Fighting Injustice in Polepally SEZ

…more than courage it takes WILL to stand up against injustice !

పోలేపల్లి బ్లాగ్ పై ఆంధ్రజ్యోతి కధనం

with 7 comments

పోలేపల్లి సెజ్ వ్యతిరేక పోరాటాన్ని ఇంటర్ నెట్ ద్వారా ప్రపంచవ్యాప్తంగా చేరవేస్తున్న https://polepally.wordpress.com బ్లాగ్ గురించి మొన్న ఆదివారం నాడు ఆంధ్రజ్యోతి పత్రికలో ఒక కధనం వెలువడింది. కింద ఆ కధనం చదవచ్చు.

పోలేపల్లికి పోదాం….

Banjara

శీర్షిక చూసి, ఇదేదో పల్లెటూరుకు తీస్కెళ్లి, అక్కడి అందాల్ని వర్ణించే భావుకత నిండిన బ్లాగు అనుకుంటే పొరపాటే. సాధారణంగా బ్లాగుల్లో సరదా విషయాలు, చర్చలే ఎక్కువ శాతం చోటును ఆక్రమించుకుంటాయి. అలాంటిది, ఏకంగా ప్రత్యేక ఆర్థిక మండళ్లు (ఎస్‌ఈజడ్‌)లపై చర్చిస్తూ ఒక బ్లాగు ఏర్పాటైందంటే నమ్మగలమా? polepally.wordpress.com మాత్రం అచ్చంగా ఓ ఎస్‌ఈజడ్‌ గురించి అవగాహన కల్పించడానికే రూపొందింది.

పోలేపల్లి, ముదిరెడ్డిపల్లి, గుండ్లగడ్డ తాండాలు మహబూబ్‌నగర్‌ జిల్లాలోని చిన్న గ్రామాలు. జడ్చర్ల, బాలానగర్‌ మండలాల్లోని ఈ మారుమూల పల్లెలు మామూలుగానైతే వార్తల్లోకొచ్చేవే కావు. కానీ రాష్ట్రప్రభుత్వం అక్కడ ప్రత్యేక ఆర్థిక మండలి కోసం వెయ్యి ఎకరాల్ని సేకరించాలనుకున్నప్పుడు ఇవి మీడియా దృష్టిని ఆకర్షించాయి. దళిత కులాలు, తెగలు, ఇతర వెనుకబడిన వర్గాలకు చెందిన బక్క రై

తులే అక్కడంతా. అక్షర జ్ఞానం తక్కువ. జీవనాధారమైన భూమిని వదులుకున్నందుకు, తమ భూముల్లో తామే కూలీలైనందుకూ వారికి దక్కింది అతి తక్కువ పరిహారం.. అదీ వేలల్లో. కానీ దాన్ని కైవసం చేసుకున్న బడాబాబులు అదే భూముల్ని లక్షల్లో అమ్ముకుంటున్నట్టు వార్తలు వచ్చాయి.

దీన్ని నిరసిస్తూ అక్కడి రైతులు జరుపుతున్న పోరాటం, వారి దయనీయ స్థితిగతులు – ఇవన్నీ ఈ బ్లాగులో ఎప్పటికప్పుడు అప్‌డేట్‌ అవుతున్నాయి. నాలుగేళ్లుగా ఆ గ్రామస్తుల జీవితాన్ని పోలేపల్లి బ్లాగు కళ్లకు కట్టినట్టు చూపిస్తుంది. ఎవరి అభివృద్ధి కోసం.. ఎవరు త్యాగాలు చెయ్యాలని నిలదీస్తుంది. ఇప్పుడు పోలేపల్లి జాతీయ మీడియాలో సైతం ఒక చర్చనీయాంశం. అందువల్ల పత్రికల్లో పోలేపల్లి సెజ్‌ గురించి వచ్చిన వార్తలన్నిటికీ ఈ బ్లాగు నుంచి లింక్స్‌ ఉన్నాయి. వివిధ సందర్భాల్లో తీసిన ఫోటోలు, వీడియోలూ ఉన్నాయి. బాధితుల స్వరాన్ని వినిపించే కవితలు, పాటలు, కరపత్రాలు, కథనాలు, రిపోర్టులు, అన్నిటినీ ఈ బ్లాగు అందిస్తుంది. ఇవన్నీ ఒకెత్తు. ‘ప్రభుత్వం మీ భూమిని సేకరించదలిస్తే.. మీరేం చెయ్యవచ్చు..’ అనే పోస్ట్‌ మరొక ఎత్తు.

ఇవాళ పోలేపల్లిలో మరొకచోటో జరుగుతున్న భూసేకరణ మన జాగాలోకే వస్తే? అన్న ప్రశ్న చాలామందికే లోపల్లోపల ఉండే అవకాశాలున్నాయి. అలాంటప్పుడు వ్యవహరించాల్సిన తీరును ఈ పోస్ట్‌ స్పష్టంగా విడమరిచి చెబుతుంది. ఎంతోమందికి ఉపయుక్తం కనుక, దీన్ని చిన్న పుస్తకంగానూ వేసింది మానవహక్కుల వేదిక. పోలేపల్లి. వర్డ్‌ప్రెస్‌.కామ్‌ బ్లాగులోని విషయమంతా ఇంగ్లిష్‌, తెలుగు భాషల్లో ఉంటుంది కనుక, ఎవరైనా సులభంగా చదువుకుని అర్థం చేసుకోవచ్చు. మన అభిప్రాయాల్ని కామెంట్ల రూపంలో చేరవెయ్యొచ్చు. పోలేపల్లి రైతులకు, వారి నిరసనకు ఏ రూపంలోనైనా సాయం చెయ్యాలంటే సంప్రదించాల్సిన వ్యక్తుల పేర్లు, సెల్‌ నంబర్లూ కూడా ఉన్నాయి.

(Courtesy: Sunday 05 October 2008, Navya, AndhraJyothy)

Advertisements

Written by dilkibaatein

October 8, 2008 at 7:14 am

7 Responses

Subscribe to comments with RSS.

 1. చాల మంది స్పెషల్ ఎకనామిక్ జోన్ అనే ఇంగ్లిషు మాటను ఏకవచనంలో ప్రత్యేక ఆర్థిక మండలి అని, బహువచనంలో మండళ్లు అని వ్యవహరిస్తున్నారు. బహుశా ఏనాడు దినపత్రిక ఇలా అనువాదం చేసింది గనుక చాలమంది అదేవిధంగా వాడుతున్నట్టున్నారు. కాని అది తప్పు. మండలి అంటే వ్యక్తుల సమూహం. ఇంగ్లిషులో కౌన్సిల్ కు ఆ మాట వాడుతున్నాం. సెజ్ లో ఉండేది వ్యక్తుల సమూహం కాదు. ఇక్కడ ప్రాంతం అనే అర్థం వచ్చే జోన్ అనే మాటకు మండలం అని వాడడం సరయినది. అప్పుడు బహువచనం మండలాలు అవుతుంది.

  N Venugopal

  October 8, 2008 at 1:52 pm

 2. ఒక చిన్న సవరణ: “ప్రభుత్వం మీ భూమి కోసం వస్తే…” అనేది మానవ హక్కుల వేదిక (HRF) వారు వేసిన బుక్ లెట్. ఈ పుస్తకం అందరికీ అందుబాటులోకి రావాలనే సంకల్పంతో పోలేపల్లి బ్లాగులో పెట్టడం జరిగింది.

  Konatham Dileep

  October 8, 2008 at 2:05 pm

 3. good show.
  all the best

 4. All the best.

  Vamsi M Maganti

  October 8, 2008 at 11:09 pm

 5. మంచి పరిణామం. పత్రికలు బ్లాగులకి సముచిత స్థానం కల్పిస్తున్నాయి.

 6. నిన్న అంటె అక్టొబర్ 8 వ తేదీన ఆంధ్రజ్యోథి ఎడిటోరియల్ పేజీలో కె.బాలగోపాల్ గారు “భూములెందుకివ్వాలె?” అనే టైటిల్‌తో ఒక వ్యాసం రాశారు. సమాన్యుల దగ్గర కంపెనీలు ఎట్లా భూములు గుంజుకుంటున్నాయో జార్ఖండ్‌లో వాస్తవంగా జరిగిన సంఘటనలు ఉదహిరిస్తు గొప్పగా రాశారు.ముఖ్యంగా దేశంలో ఎంతో మంచిదని పేరున్న టాటా కంపనీ ఎట్ల భూములు లాక్కొనే ఉద్దేశంతో ఎన్ని కుట్రలు పన్నిందో కళ్ళకు కట్టినట్లు చూపించాడు. టాటా కంపనీయే ఇట్ల ప్రవర్తిస్తే ఇక ఇతర కంపెనీల పద్దతులెలా ఉంటాయో ఊహించడానికే భయంగా ఉంది.అసల్‌దార్‌లైన సామాన్యులైన ప్రజలు తమకు న్యాయమైన రీతిలో సేజ్‌లకింద ఇష్టపూర్వకంగా సరైన పరిహారం తీసుకొని భూములిచ్చే ప్రత్యామ్నాయ పద్దతులే లేవా?

  Ramulu

  October 9, 2008 at 9:50 pm

 7. More and more commoon people and the middle class NETIZEns should know about poleplly.There is need to engage in the struggle in one or the other way.
  The Unjustfullness of SEZ Act and Forcefull assurption of land has to be challenged.

  Indian Corporate should alsothink about this seriously.

  vageesh

  October 10, 2008 at 2:22 pm


Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s

%d bloggers like this: