్ని పరామర్శించారు. వారి కష్టాలు తెలుసుకున్నారు. సెజ్‌ల పేరి ట నానా అరాచకాలు జరుగుతున్నాయంటూ మండిపడ్డారు.

మునుపటి వైఖరికి భిన్నంగా… సర్కారుపై విరుచుకుపడ్డారు. సూటి ప్రశ్నలు సంధించారు. ‘వీరి బతుకులు మీరు బాగు చేస్తే సరే! లేదంటే (మాకు) అవకాశం వస్తుంది. వారు (ప్రజలు) ఇస్తారు. అప్పుడు మేమే చూసుకుంటాం” అని అల్టిమేటం జారీ చేశారు. పోలేపల్లి సెజ్‌ బాధితులకు ‘భూమికి భూమి’ పరిహారంగా ఇస్తామని స్పష్టంగా ప్రకటించారు.

“మీ భూముల్లో మీరే కూలీలుగా ఎందుకు మారారు? ఈ సంగతి తెలుసుకునేందుకే ఇక్కడికి వచ్చాను. మీ బాధలు వింటుంటే కడుపు తరుక్కుపోతోంది. గుండె రగిలిపోతోంది. భూములు కోల్పోయిన వారికి ప్యాకేజీ ఇస్తున్నామని ప్రభుత్వం చెబుతోంది. కానీ, బాధితులను కదిలిస్తే వారిలో ఆ సంతోషం, సంతృప్తి కనబడటం లేదు” అంటూ చిరంజీవి వ్యాఖ్యానించారు.

పచ్చని భూములను పేద రైతుల నుంచి లాక్కుని పెద్దలకు ధారాదత్తం చేస్తున్నారని సర్కారీ పెద్దలపై మండిపడ్డారు. “రాష్ట్రంలో ఎక్కడ పచ్చదనం కనిపిస్తే అక్కడ కబ్జాదారులు గద్దల్లా వాలిపోతున్నారు. పరిశ్రమల ముసుగులో పేదల భూములు లాగేసుకుని రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారాలు చేస్తున్నారు. ఇదేం న్యాయం? ఇది కాకులను కొట్టి గద్దలకు పెడుతున్నట్టుగా ఉంది. ఇదేనా రైతు రాజ్యం?” అని నిలదీశారు.

‘తొండలు కూడా గుడ్లు పెట్టని భూములను బాగు చేసుకుని తరతరాలుగా సాగు చేసుకుంటుంటే… మా పొలాలను మాకు కాకుండా చేశారు. మమ్మల్ని దూరంగా నెట్టివేశారు. నేడు బతకడానికి భూమి లేదు. రేపు చచ్చినా పాతిపెట్టేందుకు చోటు లేదు’ అని ఆక్రోశిస్తున్న బాధితుల గురించి ప్రతి ఒక్కరూ ఆలోచించాలని పిలుపునిచ్చారు. “దేశ వ్యాప్తంగా 250 సెజ్‌లకు అనుమతి ఉంటే అందులో 56 మన రాష్ట్రంలోనే నోటిఫై అయ్యాయి.

రాష్ట్ర సంపద పెరగడానికి సెజ్‌లు అవసరం. అయితే, పేదల పొట్టలు కొట్టి వారి భూములను పెద్దలకు ధారాదత్తం చేయడం ద్వారా కాదు. రాములు అనే ఆసామి భూమి పోతోందన్న ఆవేదనతో తన పొలంలోనే గుండె ఆది చనిపోయాడు. ఇలాంటి కన్నీటి కథలు ఎన్నో ఉన్నాయి. పేదల త్యాగాలతో పెద్దలు లబ్ధి పొందడం అభివృద్ధి కాదు. పేదల కోసం పెద్దలు త్యాగం చేయాలి. కానీ, ఇక్కడ పరిస్థితి అలా లేదు. కాకులను కొట్టి గద్దలకు పెడుతున్నారు. ఇదేం న్యాయం?” అని చిరంజీవి నిలదీశారు.

ప్రశ్నించేవారు లేరనా?

“2003 నుంచి సెజ్‌ల సంస్కృతి ఊపందుకుంది. ఇది 2008. ఇన్నేళ్లలో ఎన్ని పరిశ్రమలు వచ్చాయి? ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారు? ఎంత అభివృద్ధి జరిగింది? చెప్పమనండి. ఏ పరిశ్రమ పెడుతున్నారు? దాని వల్ల ఎవరికి ఉపయోగం? స్థానిక యువకులకు ఉద్యోగావకాశాలు ఎలా ఉంటాయి? అని అడిగే వారు లేరు. ఎంత భూమి ఇవ్వాలి? ఎలాంటి భూమి ఇవ్వాలి అన్న దానిపై స్పష్టత లేదు. లక్షల్లో ఉద్యోగాలు వస్తాయంటూ మాటలు చెప్పి, మభ్యపెట్టి జనాన్ని ఏమార్చుతున్నారు.

నోటికి ఎంత వస్తే అంత భూమి ఇచ్చేయడమేనా? ఇతర రాష్ట్రాల్లో ఈ పరిస్థితి లేదు. పరిశ్రమలు పెట్టేవారే భూమి సేకరించుకోవాలి. ప్రభుత్వం కేవలం మౌలిక సదుపాయాలు కల్పిస్తుంది. ఇక్కడ ప్రశ్నించే వారు ఉండరన్న నమ్మకం” అని చిరంజీవి పేర్కొన్నారు. పోలేపల్లిలోనేకాదు రాష్ట్రంలో ఆంధ్ర, తెలంగాణ, రాయలసీమ అన్న తేడా లేకుండా ఎక్కడ పచ్చదనం ఉంటే అక్కడ కబ్జాదారులు గద్దల్లా వాలిపోతున్నారన్నారు.

“పోలేపల్లిలో భూములు కోల్పోయిన వారంతా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలే. నోటిఫై అయిన 56 సెజ్‌లకు సంబంధించి భూ సేకరణ జరిగింది. ఇందులో ఒక్క రాజకీయ నాయకుడి భూమైనా ఉందా? బడుగు, బలహీన వర్గాలవారే బాధితులు. వారైతే నోరెత్తి అడగరన్న ధైర్యం. పోలేపల్లి బాధితులు 2001 వరకు సంతోషంగానే ఉన్నారు. ఆ తర్వాతే వారి జీవితాలు దుర్భరంగా మారాయి. దీనికి కారణం పాలకులను నిలదీయలేని నిస్సహాయత. నిలదీయండి. అలా నిలదీసే వారికి అండగా నేనొచ్చాను” అని ఉద్ఘాటించారు. ‘మిమ్మల్ని పరామర్శించేందుకు నేను రావాల్సిన అక్కర్లేదని కొందరు అన్నారు. మీరు చెప్పండి. నేను రావడం అర్థరహితమా?” అంటూ అక్కడి జనాన్ని ప్రశ్నించి వారి స్పందనను రాబట్టారు.

మేమొస్తాం…

సెజ్‌ బాధితులకు తగిన న్యాయం చేయాలని చిరంజీవి డిమాండ్‌ చేశారు. “పోలేపల్లిలో సేకరించిన 800 ఎకరాల భూమి అలాగే ఉంది. ఆ భూమిని తిరిగి ఇవ్వాలన్న వినతిని పరిశీలించాలి. లేదా… ప్రస్తుత ధరల ప్రకారం పరిహారం చెల్లించాలి. ఇప్పటికైనా వారి కష్టాలు అర్థం చేసుకోండి. వారికి సహాయం చేసేందుకు యుద్ధ ప్రాతిపదికన ముందుకు రండి. 2001కి ముందున్న బతుకులనైనా వారికివ్వండి. లేదంటే… మాకు అవకాశం వస్తుంది. వారు ఇస్తారు. అప్పుడు మేం చూసుకుంటాం” అంటూ ప్రభుత్వానికి ‘అల్టిమేటం’ జారీ చేశారు. ప్రభుత్వం దళారీ, కబ్జాదారు పాత్ర పోషిస్తోందని పరోక్షంగా విమర్శించారు.

“భూమిని అమ్ముకునే వాడికి, కొనే వాడికి మధ్య ఉండే వారిని ఏమంటారు? భూమి ఇవ్వను అంటే దౌర్జన్యంగా లాక్కునే వాడిని ఏమంటారు? అది నేను చెప్పక్కర్లేదు. మీకే తెలుసు” అంటూ సమాధానాన్ని ప్రజలకే వదిలేశారు. “రాత్రికి రాత్రి ఎవరో మాంత్రికుడు వచ్చి భూములు లాగేసుకుంటున్నట్టు బాధితుల్లో అర్థం కాని అయోమయం నెలకొంది. ఎకరం 18 వేలట! అమ్మక పోతే అది కూడా దక్కదంటూ బెదిరింపులు” అని ధ్వజమెత్తారు.

భూమి తల్లిలాంటిది… “పెద్దలకు భూమి ఒక హోదాలాంటిది. పేదవాడికి ఎకరం భూమి ఉంటే అది పొట్టికూటి కోసం. అది ఒక సెంటిమెంటు. భూమిని అన్నం పెట్టే తల్లిలా చూసుకుంటారు. చనిపోయాక అక్కడే పాతిపెట్టాలని కోరుకుంటారు. పవిత్రమైన స్థలంగా భావిస్తారు” అంటూ భూమితో రైతులకుండే బంధాన్ని వివరించారు.

“పరిశ్రమలు, సెజ్‌లు రావాలి. ప్రజారాజ్యం వాటిని పెద్ద మనస్సుతో ఆహ్వానిస్తుంది. అయితే, పచ్చని రైతు పొలాలను ఇవ్వడానికి ఎట్టి పరిస్థితుల్లోనూ ఒప్పుకోం” అని స్పష్టం చేశారు. 950 కిలోమీటర్ల అందమైన తీర ప్రాంతాన్ని సెజ్‌ల పేరుతో కలుషితం చేస్తున్నారని మండిపడ్డారు. అందరికీ న్యాయం జరిగేలా… అందరూ శభాష్‌ అనేలా రాష్ట్రాన్ని ముందుకు తీసుకువెళ్లడమే ప్రజారాజ్యం లక్ష్యమన్నారు.

Advertisements

2 Responses

Subscribe to comments with RSS.

  1. పోలేపల్లి సెజ్ బాధలు ‘ప్రజారాజ్యం పార్టీ’ పుణ్యమా అని మళ్ళా వెలుగులోకి రావడం మంచిదే. కాకపోతే, ఇటువంటి సామాజిక సమస్యలనుంచి రాజకీయ స్వప్రయోజనాలను ఆశించకుండా, రాజకీయాలకతీతంగా పార్టీలు పోరాడినప్పుడే బాధితులకు అవసరమైన సహాయం దక్కుతుంది. అంతే కాక, సెజ్ ల విధి విధానాలపైన స్వచ్చంద సంస్థలు, వ్యాపార సంస్థలను కూడా భాగస్వాములుగా చేసుకొని పరిష్కారములను అన్వేషించవలసి వుంది.

  2. Chiranjeevi polepally SEZ samasyani ardam chesukunnatlu kanabaduthundi, Alavikaani vagdaanalu chesi tarvatha chethule yettese prasthutha raajakeeya party la kanna bhinnam ga ekkadi bhadithula korika meraku vaariki saswatha parishkaaram andinche vuddesyam atani prasamgam lo kanabadindi.

    Eppati congress ki inka ee samasyani serious ga teesukuni elections lopu parishkadam tappa vere margam ledu. Lekunte next election lo eepranta prajalu Praja Rajyam ni gelipinchina ascharya povakkarledu.

    Enduko chiranjeevi veeri samasyaki oka parishkaaram chupugaladu ani anipisthundi.

    sreedhar

    September 28, 2008 at 4:09 am


Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

%d bloggers like this: