Fighting Injustice in Polepally SEZ

…more than courage it takes WILL to stand up against injustice !

పెట్టుబడికి పుట్టిన విష పుత్రిక – సాక్షి పత్రిక

with one comment

అసలే కాంగ్రెస్ పత్రిక ఆపై సెజ్ బాబులు పెట్టుబడి పెట్టిన పత్రిక. ఇక వార్తలు ఖూనీ కాక మరేం అవుతాయి? పోలేపల్లి సెజ్ ఉద్యమాన్ని సాక్షి పత్రిక కవర్ చేస్తున్న విధానం చూస్తే వ్యాపార, రాజకీయ ప్రయోజనాలే పరమావధిగా నడిచే వార్తా పత్రికలు ఎంత భ్రష్టు పట్టిపోయాయో ఇట్టే అర్ధం అవుతుంది. “పెట్టుబడికి పుట్టిన ఈ విష పుత్రిక” పోలేపల్లి సెజ్ బాధిత రైతుల వాణి వినిపించకుండా, ఒక వేళ వినిపించినా అందులోని ప్రభుత్వ వ్యతిరేక కోణాన్ని చాలా జాగ్రత్తగా ఎడిట్ చేసి వార్తలు ప్రచురిస్తోంది. ఇదివరకు ఒకసారి “ఈనాడు” దినపత్రిక లో పోలేపల్లి సెజ్ గురించి వచ్చిన వార్తను ఖండించేందుకు చేసిన ప్రయత్నంలో కూడా సాక్షి అనేక అర్థ సత్యాలను, అబద్ధాలనూ వల్లెవేసింది. 

చిరంజీవి పోలేపల్లి పర్యటన సమయంలో సాక్షి ఇదే ఎత్తుగడ వాడింది. తాజాగా నిన్న సి.పి.ఐ హైదరాబాద్ లో ప్రత్యేక ఆర్థిక మండలులపై ఏర్పాటు చేసిన రౌండ్ టేబుల్ సమావేశాన్ని రిపోర్ట్ చేయడంలో కూడా సాక్షి మరొకసారి తన అసలు రంగును ప్రదర్శించింది.  

నిన్నటి సమావేశంలో అన్ని రాజకీయ పార్టీల నేతలతో పాటు పోలేపల్లి బాధితులు కూడా పాల్గొన్నారు. పోలేపల్లి రైతులు ఇతర అన్ని సమావేశాల్లో మాట్లాడినట్టుగానే ఈ సమావేశంలో కూడా గత ప్రభుత్వాన్నీ, ఇప్పటి ప్రభుత్వాన్నీ తూర్పారా పట్టారు. అయితే సాక్షి పత్రిక పోలేపల్లి బాధిత రైతులు కేవలం తెలుగు దేశం ప్రభుత్వాన్నే విమర్శించారనే అర్ధ సత్యాన్ని తాటికాయంత అక్షరాలతో రాసింది. వార్త చివరలో కాంగ్రెస్ మోసం గురించి బాధితులు మాట్లాడిన మాటలు మాత్రం మొక్కుబడిగా ప్రస్తావించి తెలుగు దేశంపై చేసిన ఆరోపణలు మాత్రం ప్రముఖంగా ప్రస్తావించింది.

పోలేపల్లి సెజ్ లో పెట్టుబడి పెట్టిన అరబిందో ఫార్మా, హెటెరో డ్రగ్స్ సంస్థలే సాక్షి పత్రికలో వాటాదారులన్న సంగతి రాష్ట్ర ప్రజానీకానికంతటికీ తెలుసు. అందుకే పోలేపల్లి సెజ్ వ్యతిరేక ఉద్యమ వార్తల కవరేజ్ లో సాక్షి ఇంత వివక్ష ప్రదర్శిస్తోంది.

“టీడిపి కి బాధితుల ఝలక్” పేరిట ప్రచురితమైన సాక్షి వార్తను కింద చూడండి:

 

Advertisements

Written by dilkibaatein

October 20, 2008 at 12:00 pm

One Response

Subscribe to comments with RSS.

  1. anni patrikalu ilage unnayi. prati patrika yedo oka partyki kulaniki kommu kastunni.

    satyavadi

    October 20, 2008 at 7:11 pm


Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

%d bloggers like this: