Fighting Injustice in Polepally SEZ

…more than courage it takes WILL to stand up against injustice !

బాంబుల వర్షం కురిసిన భయపడొద్దు

leave a comment »

* ‘సెజ్‌’ బాధితులకు గద్దర్‌ బాసట          * భూములిచ్చే దాక పోరాడండి
* వైఎస్‌, చంద్రబాబు ఒకే గూటి పక్షులు     * బాధితులతో కలిసి ఆటపాట

జడ్చర్ల, న్యూస్‌టుడే: అన్నం పెట్టే రైతు కావాలో… విషాన్ని పంచే కంపెనీలు కావాలో.. రైతు రాజ్యమంటున్న వైఎస్‌ తేల్చుకోవాలని ప్రజా గాయకులు గద్దర్‌ సవాల్‌ విసిరారు. పోలేపల్లి బాధితులకు ఏం న్యాయం చేస్తారో సీఎం స్వయంగా ఇక్కడికి వచ్చి ప్రకటించాలని ఆయన డిమాండ్‌ చేశారు. మంగళవారం సాయంత్రం పోలేపల్లి సెజ్‌ బాధితుల సత్యాగ్రహంలో ఆయన పాల్గొని తన మద్దతును ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. సెజ్‌ అనేది సామ్రాజ్యవాదం (అమెరికా) వెనుక ఉండి నడిపేదని ఆయన వ్యాఖ్యానించారు. ప్రజలను విడదీసేందుకు సెజ్‌లు వచ్చాయన్నారు. అమాయక ప్రజలను లాటరీ, మంత్రదండం మాదిరిగా మోసం చేసి వారి భూములను సర్కారు లాక్కుందని ఆయన ఆరోపించారు. సెజ్‌ల వల్ల దేశంలో ఎంతో మంది పుస్తెలు తెగిపోతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. పేదల భూములు లాక్కునేందుకు చంద్రబాబు ప్లాన్‌ చేస్తే వైఎస్‌ ఓకే చేశారని, వీళ్లిద్దరూ ఒకే గూటి పక్షులని అన్నారు. భూమి పుట్టినప్పటి నుంచి జరగని అన్యాయం ఈ నాల్గున్నర ఏళ్ళలో జరిగిందన్నారు. మంత్రులు, రాజకీయ నాయకులు, భూస్వాముల భూములను సెజ్‌లకు ఎందుకు ఇవ్వలేదని ఆయన ప్రశ్నించారు. పోలేపల్లి సెజ్‌లో రైతుల నుంచి బలవంతంగా ఈ సర్కారు భూములను లాక్కుందని ఆయన మండిపడ్డారు. అన్నంలో మన్నుపోసే, పేదల నెత్తురు తాగే ఈ సర్కారును కూల్చేలని పిలుపునిచ్చారు. తుపాకులు పేల్చినా… తుటాలు ఎదురైనా… భూముల కోసం ఉద్యమాన్ని కొనసాగిస్తామని ఆయన చెప్పారు. ఈ ఉద్యమానికి మేధావులు, విద్యావంతులు, రాజకీయ వాదులు సహకరించాలని కోరారు.

అసైన్డ్‌ భూముల జీఓను రద్దు చేయాలి

అసైన్డ్‌ భూములనేది పచ్చిమోసం, పాలకవర్గాల కుట్ర అని ఆయన చెప్పారు. వందేళ్ళు కాపాడిన అసైన్డ్‌ భూములను ఒక్క షరుతుతో ప్రభుత్వం లాక్కుంటుందని ఆరోపించారు. అసైన్డ్‌ భూముల జీఓను రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు. పేదలు శాశ్వతంగా భూములను అనుభవించే చట్టాన్ని రూపొందించాలని ఆయన కోరారు. అంతకు ముందు బాధితులతో కలిసి జరిగిన అన్యాయాన్ని తెలుసుకున్నారు. ఈ సందర్భంగా అరవిందో ఫార్మా కంపెనీ ఎదుట బాధితులతో పాటు సెజ్‌లపైన పాటలు పాడారు. మీ వెంట మేము ఉంటామని… నిరుత్సాహ పడకండి… భూములు వచ్చేదాక పోరాడండి అంటూ ఆయన ధైర్యానిచ్చారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ జర్నలిస్టు ఫోరం అధ్యక్షులు పాశం యాదగిరి, తెలంగాణ రచయితల సంఘం అధ్యక్షులు బి.ఎస్‌.రాములు, చంద్రన్న, సి.ప్రభాకర్‌, ఆకుల భూమయ్య, నవమాస కృష్ణయ్య, దుర్గం రవీందర్‌, వెంకటేశ్వర్‌రావు, సూరేపల్లి సుజాత, మధుకాగుల తదితరులు పాల్గొన్నారు.

(Courtesy: Eenadu 1st October 2008)

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

%d bloggers like this: