Fighting Injustice in Polepally SEZ

…more than courage it takes WILL to stand up against injustice !

అఖిలపక్ష చర్చ జర్పించాలి :ఎన్‌టీపీపీ నేత పెద్దిరెడ్డి డిమాండ్‌

leave a comment »

జడ్చర్ల, న్యూస్‌టుడే: సెజ్‌ అంశంపై అఖిలపక్ష చర్చ జర్పించాలని నవతెలంగాణ ప్రజాపార్టీ (ఎన్‌టీపీపీ) నేత పెద్దిరెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. సోమవారం పోలేపల్లి బాధితుల భూసత్యాగ్రహంలో పాల్గొని మద్దతు తెలిపారు. సెజ్‌ల పేరుతో పేదల భూములను లాక్కొని వారి బతుకులను రోడ్ల పాలు చేస్తున్నారని మండిపడ్డారు. అనంతరం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. తలలు తీసైనా ఆరు నెలల్లో తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకుంటామని అన్నారు. నవంబర్‌ 1న బ్లాక్‌’డే’గా పాటిస్తామన్నారు. జైలు కెళ్లేందుకైనా సిద్ధమని ప్రకటించారు. ప్రత్యేక తెలంగాణ సాధన తదనంతరం సెజ్‌ చట్టాన్ని ఎత్తివేస్తామన్నారు. కార్యక్రమంలో అల్తాఫ్‌ హుస్సేన్‌, ప్రతాప్‌రెడ్డి, మతీన్‌ పాల్గొన్నారు.

హక్కులు కాలరాస్తున్నారు

సెజ్‌ల పేరిట పాలకులు ప్రజల హక్కుల్ని కాలరాస్తున్నారని ప్రగతిశీల మహిళా సంఘం రాష్ట్ర అధ్యక్షురాలు సంధ్య ధ్వజమెత్తారు. సోమవారం పోలేపల్లి సెజ్‌ బాధితుల సత్యగ్రహంలో పాల్గొని మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా విలేకరులతో ఆమె మాట్లాడారు. సెజ్‌ చట్టాన్ని ఎత్తివేసే వరకు రాజకీయ పార్టీలను తరిమి కొట్టాలని పిలుపు నిచ్చారు. పోలేపల్లి బాధితుల డిమాండ్ల పరిష్కార ఉద్యామానికి సంఘం మద్దతుగా ఉంటుదన్నారు. సమావేశంలో ఝాన్సి, జానకి పాల్గొన్నారు.

(Courtesy: Eenadu 30th Sept 2008)

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

%d bloggers like this: