Fighting Injustice in Polepally SEZ

…more than courage it takes WILL to stand up against injustice !

ఏమిటీ రహస్య చర్చలు?

leave a comment »

పోలేపల్లి సెజ్ బాధితులను ఏదో ఒక విధంగా మభ్యపెట్టి వారి ఉద్యమాన్ని నీరుగార్చాలని ప్రభుత్వ పెద్దలు చేయని ప్రయత్నం లేదు. ఎంతో కొంత డబ్బులు ఇస్తాం ఉద్యమాన్ని ఆపండని అటు ఎమ్మెల్యే, ఇటు కలెక్టర్ గత కొన్ని నెలలుగా ప్రయత్నిస్తూనే ఉన్నారు. ఇందులో భాగంగానే నిన్న కొద్దిమంది రైతులతో మహబూబ్ నగర్ కలెక్టర్ ఉషారాణి గారు రహస్య చర్చలు జరిపారు . ఆ చర్చల వార్త కింద చదవండి…

చర్చల ద్వారా సమస్య పరిష్కరించదలుచుకుంటే బాధిత రైతులంతా కలిసి వేసుకున్న ఉద్యమ కమిటీని సంప్రదించడం, బహిరంగంగానే చర్చించడం సరైన మార్గం అంతే కానీ ఇలా కొద్దిమంది రైతులను మభ్యపెట్టి తలుపుల మాటున చర్చలు చేయడం సరికాదని పోలేపల్లి సెజ్ వ్యతిరేక ఐక్య సంఘటన భావిస్తుంది .

సెజ్‌ బాధితులతో కలెక్టర్‌ చర్చలు

* అందరిని రానివ్వలేదని బాధితుల ఆందోళన

కలెక్టరేట్‌, న్యూస్‌టుడే: సెజ్‌ బాధితులతో జిల్లా కలెక్టర్‌ ఉషారాణి మంగళవారం ఆమె క్యాంపు కార్యాలయంలో సమావేశమయ్యారు. సాయంత్రం 5 గంటలకు ప్రారంభమైన చర్చలు రాత్రి 8 గంటల వరకు సాగాయి. భాజపా కిసాన్‌ మోర్చా నాయకుడు శౌరిడేవిడ్‌ ఆధ్వర్యంలో కొంత మంది సెజ్‌ బాధితులు కలెక్టర్‌తో చర్చలు జరిపారు. కొందరు రైతులు ఆలస్యంగా రావడంతో వారిని చర్చలకు అనుమతించలేదు. చర్చల్లో బాధితులకు ఇచ్చిన ఇళ్ల పట్టాల గురించి చర్చించామని డేవిడ్‌ తెలిపారు. లబ్ధిదారుల పేరున పట్టాలు చేస్తామని కలెక్టర్‌ హామీ ఇచ్చినట్లు చెప్పారు. భూమికి వేరే చోట భూమి ఇవ్వాలని కోరగా అది తన చేతిలో లేదని కలెక్టర్‌ చెప్పిందన్నారు. భూమికి భూమి ఇచ్చేంత వరకు తమ పార్టీ పోలేపల్లి బాధితుల వెంటే ఉంటూ పోరాడుతుందన్నారు. దీంతో పాటు చిరు, నారాయణ, గద్దర్‌ల పర్యటన తదితర అంశాలను కూడా ప్రస్తావించారు.

ఆగ్రహించిన బాధితులు…

చర్చలకు తమను అనుతించకపోవడాన్ని నిరసిస్తూ కొందరు బాధితులు భాజపా నాయకుడు శౌరితో వాగ్వివాదానికి దిగారు. లోపల అంతా గూడుపుఠాణి జరిగింది… అంటూ నిలదీశారు. పార్టీ గుర్తుల వారితో కాకుండా భూములు కోల్పోయిన వారితో కలెక్టర్‌ మాట్లాడాలని డిమాండ్‌ చేశారు. ఇక చర్చలతో తమ సమస్య పరిష్కారం కాదని, భూమికి భూమి ఇచ్చేంత వరకు తమ పోరాటం ఆగదంటూ స్పష్టం చేశారు. 

Courtesy: Eenadu, Oct 15th 2008

Advertisements

Written by dilkibaatein

October 15, 2008 at 9:50 am

Posted in News Archive, Telugu

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

%d bloggers like this: