Fighting Injustice in Polepally SEZ

…more than courage it takes WILL to stand up against injustice !

సెజ్‌లపై పోరాటానికి మార్గదర్శులు పోలేపల్లి బాధితులు

leave a comment »

(ఆన్‌లైన్‌ ప్రతినిధి-మహబూబ్‌నగర్‌) భూమి అంటే ఆత్మగౌరవం, అస్థిత్వం, ఆచారం, వార సత్వం, సంస్కృతి, ఆత్మరక్షణ, సార్వ భౌమాధికారం, జీవన విధానం, ఒక జ్ఞాపకం అన్న విషయాన్ని పోలేపల్లి సెజ్‌ బా ధితుల పోరాటం ప్రపంచానికి చాటి చెప్పింది. వారి పోరాటం అందరికీ మార్గదర్శకమైంది. ఇటీవల ప్రజారాజ్యం పార్టీ అధినేత చిరంజీవి పోలేపల్లి సెజ్‌ను సందర్శించారు. అయితే ఆయన నిజమైన బాధితులను కలుసుకోకుండానే తాను వచ్చిన పనిని ముగించుకున్నారు. దీని పట్ల అసంతృప్తికి గురైన బాధితులు చిరంజీవి ప్రసంగం సాగుతుండగానే పక్కకు వెళ్లి నిరసన గళం విప్పారు. చిరంజీవి ప్రసంగాన్ని ముగించుకుని వెళ్లిపోయినా బాధితులు తమ లక్ష్యాన్ని వీడలేదు. విషయం తెలుసుకున్న చిరంజీవి మళ్లీ వెనక్కి వచ్చి వారిని కలిశారు. అరగంట సేపు కూర్చుని వారి సమస్యలను తెలుసుకున్నారు. పోలేపల్లి పోరాటానికి ఉన్న శక్తి ఇది అని వారు చాటగలిగారు. ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా సెజ్‌లపై పోరాటం చేయడానికి పోలేపల్లి మార్గదర్శిగా మారింది.

రాష్ట్ర వ్యాప్తంగా 56 సెజ్‌లు ఇచ్చారు. ఇందులో విస్తీర్ణం దృష్ట్యా పోలేపల్లిని సెజ్‌ను చిన్నదిగానే చెప్పుకోవచ్చు. ఇక్కడ భూములు కోల్పోయిన వారు నిరుపేదలు, అట్టడుగువర్గాలకు చెందిన కుటుంబాలు. ఎస్సీ, ఎస్టీలు మాత్రమే ఉన్నారు. కూలీ నాలి చేసి పొట్టపోసుకుంటున్నారు. కానీ వారు పోరాటంలో మాత్రం ఆకలి దప్పులను లెక్క చేయలేదు. ప్రాణాలను తృణప్రాయంగా భావించి ఉద్యమానికి ఊపిరి పోశారు. రొట్టెముక్కలు వేసి ఉద్యమాన్ని విచ్చిన్నం చేయాలనుకున్న వారికి సంఘటిత శక్తితో సమాధానం ఇచ్చి రాష్ట్రాన్ని కదిలించారు. పోలేపల్లి గ్రామం సమీపంలో ఉన్న భూములను 2002-03 సంవత్సరంలో గ్రోత్‌ సెంటర్‌కోసం ప్రభుత్వం సేకరించింది. అప్పట్లో కరువు విలతాండవం చేయడంతో దిక్కు తోచని నిరుపేద కుటుంబాలు ప్రభుత్వ ఒత్తిడికి తలొగ్గారు. బలవంతంగా లాక్కున్నా నిస్సహాయంగా ఉండిపోయారు. తరు వాత తాము చేసిన తప్పు వల్ల తమతో పాటు తమ ముందు తరాలకు జరిగిన అన్యాయాన్ని వారు గుర్తించారు. మొదట పరిహారం కోసం ప్రారంభమైన ఉద్యమం ప్రజాసంఘాల నేతల స్ఫూర్తితో ఊపందుకుంది. ఇప్పుడు వారు భూమికి భూమే కావాలని పోరాటం ప్రారంభించారు. కూలీ చేసి కూడబెట్టిన డబ్బుతో ఉప ఎన్నికల్లో పోటీ చేసి రాష్ట్రం దృష్టినికి ఆకర్షించారు.

పాలకుల అణచివేత నుంచి వారు చావు భయాన్ని కూడా జయించా రు. తరువాత హక్కుల కోసం చెక్కు చెదరని ఉద్యమాన్ని సాగించారు. సెజ్‌ల పేరుతో పాలకులు, పారిశ్రామిక సంస్థ చేస్తున్న భూవ్యాపారాన్ని రాష్ట్రానికి తెలియజేశారు. సుప్రీం కోర్టు తీర్పులను తుంగలో తొక్కిన వైనాన్ని కూడా ప్రపంచానికి తెలియజేశారు. పేదలు నిర్మించ్చుకున్న ఈ పోరాటంపై రాజకీయ పార్టీలు గద్దల్లా వాలి స్వప్రయోజనాల కోసం దారి మళ్ళించే ప్రయత్నం చేశారు. కానీ పోలేపల్లి బడుగుజనంలో వచ్చిన తెగింపు ఆ అవకాశాన్ని వారికి ఇవ్వలేదు.

ఉప ఎన్నికల్లో పోటీ చేసిన బడుగు జనాన్ని డబ్బులకు లొంగదీసుకునే ప్రయత్నం చేశారు. కానీ వారు బిక్షాటనతో ఓట్లు అడుక్కుని దాన్ని తిప్పికొట్టారు. ఇప్పుడు సత్యాగ్రహం చేపట్టి రాష్ట్రం లో ఉన్న రాజకీయ పార్టీలను కదిలిస్తున్నారు. మొన్న దేవేందర్‌ గౌడ్‌, బిజెపి బంగారు లక్ష్మణ్‌ నిన్న నారాయణ, చిరంజీవిలు పోలేపల్లి బాధలను పరిశీలించారు. సెజ్‌లపై తమ విధానాన్ని తయారు చేసుకు నే ప్రయత్నం చేస్తున్నారు. చిరంజీవి పోలేపల్లి బాధితులకు భూమికి భూమి ఇస్తామని ప్రకటించారు. ఇది ఆ పార్టీ రాష్ట్ర వ్యాప్త విధానంగానే భావించవచ్చు. సెజ్‌ల పేరుతో ప్రభు త్వం నిరుపేద కుటుంబాల భూములను బలవంతంగా లాక్కున్న విషయాన్ని కూడా వెలుగులోకి తీసుకువచ్చింది. అభివృద్ధి అంటే భూమే లాక్కోవడమే కాదనే విషయాన్ని పాలకులు ఆలోచించుకునేలా చేసింది పోలేపల్లి పోరాటం. సిపిఐ రాష్ట్ర కార్యదర్శితో పాటు వివిధ పార్టీల నేతలు త్వరలో సెజ్‌ల పై పోరాటం సాగి స్తామని ప్రకటించారు.

(Courtesy: Andhra Jyothy 28th Sept 2008)

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

%d bloggers like this: