Fighting Injustice in Polepally SEZ

…more than courage it takes WILL to stand up against injustice !

సమష్ఠి ఉద్యమం

leave a comment »

స్టేషన్‌ మహబూబ్‌నగర్‌, నవంబర్‌ 2 (ఆన్‌లైన్‌) : పోలేపల్లి సెజ్‌ బాధితులకు న్యాయం చేకూర్చేందుకు ఈ నెల నుండి ఉద్యమం చేపట్టనున్నామని అఖిలపక్ష పార్టీల నేతలు ప్రకటించారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని రోడ్లు భవనాల శాఖ అతిథి గృహంలో జరిగిన విలేకరుల సమావేశంలో సిపిఐ జిల్లా కార్యదర్శి ఈర్ల నర్సింహ్మ మాట్లాడారు. అమాయక రైతుల నుండి స్వాధీన పరుచుకున్న భూములు వారికి తిరిగి దక్కే వరకూ అఖిల పక్ష పార్టీలన్నీ సమిష్టి ఉద్యమానికి శ్రీకారం చుట్టనున్నట్లు తెలిపారు. ఇందులో బాగంగా ఈ నెల 4 పోలేపల్లిలో నిర్వహించే మహాధర్నాకు సిపిఐ రాష్ట్ర కార్యదర్శి డాక్టర్‌ నారాయణ, సిపియం కార్యదర్శి బి.వి.రాఘవు లు, టిడిపి పార్లమెంటరీ నాయకులు ఎర్రం నాయుడు, టిఆర్‌ఎస్‌ అధినేత కె.చంద్రశేఖర్‌ రావు, ప్రజారాజ్యం పార్టీ నేత డాక్టర్‌ మిత్ర, లోక్‌సత్తా నాయకుడు బోడేపూడి సత్యానారాయణ, యంబిటి నాయకులు అంజదుల్లాఖాన్‌, జనతాదల్‌ (యస్‌) రాష్ట్ర నాయకులు ప్రకాశ్‌, ఆంధ్రప్రదేశ్‌ రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు రామకృష్ణ తదితరులు హాజరవుతారని తెలిపారు.

సిపియం జిల్లా కార్యదర్శి కిల్లె గోపాల్‌ మాట్లాడుతూ ప్రకటనలకు కోట్లాది రూపాయలను వెచ్చిస్తున్న ప్రభుత్వం రైతుల, ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కరించడంలో విఫలమైందన్నారు. ప్రభుత్వం అధికారం లోకి వచ్చినప్పటి నుండి ఇప్పటి వరకు 150 కోట్ల రూపాయలను ప్రచారానికి ఖర్చు చేసిందని, ఇది ఎంత వరకు సమసంజమని ప్రశ్నించారు. పోలేపల్లి బాధితులకు న్యాయం జరగే వరకూ దశల వారిగా పోరాటం సాగిస్తామని అన్నారు. టిఆర్‌ఎస్‌ జిల్లా అధ్యక్షుడు యెన్నం శ్రీనివాస్‌రెడ్డి మాట్లాడుతూ ప్రజలకు మేలు చేయడంలో విఫలమైన ప్రభుత్వం పేదల భూములను సెజ్‌ల రూపంలో స్వాధీన పర్చుకొని వ్యాపారం చేస్తోందని ఆరోపించారు. పోలేపల్లి సెజ్‌ భాదితులకు న్యాయం జరిగే వరకు అన్ని పార్టీలు సమిష్ఠిగా పోరాటాన్ని సాగించాలన్నారు. కార్యక్రమంలో టిఆర్‌ఎస్‌ రాష్ట్ర కార్యదర్శి అనీఫ్‌ అహ్మద్‌, టిడిపి ప్రచార కార్యదర్శి సురేందర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Courtesy: Andhrajyothy 03 Nov 2008

Advertisements

Written by dilkibaatein

November 3, 2008 at 12:40 pm

Posted in News Archive, Telugu

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

%d bloggers like this: