Fighting Injustice in Polepally SEZ

…more than courage it takes WILL to stand up against injustice !

చిరంజీవి ప్రచారం కోసమే పోలేపల్లి వెళ్లారు: మల్లు రవి

leave a comment »

హైదరాబాద్‌, సెప్టెంబర్‌ 28(ఆన్‌లైన్‌ సిటీబ్యూరో): ప్రజారాజ్యం పార్టీ అధ్యక్షుడు చిరంజీవికి రాజకీయం పరిజ్ఞానం లేదని జడ్చర్ల ఎమ్మెల్యే మల్లు రవి విమర్శించారు. ఇటీవల మహబూబ్‌నగర్‌ జిల్లా పోలేపల్లిలో పర్యటించినపుడు ఆయన చేసిన వ్యాఖ్యలే అందుకు నిదర్శనమన్నారు. ఓ పక్క సెజ్‌లకు అనుకూలమంటూనే.. మరోపక్క కాంగ్రెస్‌ ప్రభుత్వం అవినీతికి పాల్పడుతోందని, సెజ్‌ బాధితులకు అన్యాయం చేస్తోందంటూ చిరంజీవి ఆరోపిస్తున్నారని మల్లు రవి విమర్శించారు. ఆదివారం ఆయన హైదరాబాద్‌లో విలేఖరులతో మాట్లాడారు. “కాంగ్రెస్‌ హయాంలో అభివృద్ధి లేదని, రాబందుల్లా పీక్కుతింటున్నారంటూ ‘చిరు’ చేసిన విమర్శలు కేవలం ముఖ్యమంత్రిని కించపర్చేలా ఉన్నాయి.

ఈ విషయంలో నేను చొరవ తీసుకుంటున్న విషయాన్ని చిరంజీవి మర్చిపోయారు. బాధిత కుటుంబాలకు ఉద్యోగాలు ఇప్పిస్తాం. ప్రతి కుటుంబానికి 200 గజాల ఇంటి స్థలం ఇప్పించడానికి ప్రభుత్వాన్ని ఒప్పించా. ఈ మేరకు వారికి పట్టాపుస్తకాలు కూడా ఇప్పించా. ఇల్లు కట్టుకోవాలనుకునే వారికి రుణాలు మంజూరు చేయించడానికి కృషి చేస్తున్నా. సెజ్‌ బాధితులకు వారి గ్రామాల్లో మౌలిక సదుపాయాల కల్పనకు రూ.1.30కోట్లు మంజూరు చేయించాం. అసలు సెజ్‌లపై చిరంజీవికే స్పష్టత లేదు.కేవలం రాజకీయంగా ప్రచారం పొందడానికే ఆయన ఇక్కడికి వచ్చి వెళ్లారు..” అంటూ చిరంజీవిపై మల్లు రవి విమర్శలు గుప్పించారు.

(Courtesy: AndhraJyothy 29th Sept 2008)

* * *

Also Read

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

%d bloggers like this: