Fighting Injustice in Polepally SEZ

…more than courage it takes WILL to stand up against injustice !

సెజ్‌ భూమికి ‘కుల’మానం – అడుగులు కాదు బడుగులే

leave a comment »

మహబూబ్‌నగర్‌, సెప్టెంబర్‌ 27, ప్రభాతవార్త ప్రతినిధి : పోలేపల్లి ఫార్మాసెజ్‌లో ప్రభుత్వం కేవలం బడుగు, బలహీనవర్గాల భూము లను మాత్రమే సేకరించింది. ఎవరు చేశారో, ఎలాచేశారో తెలియదు కాని, సెజ్‌కు చుట్టూ ఉన్న పెద్దల భూములను మా త్రం పదిలంగా ఉంచి పేదల భూములను లాగేసు కున్నారు. కేవలం ఎస్సీ, ఎస్టీ, బిసి, మైనార్టీ వర్గాల కు చెందిన భూములు మాత్రమే ఈ సెజ్‌లో ప్రభుత్వ పరం కాగా బతకడం కోసమే ఈ బడుగు వర్గాలు పోరాటాన్ని సాగిస్తున్నాయి. జడ్చర్ల మండలంలోని పోలేపల్లి ఫార్మాసెజ్‌ను శుక్రవారం సందర్శించిన ప్రజారాజ్యంపార్టీ అధినేత చిరంజీవి ఇక్కడ భూముల సేకరణలో పెద్దలపట్ల ప్రభుత్వం పక్షపాత వైఖరిని చూపిన విషయాన్ని ఎత్తిచూపారు. పోలేపల్లి ప్రాంతంలో గ్రీన్‌పార్క్‌ ఏర్పాటు చేయడం కోసం 2001-02లో 975 ఎకరాల భూమిని సేకరించారు. అప్పట్లో సెజ్‌ మాట లేకపోయినా పరిశ్రమల పేరుతో సేకరించిన భూమి మొత్తం బడుగు వర్గాలకు చెందిన వారిదే కావడం గమనార్హం. ఈ మొత్తం భూమిలో ఎస్సీవర్గానికి చెంది మాల, మాదిగ, బైండ్ల, బ్యా గరి కులానికి చెంది వారి భూములు 280 ఎకరా లు ఉన్నాయి. ఈ భూములన్నీ 1972లో అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ బతకడంకోసం వారికి పట్టాలుగా ఇచ్చినవే. ఇది కాకుండా మరో 70 ఎకరాల పట్టా భూమి కూడా ఎస్సీల నుంచి స్వాధీనం చేసుకు న్నారు. పోలేపల్లి, ముదిరెడ్డిపల్లిలకు చెందిన ఎస్సీ కుటుంబాల నుంచి మొత్తం 350 ఎకరాల భూమిని ప్రభుత్వం లాగేసుకుంది. ఎస్సీ కుటుంబాలలో ఒక ఎకరా నుంచి ఏడు ఎకరాల దాకా ఈ సెజ్‌లో భూమిని, బతుకును పొగొట్టుకున్న అభాగ్యులు ఉన్నారు. అలాగే పోలేపల్లి పంచాయతీ పరిధిలోని గుండ్లగడ్డ తండాలో నివసిస్తున్న గిరిజనుల నుంచి 200 ఎకరాల భూమి మొత్తాన్ని కూడా ప్రభుత్వం తీసేసుకుంది. ఇది కాకుండా మరో 200 ఎకరాల భూమిని ముస్లిం మైనార్టీ వర్గానికి చెంది వారి నుంచి గుంజుకుంది. మరో 170 ఎకరాల దాకా భూమిని గౌడ్లు, ముదిరాజ్‌, పద్మశాలి కులాలకు చెంది బిసిల నుంచి ప్రభుత్వం తీసుకోవడం జరిగింది.ఈ విధంగా పోలేపల్లి ప్రాంతంలో సేకరించి మొత్తం భూములన్నీ కేవలం బడుగు వర్గాలకు చెంది వారివేకావడం గమనార్హం. కాగా ఈ మొత్తం భూములన్నీ ప్రభుత్వం స్వాధీనం చేసుకొనే సరికి రైతులు వాటిని సాగుచేసు కుంటున్నారు. కొంతమంది రైతులు తోటలు పెంచుకుంటుండగా ఎక్కువ మంది ఇతర పంటల ు పెట్టుకునేవారు. మొత్తం 975 ఎకరాలలో 25 దాకా సాంప్రదాయక దిగుడుబావులు, 200 వరకు బోరుబావులు ఉండేవంటే ఈ భూముల్లో వ్యవ సాయం ఎంతగా కళకళలాడిందో అర్థం చేసుకోవచ్చు.

పెద్దల భూములు పదిలం

అదేవిధంగా గుండ్లగట్టతండాలో నివసించే బంజారాల నుంచి వారికి ఉన్న మొత్తం 200 ఎకరాలను కూడా ప్రభుత్వం తీసేసుకుంది. ప్రస్తుతం వారు ఉంటున్న ఇళ్లు తప్ప ఎవరైనా ఛస్తే పూడ్చడా నికి స్మశానం కూడా లేకుండా ఎపిఐఐసి మొత్తం భూమిని త స్వాధీనంలోకి తీసేసుకుంది.అయితే ఈ తండాకు పక్కనే అధికారపక్షానికి చెంది అగ్రవర్ణాల వారికి సంబంధించి 300 ఎకరాల భూమి ఉండగా దీన్ని అధికారులు ముట్టుకోలేదు. అదేవిధంగా జాతీయ రహదారి నుంచి మాచారం మీదుగా పోలేపల్లి ప్రాంతానికి చేరుకునే మార్గంలో దాదాపు సెజ్‌ లోపలిభాగంలోకి వచ్చి రీతిలో 120 ఎకరాల మామిడితోట ఉంది. ఇది ఒక ప్రముఖ వ్యాపార సంస్థకు చెంది ప్రైవేటు భూమి కాగా దీనిని కూడా భూసేకరణ నుంచి అధికారులు జాగ్రత్తగా తప్పించారు. అదే పేదలకు చెంది తోటలను మాత్రం పూర్తిగా ఆక్రమించుకున్నారు. అలాగే పోలేపల్లి గ్రామం ఎదురుగా జడ్చర్లకు చెంది ఓ రాజకీయ నాయకుడి మామిడితోట ఉండగా, దాన్ని కూడా సెజ్‌ నుంచి మి హాయించారు. ఈ విధంగా కేవలం బడుగు, బలహీ వర్గాల వారి భూములను మాత్రమే సేజ్‌కోసం సేకరించారు.

(Courtesy: Vaartha 28th Sept 2008)

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

%d bloggers like this: