Fighting Injustice in Polepally SEZ

…more than courage it takes WILL to stand up against injustice !

ప్రభుత్వం పునరాలోచించాలి : ప్రొఫెసర్‌ హరగోపాల్‌

leave a comment »

జడ్చర్ల, సెప్టెంబర్‌ 28 (ఆన్‌లైన్‌) పోలేపల్లి అంశంపై ప్రభుత్వం పునరాలోచించాలని ప్రొఫెసర్‌ హరగోపాల్‌ సూచించారు. ఆదివారం పోలేపల్లి సెజ్‌ బాధితుల భూ సత్యాగ్రహ శిబిరాన్ని సందర్శించిన అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. పోలేపల్లి సమస్యలపై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోందని, అన్ని రాజకీయ పార్టీలు ఆలోచించాలని కోరారు. ప్రత్యేక ఆర్థిక మండళ్ళపై రాజకీయ పార్టీలు తమ వైఖరిని స్పష్టం చేయాలని అన్నారు. ఆర్థిక విధానాల వల్లే గత ఎన్నికలలో చంద్రబాబు ఓడారని గుర్తు చేశారు. పార్టీల ప్రణాళికలో సెజ్‌ల అంశంపై రాసుకుని గెలవండని సూచించారు. భూములు కోల్పోయి, బతుకుభారంగా వెల్లదీ సుకుంటున్న సెజ్‌ భాదితులకు భూమికి భూమి ఇవ్వాలని కోరారు.

ఆత్మవిశ్వాసం, పట్టుదల తగ్గకుండా పోరాటం చేయడం అభినందించదగ్గ విషయమని అన్నారు. ప్రత్యేక ఆర్థిక మండలి దుర్మార్గమైన పాలసీ అని ఆరోపించారు. ప్రభుత్వాలు ప్రవేశపెట్టిన పాలసీలను ప్రజలు అంగీకరించడం లేదని, అయినా వారిపై రుద్దడం అప్రజాస్వామికమ ని అన్నారు. ప్రభుత్వం తమ ఆర్థిక విధానాలను పునఃసమీక్షించుకోవాలని హితువు పలికారు. రాష్ట్ర ప్రభుత్వం దుర్మార్గ ప్రభుత్వమని విమర్శించారు. సమస్యను ప్రజాస్వామ్యంగా పరిష్కరిస్తారా? లేకా బల ప్రయోగంతోనా అని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. సమావేశంలో పోలెపల్లి సెజ్‌ వ్యతిరేక ఐక్య సంఘటన కన్వీనర్‌ మధు కాగుల, నూరేపల్లి సుజాత ఉన్నారు.

(Courtesy: AndhraJyothy 28th Sept 2008)

Advertisements

Written by dilkibaatein

September 29, 2008 at 12:55 pm

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

%d bloggers like this: