Fighting Injustice in Polepally SEZ

…more than courage it takes WILL to stand up against injustice !

పోలేపల్లి సెజ్ బాధితుల పాదయత్ర

leave a comment »

పోలేపల్లి సెజ్ బాధితులు ఎమార్పీఎస్ ఆధ్వర్యంలో  పోలేపల్లి నుండి మహబూబ్ నగర్ వరకూ పాదయత్ర నిర్వహించారు. ఆ కార్యక్రమం వార్తలు…

1) ఈనాడు దినపత్రిక

పచ్చని పొలాల్లో కంపెనీలా..?

భూములు ఇచ్చే వరకు పోరు
ఎమ్మార్పీఎస్‌ పాదయాత్రలో నాయకులు

కలెక్టరేట్‌, న్యూస్‌టుడే: పచ్చటి పంట పొలాల్లో విషం చిమ్మే కంపెనీలు ఏర్పాటు చేస్తూ…పేదలకు అన్యాయం చేస్తున్నారని ఎమ్మార్పీఎస్‌ నాయకులు అన్నారు. పోలేపల్లి నుంచి మహబూబ్‌నగర్‌ వరకు సోమవారం ఎమ్మార్పిఎస్‌ ఆధ్వర్యంలో పాదయాత్ర నిర్వహించారు.

ఈ సందర్భంగా ఎమ్మార్పీఎస్‌ రాష్ట్ర నాయకుడు బాలకిష్టయ్య మాట్లాడుతూ పోలేపల్లి సెజ్‌లో భూములు పోగొట్టుకుంది ఆర్థికంగా, సామాజికంగా వెనుకబడిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలేనని అన్నారు. సెజ్‌కు చుట్టూ ఉన్న పెద్ద భూ స్వాముల భూములను పదిలంగా ఉంచి పేదల భూములను మాత్రం సెజ్‌లలో కలిపారని విమర్శించారు. భూములు కోల్పోయి రోడ్డున పడ్డ కుటుంబాలను ఆదుకోవడానికి ప్రభుత్వం ముందుకు రావడం లేదని విమర్శించారు. తీసుకున్న భూమికి కూడా సరైన నష్టపరిహారం చెల్లించలేదన్నారు. అనంతరం రాష్ట్ర షెడ్యూల్డ్‌ కులాల సంక్షేమ శాసన సభా సంఘం అధ్యక్షుడు గంగారంకు వినతిపత్రం అందజేశారు. కలెక్టర్‌ లేకపోవడంతో రెండు గంటల పాటు జడ్పీ ముందే ధర్నా చేశారు. కలెక్టర్‌ వచ్చిన అనంతరం వినతిపత్రం అందజేశారు. తమకు న్యాయం చేయాలని కోరారు.
ముగ్గురికి అస్వస్థత…

ఎమ్మార్పీఎస్‌ ఆధ్వర్యంలో పోలేపల్లి నుంచి సెజ్‌ బాధితులు నిర్వహించిన పాదయాత్రలో మార్గమధ్యంలో ఏనుగొండ వద్ద నర్సింహులు, జడ్పీ ముందు గౌరమ్మ, పెంటయ్యలు అస్వస్థతకు గురయ్యారు. వీరిని పోలీసులు హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు.

Courtesy: Eenadu 14th October 2008

2) ఆంధ్రజ్యోతి దినపత్రిక

సెజ్‌ బాధితుల ఆగ్రహం
 
స్టేషన్‌ మహబూబ్‌నగర్‌, అక్టోబర్‌ 13 (ఆన్‌లైన్‌): భూములు కోల్పోయి ఆందోళన బాటన పయనిస్తున్న పోలేపల్లి సెజ్‌ బాధితులు జిల్లా కలెక్టర్‌, ఇతర అధికారులపై సోమవారం రాత్రి మండిపడ్డారు. మా భూములు మాకే ఇవ్వాలని పోలేపల్లి సెజ్‌ బాధితులు సోమవారం ఎంఆర్‌పిఎస్‌ ఆధ్వర్యంలో తమ స్వగ్రామం నుండి జిల్లా కేంద్రానికి పాద యాత్ర నిర్వహించారు. జిల్లా కేంద్రానికి చేరుకున్న బాధితుల ర్యాలీకి పలు దళిత, ప్రజా సంఘాలు ర్యాలీలో పా ల్గొని మద్దతు ప్రకటించాయి. సాయంత్రం నాలుగున్నర గంటల ప్రాంతంలో జిల్లా కేంద్రానికి చేరుకున్న పాద యాత్ర బృందం మొదటగా అంబేద్క ర్‌ విగ్రహానికి పూల మాలలు వేసింది. మా భూములు కావాలి, మాకు న్యా యం జరిగే వరకు పోరాటం ఆగదంటూ బాధితులు, దళిత సంఘాల నేతలు నినాదాలు చేశారు. అనంతరం ఆందోళన కారులు జిల్లా కలెక్టర్‌ కార్యాలయంలోకి చొచ్చుకొని వెళ్ళే ప్రయత్నం చేశారు. జిల్లా పోలీస్‌ యంత్రాంగం వారిని లోపలికి వెళ్ళనివ్వకుండా గేట్ల దగ్గరే అడ్డుకున్నది. కలెక్టర్‌ కార్యా లయంలో లేరని జిల్లా పరిషత్‌లో జరుగుతున్న సమావేశంలో ఉన్నారని తెలుసుకొని అక్కడికి ఆందోళనకారులు పరుగులు తీశారు.

జిల్లా పరిషత్‌ కార్యాలయం ముందు బైటాయించి తమకు న్యాయం జరగాలని రాష్ట్ర ముఖ్యమంత్రికి, మంత్రి చిన్నారెడ్డికి, జిల్లా కలెక్టర్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఆర గంట అనంతరం సమావేశంలో ఉన్న శాసన సభ ఎస్‌సి సంక్షే మ కమిటీ చైర్మన్‌ గంగారాం ఆందోళనకారుల దగ్గరికి వచ్చి కలెక్టర్‌, జెసిలతో మాట్లాడి న్యాయం జరిగేందుకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఇందుకు కలెక్టర్‌, జెసిలతో కలిసి ఆరున్నర గంటలకు సమావేశం అవుతానని చెప్పి ఇతర కార్యక్రమాలలో పాల్గొనడానికి వెళ్ళారు. అధికారులు, శాసన సభ కమిటీ చైర్మన్‌ తిరిగి వచ్చే వరకు జెడ్‌పి కార్యాలయం ముందు బైటాయించారు.

రాత్రి ఎనిమిది గంటల ప్రాంతంలో అధికారులు చైర్మన్‌ ఆందోళనకారుల దగ్గరకు చేరుకున్నారు. ఈ సందర్భంగా గతంలో పోలేపల్లి భూములను స్వాధీన పరచుకున్న విధానాన్ని గూర్చి కలెక్టర్‌ గంగారాంకు వివరించారు. ఆందోళనకారులు, అధికారుల మధ్య తీవ్ర స్థాయిలో వాదన జరిగింది. పరిస్ధితి అదుపు తప్పుతుండటంతో కలెక్టర్‌ ఉషారాణి, జెసి క్రిస్టినా అక్కడి నుండి వెళ్ళిపోయారు. దీంతో ఆందోళన కారులు మరో మారు అధికారులకు, ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కార్యక్రమంలో సెజ్‌ బాధితులతో పాటు ఎంఆర్‌పిఎస్‌ నాయకులు కోడ్గల్‌ యాదయ్య, కొంగలి నాగరాజు, కష్ణయ్య, బాల్‌రాజ్‌, బోయపల్లి నర్సింలు, జహంగీర్‌ పాషా, విజయకుమార్‌, శ్రీను, వేపూర్‌ వెం కటేష్‌, సత్యం, కష్ణ, సాజిదా సికిందర్‌, తదితరులు పాల్గొన్నారు.

Advertisements

Written by dilkibaatein

October 14, 2008 at 9:58 pm

Posted in News Archive, Telugu

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

%d bloggers like this: