Fighting Injustice in Polepally SEZ

…more than courage it takes WILL to stand up against injustice !

భూమికి భూమే పరిష్కారం

leave a comment »

Madhu Kagula

Madhu Kagula

వెలుగు ప్రాజెక్టులో ఉద్యోగిగా ఉన్న మధుకాగుల ఇప్పుడు ఉద్యమకారునిగా మారిపోయారు. పోలేపల్లి సెజ్‌ బాధితుల తరపున తెలంగాణ ఐక్య సంఘటన ఏర్పాటు చేసి సాగిస్తున్న పోరాటం రాష్ట్రంలోనే సంచలనంగా మారింది. మొన్న దేవేందర్‌గౌడ్‌, నారాయణ, నిన్న బంగారు లక్ష్మణ్‌, చిరంజీవి సెజ్‌ల పోరాటానికి పోలేపల్లిని వేదికగా ఎన్నుకున్నారు. ఆలంపూర్‌ మండలంలోని లింగనవాయి గ్రామానికి చెందిన మధు పాలమూరులో డిగ్రీ వరకు చదివారు. ఎంఎస్‌డబ్లూతో పాటు, ఎల్‌ఎల్‌ బి అనంతరం ప్రస్తుతం పిహెచ్‌డి చేస్తున్నారు. ఉద్యోగాన్ని వదిలి 1999 నుంచి ప్రజా సంఘాల ద్వారా ఉద్యమిస్తున్నారు. భూమికి భూమే పరిష్కారమంటున్న మధుతో ఆన్‌లైన్‌ ఇంటర్వ్యూ.

ఇప్పుడున్న దశలో పోలేపల్లి సెజ్‌ సమస్యకు పరిష్కారం ఏమిటి? ఎటువంటి పరిష్కారానికి బాధితులు అంగీకరించే అవకాశం ఉంది?
ప్రజాభిప్రాయ సేకరణ, గ్రామ పంచాయతీ తీర్మానం లేకుండా ప్రభుత్వం రైతుల భూమిని బలవంతంగా ఆక్రమించుకున్నది. ఆ భూములను రైతులకు తిరిగి ఇవ్వాలి. పోలేపల్లి సెజ్‌ బాధితులకు భూమికి భూమే శాశ్వతమైన పరిష్కారం. పోలేపల్లి సెజ్‌ ప్రాంతంలో ఇంకా 800 ఎకరాల భూమి మిగిలి ఉంది. ఆ భూములను ప్రభుత్వం వెంటనే రైతులకు ఇవ్వాలి. ఐదు సంవత్సరాల నుంచి ఈ ప్రాంతం లో వ్యవసాయం చేయడం లేదు. అందువల్ల ప్రతి ఎకరాకు 10 లక్షల రూపాయల నష్టపరిహారాన్ని ప్రభుత్వం చెల్లించాలి. రాష్ట్రంలో ఎక్కడా సెజ్‌ వ్యతిరేక పోరాటాలు పెద్దగా నడవడం లేదు.

మీ పోరాటం విజయవంతం అవుతుందని విశ్వసిస్తున్నారా?
ప్రజల ఉద్యమం వల్ల పోలేపల్లి సెజ్‌కు ఎక్కువ ప్రాధాన్యం లభించిన మాట నిజం. మిగతా ప్రాంతాల్లో ఇప్పుడు భూసేకరణ జరగడం ప్రారంభమైంది. ఆ ప్రాంతాలలో రైతులను కులాల వారీగా, మతాల వారీగా విడదీసి, ఆశ చూపి, ప్రభుత్వం వారి భూములను ఆక్రమించుకుంటోంది. అయితే అది ఎంతో కాలం సాగదు. భూసేకరణ పూర్తయిన తరువాత అక్కడి రైతులు కూడా పోరాటాలు చేస్తారు.

పోలేపల్లి నిర్వాసితులకు తగిన పరిహారం లభించిందని, అధిక ప్రయోజనం కోసమే పోరాడుతున్నారన్న అభిప్రాయం ఉంది. మీ సమాధానం ఏమిటి?
పోలేపల్లి సెజ్‌ ప్రాంతంలో నాలుగు రకాలుగా భూములను విభజించారు. అందులో రోడ్డుకు దగ్గరగా ఉన్న వాటికి ఎకరానికి లక్షన్నర రూపాయల ధరను ప్రభుత్వం నిర్ణయించింది. రెండవ ఫేజ్‌లో ఉన్న వాటికి ఎకరానికి 80 వేలు, మూడవ ఫేజ్‌లోఎకరానికి 50 వేలు ధర నిర్ణయించింది. నాలుగవ ఫేజ్‌లో 280 ఎకరాలు అసైన్డ్‌ భూమి ఉంది. అక్కడ ఎకరానికి 18 వేల రూపాయలు మాత్రమే నిర్ణయించింది. ఈ భూమిని 2002లో ప్రభుత్వం తీసుకుంది. 2005 వరకు నష్టపరిహారం చెల్లించలేదు. అప్పుడే భూముల ధరలు పెరిగిపోయాయి. ఎకరం భూమి మార్కెట్‌ ధర 10 నుంచి 20 లక్షల వరకు ఉంది.

రాజకీయ పక్షాలు మీ పోరాటం విషయంలో ఎలా స్పందిస్తున్నాయి?
పోలేపల్లి సెజ్‌ బాధితులకు అన్ని రాజకీయ పార్టీల మద్దతు ఉంది. అందరూ సహకరిస్తున్నారు. రాజకీయ పక్షాల నాయకులు పోలేపల్లి ప్రాంతానికి వచ్చి బాధిత రైతులకు మద్దతు ప్రకటించారు.

బాధితులలో అధిక సంఖ్యాకులు దళితులు కదా, దళిత సంఘాల స్పందన ఎట్లా ఉంది?
బాధితులకు దళిత సంఘాల మద్దతు మామూలుగా ఉంది. తెలంగాణ మాదిగ హక్కుల పోరాట సమితి, తెలంగాణ గిరిజన భేరి మద్దతు సంపూర్ణంగా ఉంది. మిగతా సంఘాలు కూడా ముందుకు రావాలని కోరుతున్నాం.

ప్రభుత్వం మీ మీద అణచివేతకు పాల్పడే అవకాశం ఉన్నదని భావిస్తున్నారా?
మేం ప్రజాస్వామ్య పద్ధతిలో శాంతియుతంగా ఆందోళన చేస్తున్నాం. అయినా కొన్ని పరిస్థితుల్లో అసహనానికి గురయ్యే అవకాశం ఉంది. అయినప్పటికీ హింసాత్మక సంఘటనలు జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నాం. ప్రభుత్వం కూడా అణచివేత చర్యలకు దిగకుండా, త్వరగా స్పందించి సమస్యను పరిష్కరిస్తే బాగుంటుంది.

– ఇంటర్వ్యూ: వెంకటరెడ్డి (ఆన్‌లైన్‌ ప్రతినిధి, మహబూబ్‌నగర్‌)

(Courtesy: 02 october 2008, AndhraJyothy)

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

%d bloggers like this: